
Janasena: జనసేన పార్టీ ప్రభావం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చాలా కీలకంగా మారబోతోంది.పవన్ కళ్యాణ్ ఇంకా బస్సు యాత్ర ప్రారంభించకముందే ఆయన బలం ఎవ్వరూ ఊహించని రేంజ్ లో పెరిగిందని సర్వే రిపోర్ట్స్ తెలుపుతున్నాయి. అందుకే వైసీపీ పార్టీ కూడా ఈసారి జనసేన పార్టీ ని చాలా సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తుంది.2019 ఎన్నికలలో జనసేన పార్టీ కి 7 శాతం ఓట్లు వచ్చాయి.ప్రస్తుతం ఉన్న వోట్ బ్యాంకు ని పరిశీలిస్తే జనసేన పార్టీ 12 శాతం కి పెరిగిందని తెలుస్తుంది.ముఖ్యంగా కోస్తాంధ్ర లో జనసేన పార్టీ ప్రభావం రెండు పార్టీలకు కూడా ఒక రేంజ్ లో దెబ్బ కొట్టబోతుందట. అందుకే తెలుగు దేశం పార్టీ జనసేన తో పొత్తు పెట్టుకునేందుకు తహతహలాడుతోంది.పొత్తు కానీ ఖరారు అయితే వైసీపీ పార్టీ ఓడిపోవడం ఖాయమని ప్రశాంత్ కిషోర్ టీం కూడా జగన్ కి హెచ్చరికలు జారీ చేసింది.
ఇదంతా పక్కన పెడితే జనసేన సొంతగా పోటీ చేస్తే ఈసారి 20 స్థానాల్లో కచ్చితంగా గెలుస్తుందని సర్వే రిపోర్ట్స్ చెప్తున్నాయి.ఈ 20 స్థానాల్లో ముందుగా ఈ పార్టీ గెలవబోయ్యేది భీమవరం లోనే, 2019 వ సంవత్సరం లో పవన్ కళ్యాణ్ ఈ స్థానం నుండి పోటీ చేసి ఓడిపోయాడు, ఆయన ఓడిపోవడానికి ప్రధాన కారణం రెండు గ్రామాలే అని తెలుస్తుంది.ఇప్పుడు ఆ గ్రామాల్లో కూడా జనసేన పార్టీ పదింతలు బలం పుంజుకుందట.ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు పెట్టినా, జనసేన పార్టీ 20 వేల ఓట్ల మెజారిటీ తో ఆ స్థానాన్ని కైవసం చేసుకుంటుందని చెప్తున్నారు విశ్లేషకులు.ఇక జనసేన పార్టీ గెలుచుకోబోయ్యే రెండవ స్థానం పిఠాపురం.ఇక్కడ ఈ పార్టీ కి ఈసారి 50 శాతం కి పైగా ఓట్లు పడుతాయని తెలుస్తుంది.వీటితో పాటుగా గాజువాక, తాడేపల్లి గూడెం , మరియు రాజోలు వంటి ప్రాంతాలలో జనసేన పార్టీ కచ్చితంగా తన జెండాని ఎగురవేస్తుందని సర్వే రిపోర్ట్స్ తెలుపుతున్నాయి.

ఇక వీటితో పాటుగా ముమిడివరం, తుని , కాకినాడ రూరల్ వంటి ప్రాంతాలలో కూడా జనసేన గెలిచేందుకు అనూకలమైన నిజయోజకవర్గాలు అట.మరో విశేషం ఏమిటంటే కాకినాడ రూరల్ నుండి ఈసారి పవన్ కళ్యాణ్ పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.అమలాపురం, రాజముండ్రి రురల్, పాలకొల్లు , మండపేట , పెడన ,తణుకు, కొత్తపేట , విజయవాడ ఈస్ట్ , గుంటూరు వెస్ట్ , పెద్దాపురం మరియు అవనిగడ్డ ప్రాంతాలలో కూడా జనసేన పార్టీ ఈసారి భారీ మెజారిటీ తో గెలవబోతుందని టాక్.అదే పొత్తు లో అయితే కచ్చితంగా 40 సీట్స్ గెలిచే ఛాన్స్ ఉందని, జనసేన పార్టీ వాళ్ళు 60 సీట్స్ చంద్రబాబు నాయుడు ని అడగడం లో తప్పులేదని సర్వే రిపోర్ట్స్ చెప్తున్నాయి.పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర సక్సెస్ అయితే అసలు పొత్తు పెట్టుకోవాల్సిన అవసరమే లేదని టాక్.చూడాలిమరి రాబొయ్యే రోజుల్లో ఏమి జరగబోతుంది అనేది.