Aadhaar Card : వామ్మో వీడు మామూలు మోసగాడు కాదు.. ఏకంగా మోడీ, యోగి ఆధార్ కార్డులు వాడేసాడు

ప్రధానమంత్రి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆధార్ కార్డులను పలు కార్యకలాపాలకు వినియోగించాడు. అందరితో రాకుండా మోడీ, యోగి డేటాను ట్యాంపర్ చేయడానికి ఆధార్ కార్డు పోర్టల్ వినియోగించాడు.

Written By: NARESH, Updated On : July 30, 2023 4:44 pm
Follow us on

Aadhaar Card : శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలని ఒక సామెత. దాన్ని చాలామంది చాలా సందర్భాల్లో నిజం చేశారు. కానీ వీడు మాత్రం చాలా డిఫరెంట్. ఎవరైనా ఏదైనా మోసం చేసేటప్పుడు అపరిచిత బురిడీ కొట్టిస్తుంటారు. కానీ ఇతగాడు వాళ్లను వీళ్లను ఎందుకు అనుకున్నాడో ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను మోసం చేశాడు. ఇంతకీ అతగాడు చేసిన నిర్వాకం ఏమిటో మీరూ చదివేయండి.

సాధారణంగా పని చేతకాని వాళ్లు, రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావాలి అని కలగనే వారు మోసాలు చేస్తుంటారు. కొందరైతే అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని మోసాలకు పాల్పడుతుంటారు. దీనికి వారి ప్రతిభను జోడించి లక్షలు గడిస్తారు. అయితే ఆటోలోకి వస్తాడు ఇతడు. ఈ యువకుడు ఏకంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ, తిరుపతి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆధార్ కార్డులను వాడేసాడు. వాటిని మార్చాలని కూడా ప్రయత్నించాడు.. బీహార్ రాష్ట్రంలోని ముజఫర్ పూర్ లోని సాదత్ పూర్ గ్రామానికి చెందిన అర్పణ్ దూబే అలియాస్ మదన్ కుమార్ అనే యువకుడు.. స్థానికంగా ఓ డిగ్రీ కళాశాలలో గ్రాడ్యుయేషన్ చదువుతున్నాడు. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబానికి చెందిన ఇతడికి టెక్నాలజీలో విపరీతమైన అవగాహన ఉంది. తనని మంచి పనులకు ఉపయోగిస్తే బాగుండేది. కాని దానిని చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఉపయోగించడం మొదలు పెట్టాడు. అది ఎంతకు దారి తీసింది అంటే ఏకంగా ప్రధానమంత్రి, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆధార్ కార్డులను వాడేంతవరకు అతగాడి మోసం ఎదిగింది. వారి ఆధార్ కార్డులను ట్యాంపరింగ్ చేశాడు అంటే ఇతగాడి సాంకేతిక నైపుణ్యం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

ప్రధానమంత్రి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆధార్ కార్డులను పలు కార్యకలాపాలకు వినియోగించాడు. అందరితో రాకుండా మోడీ, యోగి డేటాను ట్యాంపర్ చేయడానికి ఆధార్ కార్డు పోర్టల్ వినియోగించాడు. పుట్టిన తేదీతో సహా ఇతర డాటాను తారుమారు చేసే ప్రయత్నం చేయబోయాడు. అయితే అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఇతగాడి నిర్వాకం మీద అనుమానం వచ్చి దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు. దీంతో అతడి బండారం బయటపడింది. ఐపీ అడ్రస్ ద్వారా అతడి వివరాలు సేకరించి స్థానిక పోలీసుల బృందంతో కలిసి అతగాడి పై దాడి చేశారు. తర్వాత అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి పై వివిధ సెక్షన్ల కింద నమోదు చేశారు. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. ప్రధానమంత్రి డాటాను తస్కరించేందుకు ప్రయత్నించాడు అంటే ఇతడు మామూలోడు కాదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.