https://oktelugu.com/

Narayana : నారాయణ ఇంటి గుట్టు వీధిలోకి.. వదలని తమ్ముడి భార్య

నిన్న వీడియోలను విడుదల చేసిన కృష్ణప్రియ.. నేడు పోలీసులకు నేరుగా ఫిర్యాదు చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. అటు మాజీ మంత్రి నారాయణ కానీ..టిడిపి నాయకులు గానీ.. ఈ అంశంపై స్పందించడం లేదు.

Written By:
  • Dharma
  • , Updated On : July 30, 2023 / 04:34 PM IST
    Follow us on

    Narayana :  మాజీ మంత్రి నారాయణ పై ఆయన సోదరుడు భార్య కృష్ణప్రియ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అంతటితో ఆగని ఆమె నారాయణతో పాటు తన భర్త సుబ్రహ్మణ్యం మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నారంటూ హైదరాబాదులోని రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పెళ్లయిన నాటి నుంచే పెట్టపై కన్నేసిన గద్ద మాదిరిగా నారాయణ వ్యవహరించిన తీరును తన ఇన్స్టాగ్రామ్ వీడియోలో వెల్లడించిన సంగతి తెలిసిందే. త్వరలో మరో వీడియోతో కలుద్దాం అంటూ చెప్పిన విషయం విధితమే.అయితే ఆమె అనూహ్యంగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం విశేషం.

    ఇంతవరకు ఈ విషయంపై మాజీ మంత్రి నారాయణ స్పందించలేదు. కానీ అన్నకు మద్దతుగా తమ్ముడు సుబ్రహ్మణ్యం వీడియోని విడుదల చేయడం గమనార్హం. ఈయన భార్యే కృష్ణప్రియ. తన భార్య కొన్నేళ్లుగా మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. గుంటూరు,హైదరాబాద్ వైద్యం అందించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రియ తీరుతో తన కుటుంబ పరువుకు భంగం వాటిల్లిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

    ఈ ఏడాది మే లో తన భార్యకు క్యాన్సర్ ఉన్నట్లు వైద్యులు నిర్ధారించిన విషయాన్ని వెల్లడించారు. యశోద ఆసుపత్రిలో ఆమెకు సర్జరీ చేశారని.. ఎనిమిది కీమోథెరపీలు చేయించాలని వైద్యులు సూచించారని.. ఇప్పటివరకు రెండు చేయించినట్లు చెప్పుకొచ్చారు. క్యాన్సర్ చికిత్స కారణంగా మానసిక రోగానికి సంబంధించి మందులు వాడడం లేదన్నారు. అందుకే ఆమె అలా మాట్లాడుతున్నారు అని అర్థం వచ్చేలా ఆయన వివరించారు. ప్రియ వీడియోలను మానవతా దృక్పథంతో ఎవ్వరూ పట్టించుకోవద్దని వేడుకోవడం గమనార్హం.

    నిన్న వీడియోలను విడుదల చేసిన కృష్ణప్రియ.. నేడు పోలీసులకు నేరుగా ఫిర్యాదు చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. అటు మాజీ మంత్రి నారాయణ కానీ..టిడిపి నాయకులు గానీ.. ఈ అంశంపై స్పందించడం లేదు. ఇప్పుడు నేరుగా భర్త రంగంలో దిగి భార్య ఆరోగ్య పరిస్థితిపై చెప్పడం.. మానవతా దృక్పథంతో అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తుండడం హాట్ టాపిక్ గా మారింది. నారాయణ ఇంటిగుట్టు వీధిలోకి రావడం చర్చనీయాంశం అవుతోంది.