
Manchu Manoj- Pranathi Reddy: మంచు మనోజ్ రెండవ పెళ్లి నిన్న హైదరాబాద్ లోని లక్ష్మీ ప్రసన్న స్వగృహం లో బంధుమిత్రుల సమక్ష్యం లో చాలా సాధారణంగా జరిగిన సంగతి అందరికీ తెలిసిందే.వీళ్ళ పెళ్ళికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.ఇది ఇలా ఉండగా మంచు లక్ష్మీ ప్రేమించి పెళ్లి చేసుకున్న మొదటి భార్య ప్రణతి రెడ్డి కూడా ఈ వివాహానికి వచ్చినట్టు సోషల్ మీడియా లో ఒక రూమర్ జోరుగా ప్రచారం సాగుతుంది.
నిన్న రాత్రి ఆమె ఈ పెళ్ళికి హాజరై మంచు మనోజ్ కి బెస్ట్ విషెస్ చెప్పి వెళ్లిందట.ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన అంశం.వీళ్లిద్దరి మధ్య కొన్ని విభేదాలు వచ్చినప్పటికీ విడిపోవడం మాత్రం గొడవలతో విడిపోలేదని స్వయంగా మనోజ్ పలు సందర్భాలలో తెలిపాడు.తాను ఇప్పటికి తనతో స్నేహపూర్వకంగానే ఉంటుందని, నేను కూడా ఆమెతో ఒక వెల్ విషర్ గా ఉంటానని పలు ఇంటర్వ్యూస్ లో చెప్పిన సందర్భాలు ఉన్నాయి.
ఇద్దరి మధ్య భిన్నాభిప్రాయాలు ఉంటాయి, అవి నచ్చనప్పుడు ఇలా విడిపోవడం వంటివి జరుగుతాయి కానీ, మా మధ్య ఎలాంటి గొడవలు లేవు అంటూ మంచు మనోజ్ అంటూ ఉంటాడు.తనతో విడిపోయిన తర్వాత ఆమె అమెరికాకి వెళ్ళిపోయింది.

వృత్తిరీత్యా ఒక గొప్ప ఇల్లుస్ట్రేషన్ ఆర్టిస్టుగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించిన ప్రణతి రెడ్డి, ప్రస్తుతం ఆ వృత్తిలోనే బిజీ గా గడుపుతుంది సమాచారం.అయితే ఈమె మనోజ్ లాగా రెండవ పెళ్లి చేసుకోలేదు, ప్రస్తుతానికి ఆమె సింగల్ గానే ఉన్నట్టు టాక్.ఏది ఏమైనా మనోడు మరోసారి పెళ్లి చేసుకున్నాడు, ఇది కూడా ప్రేమ పెళ్లే కాబట్టి భవిష్యత్తులో ఎలాంటి విబేధాలు లేకుండా సంతోషంగా జీవించాల్సిందిగా అభిమానులు ఈ సందర్భంగా సోషల్ మీడియా లో మనోజ్ కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.