Homeజాతీయ వార్తలుTelangana Politics: ఇదిగో జాబితా.. తెలంగాణ ఎన్నికల్లో వీరే అభ్యర్థులు

Telangana Politics: ఇదిగో జాబితా.. తెలంగాణ ఎన్నికల్లో వీరే అభ్యర్థులు

Telangana Politics: మరో మూడు నెలల్లో తెలంగాణలో ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పటికే పార్టీలు అనధికారికంగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాయి. అంతేకాదు మైండ్ గేమ్ ఆడటం కూడా ప్రారంభించాయి. ఈ దఫా అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ సాధించాలని భారత రాష్ట్ర సమితి అనుకుంటున్నది. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని బిజెపి భావిస్తోంది.. తెలంగాణ ఇచ్చిన పార్టీగా అధికారంలోకి వచ్చి సత్తా చాటాలని కాంగ్రెస్ పార్టీ అనుకుంటున్నది. ఈ క్రమంలోనే రాజకీయ పార్టీలు ఎన్నికల స్టంట్ ప్రదర్శిస్తున్నాయి. ఇదే మా తొలి జాబితా అంటూ హడావిడి చేస్తున్నాయి. శ్రావణమాసం రాగానే తొలి జాబితా ప్రకటిస్తామని హంగామా చేస్తున్నాయి. క్షేత్రస్థాయి పరిస్థితి చూస్తే అలా కనిపించడం లేదు.

అధికారం, ప్రతి పక్ష పార్టీ అని తేడా లేకుండా అన్ని పార్టీల్లో ఎక్కువ పోటీ ఉంది. దీంతో గత మూడు, నాలుగు నెలల నుంచి ఇదిగో అభ్యర్థుల జాబితా.. అదిగో అభ్యర్థుల జాబితా అంటూ పార్టీలు హడావిడి చేస్తున్నాయి. ఇప్పుడు తాజాగా శ్రావణ శుక్రవారం రోజు జాబితా ప్రకటిస్తామని అంటున్నాయి.. మొన్నటిదాకా విషయంలో భారత రాష్ట్ర సమితి హడావిడి చేసేది. ఇప్పుడు మిగతా బీజేపీ, కాంగ్రెస్ కూడా అదే దారిలో పయనిస్తున్నాయి.. భారత రాష్ట్ర సమితి అధినేత అనేక రకాల సర్వేలు చేసి, అభ్యర్థుల బలాబలాలను బేరీజు వేసుకుని సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. కానీ కెసిఆర్ నేరుగా జాబితా ప్రకటించరని, షెడ్యూల్ ప్రకటించే వరకూ ఆగుతారు అనే అంచనాలు కూడా ఆ పార్టీలో వినిపిస్తున్నాయి. కెసిఆర్ జాబితా ప్రకటిస్తారనే ప్రచారం ప్రారంభం కాగానే కాంగ్రెస్, బిజెపి కూడా అదే తరహా సమాచారాన్ని మీడియాకు లీక్ చేస్తున్నాయి. తొలి జాబితాపై కసరత్తు పూర్తి చేసిన రాష్ట్ర నాయకులు జాతీయ నాయకత్వానికి నివేదిక పంపించినట్టు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఈ జాబితాకు హైకమాండ్ ఆమోదం తెలిపితే త్వరలోనే అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. కొంత మంది పేర్లతో ఓ జాబితా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇక బిజెపి కూడా అదే దారిలో నడుస్తోంది. రాష్ట్రంలో బిజెపికి ఉన్న నలుగురు ఎంపీలతో పాటు సీనియర్ నేతలు మొత్తం అసెంబ్లీకి పోటీ చేయాలని బిజెపి అధిష్టానం అంతర్గతంగా ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. మొత్తంగా 60 మంది అభ్యర్థులతో బిజెపి మొదటి జాబితాన్ని విడుదల చేయాలని ఆలోచనలో ఉన్నట్టు మీడియాకు లీకులు ఇస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజల్లో తాము వెనుకబడిపోయామనే అభిప్రాయం ఏర్పడకుండా ఉండడానికేననే సంకేతాలు పంపిస్తున్నాయి. ప్రస్తుతం పోటీ తీవ్రంగా నేపథ్యంలో ఏ రాజకీయ పార్టీ కూడా అత్యంత తొందరగా అభ్యర్థులను ప్రకటించదు. ఒక పార్టీ కొన్ని నియోజకవర్గాలలో అభ్యర్థులను ప్రకటించిన తర్వాత మిగిలిన ప్రధాన పార్టీలు అభ్యర్థులను ఖరారు చేసేందుకు వ్యూహాలు రచిస్తాయి. ఆ పార్టీలో కేంద్ర ఎన్నికల కమిటీలు గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే అభ్యర్థులను ప్రకటిస్తాయి. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటారు. భారత రాష్ట్ర సమితి పెద్దలు మాత్రం ముందుగానే అనుకున్నట్టుగా అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.. కాగా మీడియాలో ప్రచారం జరుగుతున్నట్టు ఇతర పార్టీలపై మైండ్ గేమ్ కోసమే భారత రాష్ట్ర సమితి కొన్ని పేర్లు లీక్ చేస్తోంది అనే వాదనలు కూడా ఉన్నాయి.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version