https://oktelugu.com/

PM Narendra Modi: త‌ర్వాత టార్గెట్ ఆ రెండు రాష్ట్ర‌లే.. మోడీ వ్యూహం మొద‌లెట్టేశారు

PM Narendra Modi: ప్రధాని మోడీ హవా రోజురోజుకు పెరుగుతూనే ఉంది. వయసు మీద పడుతున్నా సరే యువకుడిలా మరింత ఉత్సాహంగా పని చేస్తున్నారు. ఆయన పనితనానికి నిదర్శనమే నిన్న నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ గెలుపు. దీంతో మరోసారి తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు కాషాయ అగ్రనేత. ఇదే ఊపులో ఇప్పుడు మరో రెండు రాష్ట్రాలపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అది కూడా కీలక రాష్ట్రాలైన గుజరాత్, హిమాచల్ ప్రదేశ్. ఈ ఏడాది చివరికల్లా ఈ రెండు […]

Written By:
  • Mallesh
  • , Updated On : March 11, 2022 / 01:01 PM IST
    Follow us on

    PM Narendra Modi: ప్రధాని మోడీ హవా రోజురోజుకు పెరుగుతూనే ఉంది. వయసు మీద పడుతున్నా సరే యువకుడిలా మరింత ఉత్సాహంగా పని చేస్తున్నారు. ఆయన పనితనానికి నిదర్శనమే నిన్న నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ గెలుపు. దీంతో మరోసారి తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు కాషాయ అగ్రనేత. ఇదే ఊపులో ఇప్పుడు మరో రెండు రాష్ట్రాలపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.

    PM Narendra Modi

    అది కూడా కీలక రాష్ట్రాలైన గుజరాత్, హిమాచల్ ప్రదేశ్. ఈ ఏడాది చివరికల్లా ఈ రెండు రాష్ట్రాల్లో శాసనసభ పదవీకాలం ముగుస్తుంది. కాబట్టి ఇప్పటి నుంచే ఆ రెండు రాష్ట్రాలపై మోడీ తన మార్కు రాజకీయాన్ని మొద‌లు పెట్టాలనుకుంటున్నారు. త‌న సొంత రాష్ట్ర‌మైన గుజరాత్ లో గత 27 ఏళ్లుగా బీజేపీ అధికారంలో ఉంది. ఇదే పరంపరను మరోసారి కొనసాగించాల‌నుకుంటున్నారు మోడీ.

    Also Read:  ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త.. ఆ కార్డుతో రూ.5 లక్షల భీమా?

    గుజరాత్ లో గత ఎన్నికల్లో కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చింది. ఇప్పుడు పంజాబ్ లో గెలిచిన జోష్ లో ఆప్ పార్టీ కూడా వచ్చే ఎన్నికల్లో గుజరాత్‌లో బరిలోకి దిగాలని చూస్తుంది. కాబట్టి రెండు పార్టీలను ఎదుర్కోవాలంటే ఇప్పటి నుంచే విశ్రమించకుండా వ్యూహాలకు పదును పెట్టాలని మోడీ భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఈరోజు నుంచి రెండు రోజులపాటు గుజరాత్ లో పర్యటించనున్నారు. దాదాపు నాలుగు లక్షల మందితో రోడ్ షో నిర్వహించి, అనంతరం గాంధీనగర్ లోనీ పార్టీ ఆఫీస్ కి వెళ్తారు.

    అక్కడ పార్టీ ముఖ్యనేతలతో వచ్చే ఎన్నికలపై దిశానిర్దేశం చేస్తారు. ఎలాంటి వ్యూహాలను అనుసరించాలి, ఎలాంటి పథకాలను అమలు చేయాలో కొన్ని సలహాలు ఇవ్వనున్నారు. నాలుగు రాష్ట్రాల్లో మొదలైన విజయోత్సవ వేడుకలు గుజరాత్ లో కూడా వచ్చే ఏడాది జరగాలన్నది మోడీ అసలైన ప్లాన్.

    PM Narendra Modi

    ఈ కారణాల వల్లనే మోడీ విశ్రాంతి లేకుండా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గుజరాత్ తర్వాత హిమాచల్ ప్రదేశ్ పై కూడా గట్టి ప్లాన్ వేయనున్నారు. అక్కడ కూడా ఇలాంటి రోడ్ షోలు నిర్వహించి నాలుగు రాష్ట్రాల్లో గెలిచిన వేవ్ ను అక్కడ ప్రతిబింబించేలా ప్లాన్ చేస్తున్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గెలవాలనే వ్యూహంలో భాగంగానే ఇలా నిరంతరాయంగా అన్ని రాష్ట్రాల పై ఫోకస్ పెడుతున్నారు మోడీ. మరి ఆయన మార్కు రాజకీయం గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లో కూడా కనిపిస్తుందా లేదా అన్నది చూడాలి.

    Also Read:  యూపీలో ఎంఐఎం వల్ల ఎస్పీ ఘోరంగా ఓడిపోయిందా? బీజేపీ గెలిచిందా?

    Tags