AP: ఈ మధ్య నడిరోడ్డు మీద జరుగుతున్న ఘటనలు చూస్తుంటే నిజంగానే షాకింగ్ అనిపిస్తోంది. మహిళలు క్యాబ్ డ్రైవర్ల మీద, ఆర్టీసీ బస్ డ్రైవర్ల మీద చేస్తున్న దాడులు పెరిగిపోతున్నాయి. మొన్నటికి మొన్న ఢిల్లీలో ఓ క్యాబ్ డ్రైవర్ మీద మహిళ చేసిన దాడి ఎంతలా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే. కాగా ఇప్పుడు విజయవాడలో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.

నగరంలోని ఆంధ్రా హాస్పిటల్ వద్ద రాంగ్ రూట్‌లో స్కూటీపై వచ్చిన ఓ మహిళ ఆర్టీసీ బస్సుకు ఎదరుపడింది. అయితే తన స్కూటీకే ఆర్బీసీ బస్సు ఎదురుగా వచ్చిందని తన తప్పు లేదంటూ వీరంగం సృష్టించింది. ఏకంగా డ్రైవర్ చొక్కా పట్టుకుని అతని సీట్లోంటి లాగుతూ కిందకు దిగాలంటూ తీవ్ర ఆగ్రహంతో దాడికి దిగింది.
Also Read: ఫస్ట్ నైట్ కు ఇచ్చిన గిఫ్ట్ ను నాగచైతన్యకు తిరిగిచ్చేసిన సమంత
ఆమె పేరు నందినిగా తెలుస్తోంది. అయితే ప్రయాణికులు, బస్ డ్రైవర్, కండక్టర్లు ఎంతలా వారించినా సరే వినకుండా మరింతగా రెచ్చిపోయింది. బండ బూతులు తిడుతూ.. అతని చొక్కాను చించేసింది. దీంతో చేసేది లేక చివరకు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే పోలీసులు వచ్చేదాకా కూడా ఆమె బస్సునుంచి దిగకుండా అలాగే గొడవపడటం మొత్తం అక్కడున్న వారు రికార్డు చేశారు.
ఇక పోలీసులు వచ్చి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమెను సూర్యారావుపేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. కాగా దానిపై ప్రతి ఒక్కరూ విమర్శలు కురిపిస్తున్నారు. మహిళ అయి ఉండి మరీ ఇంతలా వీరంగం చేయాలా అంటూ కామెంట్లు పెడుతున్నరు. తప్పు ఆమెది అయినా.. అంత ఓవర్ చేయడమేంటని మండిపడుతున్నారు.
Also Read: ఆంధ్రులకు ‘ప్రత్యేక హోదా’ వచ్చినట్లేనా..? అంతలోనే ట్విస్ట్
[…] […]
[…] CM Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొత్త ఆలోచనలకు శ్రీకారం చుడుతున్నారు. కొత్త జిల్లాలు, కొత్త రాజధాని, కొత్త పాలనకు ఉగాదిని వేదికగా చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల తనను కలిసిన సినిమా వాళ్లతో కూడా మనం విశాఖ వెళ్లాలి అంటూ సూచన చేయడం గమనార్హం. దీంతో సీఎం మదిలో విశాఖ రాజధాని అనే విషయం ఎప్పటి నుంచో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన పరిపాలన విశాఖ నుంచే కొనసాగించేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం. […]
[…] CM Jagan: ఏపీలో ప్రత్యేక హోదా అంశం ఎంత కీలకమో అందరికీ తెలిసిందే. ఈ ఒక్క అంశం చుట్టూ ప్రభుత్వాలు కూడా మారిపోయాయంటే దాని పవర్ అలాంటిది మరి. అయితే ఇప్పుడు మరోసారి ఈ హోదా అంశంపై రగడ సాగుతోంది. రీసెంట్ గా నియమించిన సబ్ కమిటీ ఎజెండాలో మొదట ప్రత్యేక హోదాను పెట్టి ఆ తర్వాత కేంద్రం తొలగించడంపై టీడీపీ తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతోంది. వైసీపీ ప్రభుత్వ చేతకాని తనం వల్లే ఇలా అయిందంటూ ఆరోపిస్తున్నారు. […]