https://oktelugu.com/

Antarctica: అంటార్కిటికాలో అతిపెద్ద ఐస్ బర్గ్ కాలగర్భంలో?.. ప్రపంచానికి ముప్పు పొంచి ఉందా?

ఈ భూమ్మీద ఉన్న ఖండాలలో అన్ని మనిషి జీవనానికి అనువుగా ఉంటాయి. అంటార్కిటికా మాత్రం విభిన్నంగా ఉంటుంది. ఇక్కడ ఏడాది పాటు మంచు కురుస్తూనే ఉంటుంది. ఇక్కడ మంచు ఉండడం వల్లే సముద్ర జలాల మట్టం పెరగకుండా ఉంటుంది. వాతావరణంలో సమతౌల్యం సరిగ్గా ఉంటుంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : December 26, 2024 / 02:14 PM IST

    Antarctica

    Follow us on

    Antarctica: కొంతకాలంగా వాతావరణంలో కాలుష్యం పెరగడంతో అంటార్కిటికాలో మంచు కరుగుతోంది. ఫలితంగా సముద్ర జలాల మట్టాలు పెరుగుతున్నాయి. దీంతో తీర ప్రాంత నగరాలు కాలగర్భంలో కలిసిపోయే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అయితే అంటార్కికా తల మానికంగా ఉన్న ఓ ఐస్ బర్గ్ కాలగర్భంలో కలిసిపోయే ప్రమాదంలో పడింది. అంటార్కిటికాలో ఏ 23 ఏ పేరుతో ఉన్న ఓ అతిపెద్ద ఐస్ బర్గ్ కాలగర్భంలో కలిసిపోనుంది. దీని విస్తీర్ణం 3672 చదరపు కిలోమీటర్లు. ఇందులో అనేక ద్వారాలు ఉంటాయి. అందమైన గుహలు కూడా ఉంటాయి. పర్యాటకులను ఈ ఐస్ బర్గ్ విశేషంగా ఆకర్షిస్తుంది.

    1986లో ఫిల్ క్నర్ రోన్ అనే మంచు ఫలకం నుంచి ఇది విడిపోయింది. కొద్ది సంవత్సరాల పాటు కొంత దూరం కదిలింది. ఆ తర్వాత అంటార్కిటికాలోనే వెడ్ డెల్ అనే సముద్ర ఉపరితలంపై తిష్ట వేసుకొని ఉంది. గత 30 సంవత్సరాలుగా అది అక్కడే ఉంది.. అయితే ఇది 2020 నుంచి స్వల్పంగా కరగడం మొదలుపెట్టింది. ఇప్పుడు కదలడం ప్రారంభించింది. అంటార్కిటికాలోనే టైలర్ కాలమ్ ను ఇది తాకింది. దీంతో కొద్దెనెలలుగా అక్కడే ఆగిపోయింది. మంచు కరుగుతున్న నేపథ్యంలో కొద్దిరోజులుగా మళ్లీ దాని నుంచి కదలికలు మొదలయ్యాయి. ఈ విషయాన్ని బ్రిటిష్ అంటార్కిటిక్ సర్వే బృందం బయటి ప్రపంచానికి తెలిపింది. ” ఐస్ బర్గ్ కదలికలు సాగుతున్నాయి. సముద్ర ప్రవాహాల తాకిడి దీనికి అధికంగా ఉంది. అందువల్లే ఇది వెచ్చని జలాల వైపు వెళ్తోంది.. దీని ప్రయాణం సౌత్ జార్జియా లోని మారుమూల దీవుల మీదుగా వెళ్లే అవకాశం ఉంది. క్రమక్రమంగా ఇది కరుగుతుంది. ఆ తర్వాత పూర్తిగా కాలగర్భంలో కలిసిపోతుంది. ప్రస్తుతం దీనిమీద అధ్యయనం సాగిస్తున్నాం. మొట్టమొదటిసారిగా దీనిని 1986లో శాస్త్రవేత్తలు గమనించారు. అప్పట్లో దీని విస్తీర్ణం 3900 చదరపు కిలోమీటర్లు ఉండేది. ఆ తర్వాత దాని విస్తీర్ణం తగ్గడం ప్రారంభమైంది. చాలా రోజుల వరకు ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఐస్ బర్గ్ గా పేరుపొందింది. 2017లో ఏ 68, 2021 లో ఏ 78 వంటి ఐస్ బర్గ్ లు వెలుగులోకి వచ్చినప్పటికీ.. వాతావరణంలో మార్పుల వల్ల అవి చూస్తుండగానే కరిగిపోయాయి. ఏ 23 ఏ మాత్రం అలాగే ఉండిపోయిందని” శాస్త్రవేత్తలు అంటున్నారు.

    తాజా కదలికలు ఏం చెబుతున్నాయంటే..

    కొంతకాలంగా భూగోళం మీద ఉష్ణోగ్రతలు కనివిని ఎరుగని స్థాయిలో పెరుగుతున్నాయి. ఆసియా నుంచి యూరప్ అని తేడా లేకుండా వేసవికాలంలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. శీతల ప్రాంతం గా పేరుపొందిన యూరప్ లోనూ ఎండ వేడిమి అధికంగా ఉండడం శాస్త్రవేత్తలను ఆందోళనకు గురిచేస్తోంది. మరోవైపు ఈ మంచు ఫలకాలు కరిగిపోవడం వారిని భయభ్రాంతులకు గురయ్యేలా చేస్తోంది. వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల వల్లే మంచు ఫలకాలు కరిగిపోతున్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. అయితే ఈ మంచు ఫలకాలు కరిగిపోవడం వల్ల ప్రస్తుతానికైతే సముద్ర మట్టాలు పెరగవని.. అలాగని భవిష్యత్తులో పెరిగే ప్రమాదం లేకపోలేదని శాస్త్రవేత్తలు అంటున్నారు. వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల వల్లే ఈ మంచు ఫలకాలు కరిగిపోతున్నాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.