AP Ticket price issue: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం థియేటర్లపై జులుం చేస్తోంది. దీంతో యాజమాన్యాలు థియేటర్ల మూసివేతకే నిర్ణయం తీసుకుంటున్నాయి. కొవిడ్ నేపథ్యంలో కొద్ది రోజులుగా మూత పడిన థియేటర్లు ప్రస్తుతం తెరిచినా ప్రయోజనం మాత్రం శూన్యమే అని తెలుస్తోంది. టికెట్ల రేట్లు తగ్గించడంతో ఇక చేసేది లేక మూసివేయాలనే నిర్ణయించుకున్నారు. ప్రభుత్వ నిర్వాకంతో నష్టాలే తప్ప లాభాలు మాత్రం దేవుడెరుగు అనే వాదన వినిపిస్తోంది. రాబోయే రోజుల్లో మరిన్ని థియేటర్లు కూడా మూతపడి సినీ పరిశ్రమ కష్టాలే ఎదుర్కోనున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే రాష్ర్ట వ్యాప్తంగా పలు జిల్లాల్లో థియేటర్ల యజమానులు స్వచ్ఛంధంగా మూసివేస్తున్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోతో టికెట్ల ధరలు భారీగా తగ్గాయి. దీంతో థియేటర్లను నడపడం కూడా కష్టమే అని తెలిసిపోతోంది. కనీసం నిర్వహణ ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేదు. దీంతో తాము థియేటర్లు ఎలా నడిపేదని యాజమాన్యాలు చెబుతున్నాయి. ప్రభుత్వం థియేటర్ల మనుగడకు అడ్డు పడుతన్నాయని వాపోతున్నారు.
Also Read: టాలీవుడ్ కు ‘సినిమా’ చూపిస్తున్న జగన్
థియేటర్ల ఖర్చుల కోసం నెలకు కనీసం రూ. 3 లక్షల నుంచి 5 లక్షల వరకు ఖర్చు అవుతోంది. ప్రభుత్వం నిర్దేశించిన ధరలతో అందులో కనీసం సగం కూడా వచ్చే పరిస్థితి లేదు. ఈ క్రమంలో థియేటర్ల నిర్వహణ భారంగా పరిణమిస్తోంది. నిర్వహణ ఖర్చులు కూడా సరిపోకపోవడంతో నష్టాల్లో నిర్వహణ కష్టమే అని తెలుస్తోంది.
మరోవైపు థియేటర్లపై తనిఖీలు చేస్తుండటంతో యజమానులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల పేరుతో థియేటర్ల మూసివేతకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. దీంతో థియేటర్ల యజమానులు ఇన నిర్వహణ సాధ్యం కాదని మూసివేతకు నిర్ణయం తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వినోదం కాస్త మరో దారి పడుతున్నట్లు తెలుస్తోంది.
Also Read: ఏపీలో థియేటర్లపై ప్రభుత్వం కఠిన చర్యలు.. తాజాగా చిత్తూరులో 17 హాళ్లు క్లోజ్