Shivampet: పాము ప్రసవించిన తర్వాత తన పిల్లల్ని తానే తింటుంది. అది సృష్టి ధర్మం. కానీ మనుషులు అలా చేస్తారా.. అంతటి దారుణానికి ఒడిగడతారా.. ఈ ప్రశ్నలకు అవును అనే సమాధానమే వస్తోంది. ఓ మహిళ చేసిన నిర్వాకం మాతృత్వానికే మచ్చను తీసుకొచ్చింది. ఆమె చేసిన దారుణం కనీ వినీ ఘోరానికి కారణమైంది.. ఇంతకీ ఏం జరిగిందంటే..
మెదక్ జిల్లా శివంపేటకు చెందిన మమతకు, సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలం వడ్డేపల్లి ప్రాంతానికి చెందిన భాస్కర్ తో ఐదు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి నాలుగు సంవత్సరాలకు కుమారుడు, తన్వి శ్రీ అనే రెండు సంవత్సరాల కుమార్తె ఉంది. మమత, భాస్కర్ మొదటిలో బాగానే ఉండేవారు. ఆ తర్వాత ఆమె ప్రవర్తన మారిపోయింది శభాష్ పల్లి ప్రాంతానికి చెందిన ఫయాజ్ అనే వ్యక్తితో మమతకు పరిచయం ఏర్పడింది. అది కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది. వారిద్దరు చాటుమాటుగా కలుసుకోవడం మొదలుపెట్టారు. ఇటీవల మమత వ్యవహారం భాస్కర్ కు తెలియడంతో నిలదీశాడు. అయినప్పటికీ మమత తన ప్రవర్తన మానుకోలేదు. ఈ ఏడాది మార్చి నెలలో ఇద్దరు కలిసి పారిపోయారు. ఆ తర్వాత పెద్దమనుషులు రంగ ప్రవేశం చేసి పంచాయితీ చేశారు. అనంతరం సర్ది చెప్పి మమతను భాస్కర్ వద్దకు పంపించారు. ఆయనప్పటికీ భాస్కర్ తో మమత గొడవ పడుతూనే ఉంది. ఈసారి ఏకంగా కుమారుడని, కూతుర్ని తీసుకొని తల్లిగారింటికి వెళ్లిపోయింది. ఆ తర్వాత కుమారుడిని తల్లి గారి ఇంటి వద్ద ఉంచి.. కుమార్తెతో కలిసి ప్రియుడితో వెళ్లిపోయింది. మే 21న ఈ సంఘటన జరిగింది. ఆ తర్వాత మమత ఆచూకీ లభించకపోవడంతో ఆమె తండ్రి రాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన శివంపేట పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.
గుంటూరులో దొరికారు
మమత, ఫయాజ్ గుంటూరు పారిపోయారు. ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ట్రేస్ చేసి వారిని పోలీసులు గుంటూరులో పట్టుకున్నారు. ఆ తర్వాత వారిని విచారించారు. రెండు సంవత్సరాల కుమార్తె గురించి పోలీసులు విచారించగా.. పొంతన లేని సమాధానం చెప్పారు. అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో విచారించారు. చివరికి కుమార్తెను తమ చంపామని వారు ఒప్పుకున్నారు. శభాష్ పల్లి గ్రామం శివారులో చిన్నారిని పాతిపెట్టిన ప్రదేశాన్ని చూపించారు.. కుంట కట్టుకాలువ ప్రాంతంలో ఆ చిన్నారిని పాతిపెట్టినట్టు గుర్తించిన అధికారులు మృతదేహాన్ని వెలికి తీశారు. ఆ తర్వాత వారిద్దరికీ దేహ శుద్ధి చేయడానికి గ్రామస్తులు ప్రయత్నించినప్పటికీ పోలీసులు నిలువరించారు. ఇప్పటికే ఫయాజ్ మీద 30కి పైగా దొంగతనాలు, ఇతర నేరాలకు సంబంధించిన కేసులు ఉన్నాయి. భాస్కర్ మంచివాడని.. గ్రామంలో అందరికీ సుపరిచితుడని స్థానికులు అంటున్నారు. మమత మొదటి నుంచి కూడా వింతగా ప్రవర్తించేదని.. చివరికి తన వ్యవహార శైలితో కన్న కుమార్తెను చంపుకుందని.. నేరస్తురాలిగా మారిపోయిందని స్థానికులు అంటున్నారు.