
Cop26: మనిషి చేసిన తప్పులు మనిషినే దహించి వేస్తున్నాయి. సాంకేతిక పేరుతో మానవాళి నాశనానికి నాంది పలుకుతున్నాయి. మానవుల ఉనికికే పెను ప్రమాదం ముంచుకొస్తోంది. శాస్ర్తవేత్తలు చెబుతున్నా తూతూ మంత్రంగా చర్యలు తీసుకుంటూ మానవాళి పతనానికి కారకులవుతున్నారు. ఎంత మొత్తుకున్నా వినకుండా అభివృద్ధి చెందిన దేశాలు చేస్తున్న దమనకాండతో భూతాపం పెరిగిపోతోంది. ఫలితంగా భూ ప్రళయం ముంచుకొస్తోంది. వాతావరణ మార్పులపై దృష్టి సారించాల్సిన దేశాలే పట్టించుకోవడం లేదు. ప్రపంచమే నాశనం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
ప్రతి ఏటా ఏదో తూతూ మంత్రంగా సమావేశాలు నిర్వహించడం తరువాత వాటిని గురించి పట్టించుకోవడం లేదు. దీంతో ఇప్పటి వరకు వాతావరణ సమతుల్యత కోసం చేసిన తీర్మానాలు ఒక్కటి కూడా నెరవేరలేదు. ఈ నేపథ్యంలో బ్రిటన్ లోని గ్లాస్గో లో అక్టోబర్ 31 నుంచి నవంబర్ 12 వరకు కాప్26 పేరుతో సదస్సు నిర్వహించనున్నారు. ఇందులో భూతాపం తగ్గించేందుకు పలు తీర్మానాలు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న ఉత్పాతాన్ని తగ్గించే క్రమంలో ప్రపంచదేశాలు స్పందించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.
బొగ్గు ఆధారిత విద్యుత్ కర్మాగారాలకు ముగింపు పకలడం, చెట్లు నరికివేత ఆపడం, తీర ప్రాంతాల్లో రక్షణ చర్యలు చేపట్టడం, విద్యుత్ వాహనాలు వంటి పర్యావరణహిత ప్రత్యామ్నాయాల కోసం ప్రయత్నించడం వంట చర్యలకు ఉపక్రమించడం, హానికర ఉద్గారాలను తగ్గించేందుకు ప్రణాళిక రూపొందించడం వంటి పనులకు ఈ సదస్సులో పెద్దపీట వేయనున్నట్లు తెలుస్తోంది. కానీ వాటి అమలు గురించి మాత్రం మరిచిపోతారు. తరువాత ఎవరి పనుల్లో వారు పడి తీర్మానాల గురించి పట్టించుకోరు. ఫలితంగా భూతాపం తగ్గించే చర్యలు శూన్యంగా కనిపిస్తున్నాయి.
కాప్ అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీన్. 1995 నుంచి ఐక్యరాజ్య సమితి ఈ సదస్సు నిర్వహిస్తోంది. ఇందులో సుమారుగా 200 దేశాలు పాల్గొంటున్నాయి. ఈ వేదిక జరగడం ఇప్పటకి 26వ సారి. అందుకే దీనికి కాప్ 26 అని పేరు పెట్టినట్లు తెలుస్తోంది. పెట్రోల్, డీజిల్ లాంటి ఇంధనాల ద్వారా వెలువడే పొగతో పర్యావరణం పాడైపోతోంది. ఫలితంగా వాతావరణ మార్పుల చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విపత్తులు ఏర్పడుతున్నాయి. దీంతో మానవాళిపై పెను ప్రభావం చూపుతోంది.
కాప్ 26(Cop26) ద్వారా ప్రపంచ దేశాల్లో మానవాళి మనుగడ కోసం పలు చర్యలు తీసుకోవాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ప్రపంచంలో చోటుచేసుకునే పరిణామాల తీవ్రత తగ్గించేందుకు పలు పనులు చేపట్టడానికి పూనుకుంటోంది. వాతావరణ మార్పులలో వస్తున్న భారీ మార్పులను తగ్గించేందుకు కృషి చేసేందుకు ఉద్దేశించింది.
2030 నాటికి పేద దేశాలకు ఏటా 100 బిలియన్ డాలర్ల మేర పరిహారం అందజేయాలని 2009లో ప్రపంచ ధనిక దేశాలు హామీ ఇచ్చిన నేపథ్యంలో 2023 నాటికి వాటిని అందుకునే అవకాశాలు కనిపించడం లేదు. అమెరికా, ఐరోపా, ఆస్రేలియా దేశాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టి కార్చిచ్చు రేగుతోంది. అడవులు నాశనం అవుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్, జమ్ము కశ్మీర్ లో ఆకస్మిక కుంభవృష్టి చూస్తుంటే భూతాపం ప్రభావం చూపిస్తోందని తెలుస్తోంది.