కరోనా విపత్తు వల్ల సినిమా రంగానికి సంబందించిన అన్ని విభాగాలు ఇబ్బందుల్లో పడ్డాయి. షూటింగులు లేక సినిమాలు ఆగిపోయాయి. ఇక రెడీ అయిన సినిమాలు విడుదలకు నోచుకోవట్లేదు..సినిమాలు ప్రదర్శించడం ఆగిపోయి థియేటర్ లు మూతబడ్డాయి దాంతో థియేటర్ల మీద ఆధారపడి బతికే వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఈ విషయం బాగా తెలిసిన సినీ హీరోల ఫాన్స్ ఒక గొప్ప పనిచేశారు .
కరోనాను జీవితంలో భాగం చేసుకోవాల్సిందేనా?
ఆంధ్ర ప్రదేశ్ లోని విజయనగరం పట్టణం లో ఉన్న మెగా హీరోల ఫాన్స్ ,అక్కినేని ఫాన్స్ , ఘట్టమనేని ఫాన్స్ , ప్రభాస్ ఫాన్స్ అందరూ కల్సి ఒకే త్రాటి పైకి వచ్చి తమకు తోచిన రీతిలో విజయనగరం థియేటర్లలో పనిచేసే సిబ్బందికి నిత్యావసరాలు సరఫరా చేశారు. మెగా హీరోల ఫాన్స్ 500 కిలోల బియ్యం ఇవ్వగా , ప్రభాస్ ఫాన్స్ 120 కిలోల గోధుమ పిండి ,గోధుమ రవ్వ ఇవ్వడం జరిగింది ఇక ఘట్టమనేని ఫాన్స్ 60 కందిపప్పు , శనగ పప్పు ఇవ్వగా , అక్కినేని ఫాన్స్ 110 కిలోల ఆయిల్ పాకెట్స్ ఇవ్వడం జరిగింది. తమ హీరోలను దేవుళ్లుగా , సినిమా థియేటర్ లను దేవాలయాలుగా భావించే సినీ అభిమానులు ఒక గొప్ప పనికి శ్రీకారం చుట్టి అందరిచేత శభాష్ అనిపించు కున్నారు .