ఆ మద్యం షాపు దగ్గర ఒక్కరు లేరు..!

రాష్ట్ర వ్యాప్తంగా 40 రోజుల లాక్ డౌన్ అనంతరం తిరిగి ప్రభుత్వ ఆదేశాలతో మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. దీంతో దుకాణాల వద్ద సామాజిక దూరం పాటించకుండా, మాస్కులు ధరించకుండా మద్యం ప్రియులు క్యూ కట్టారు. కొన్ని చోట్ల తోపులాటలు జరిగాయి. మద్యం షాపుల వద్ద పోలీసులు కాపలా ఉన్నా ఫలితం లేదు. వీటన్నిటికీ విరుద్ధంగా ఒక గ్రామంలో మాత్రం మద్యం షాపు తెరిచి ఉన్నా ఒక్కరు మద్యం కొనేందుకు రాలేదు. ఆ షాపు వద్ద పోలీసుల కాపలా […]

Written By: Neelambaram, Updated On : May 4, 2020 7:38 pm
Follow us on


రాష్ట్ర వ్యాప్తంగా 40 రోజుల లాక్ డౌన్ అనంతరం తిరిగి ప్రభుత్వ ఆదేశాలతో మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. దీంతో దుకాణాల వద్ద సామాజిక దూరం పాటించకుండా, మాస్కులు ధరించకుండా మద్యం ప్రియులు క్యూ కట్టారు. కొన్ని చోట్ల తోపులాటలు జరిగాయి. మద్యం షాపుల వద్ద పోలీసులు కాపలా ఉన్నా ఫలితం లేదు. వీటన్నిటికీ విరుద్ధంగా ఒక గ్రామంలో మాత్రం మద్యం షాపు తెరిచి ఉన్నా ఒక్కరు మద్యం కొనేందుకు రాలేదు. ఆ షాపు వద్ద పోలీసుల కాపలా లేరు. అక్కడ క్యూ లైను లేదు. తోపులాటలు లేవు. ఏంటి ఈ ఆశ్చర్యం అనుకుంటున్నారా. అక్కడ ఆ గ్రామ మహిళలు ఉన్నారు.

కరోనాను జీవితంలో భాగం చేసుకోవాల్సిందేనా?

ఈ సంఘటన కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం వెంట్రప్రగడ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే గ్రామంలో ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణాన్ని ఈ రోజు అన్ని మద్యం షాపుల్లాగానే ఉదయం 11 గంటలకు తెరుచుకుంది. స్థానికంగా ఉండే మహిళలు దుకాణం వద్దకు చేరుకొవడంతో మద్యం కొనేందుకు ఎవరు దైర్యం చేయలేదు. కరోనా తీవ్రత దృష్ట్య మద్యం దుకాణాన్ని తెరవడానికి వీల్లేదని, దుకాణం తెరవడం వల్ల చుట్టూ ప్రక్కల గ్రామాల వారు ఇక్కడకు వస్తే కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉందన దుకాణాన్ని మూసేయాలని కోరారు. దీంతో చేసేదేమీ లేక అధికారులు కొద్దిసేపటికి దుకాణం సర్దేశారు.

లాక్ డౌన్ లో పరవళ్లు తొక్కుతున్న మందుబాబులు

మరోవైపు జిల్లాలోని మచిలీపట్నం రెడ్ జోన్లో ఉంది. సమీపాన గ్రీన్ జోన్ లో ఉన్న గూడూరు కి చేరుకున్న మచిలీపట్నం, చిలకలపూడి ప్రాంతాలకు చెందిన వేలాది మంది మద్యం ప్రియులతో అక్కడి షాపుల వద్ద రద్దీ పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ జోన్ లకు సమీపంలో ఉన్న గ్రీన్ , ఆరెంజ్ జోన్ల లోకి మద్యం బాబుల చొరబాటు యత్నాలు జోరుగా సాగుతున్నాయి. రెడ్ జోన్ వారిని రానివ్వమని పోలీసు ఉన్నతాధికారులు చెప్పినా క్షేత్ర స్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఫలితంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇదే తీరు కొనసాగితే రెడ్, గ్రీన్ జోన్ లు ఏకం పాకం కానున్నాయి. మద్యం అమ్మకాల పుణ్యమా అని, “కరోనా కమ్యూనిటీ స్ప్రెడ్” కొనసాగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.