CISF: పరిశ్రమల పరిరక్షణకు దేశంలో ప్రత్యేక ఫోర్స్ ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు పరిశ్రమలకు సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్ రక్షణ కల్పిస్తోంది. ఇదిఏర్పాటు చేసిన నాటి నుంచి నేటి వరకు ఇందులో పురుషులు మాత్రమే కమాండోలుగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే తాజాగా కేంద్ర హోం శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వెయ్యి మందికిపైగా మహిళలతో తొలిసాగిరా మహిళా సీఐఎస్‌ఎఫ్ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈమేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఈ కమాండోలు విమానాశ్రయాలు, మెట్రో రైలు వ్యవస్థ వంటి దేశంలోని కీలకమైన మౌలిక సదుపాయాలు సంరక్షించడం, వీఐపీలకు కమాండోలుగా భద్రత కల్పించే బాధ్యతలను బెటాలియన్ చూసుకోనుంది.
7 శాతం మహిళా కమాండోలు..
ప్రస్తుతం దేశంలో 1.80 లక్షల మంది సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది ఉన్నారు. వీరిలో 7 శాతం మంది మహిళలు ఉన్నారు. సీనియర్ కమాండెంట్ స్థాయి అధికారి నేతృత్వంలో 1,025 మంది సిబ్బందితో రిజర్వు బెటాలియన్ అని పిలిచే ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కొత్త రిజర్వు బెటాలియన్‌ను ఏర్పాటు చేయడానికి ముందస్తు నియామకం, శిక్షణ, సథలాన్ని ఎంపిక చేయడానికి సన్నాహాలు మొదలు పెట్టారు.
1969లో ఏర్పాటు..
సీఐఎస్‌ఎఫ్‌ను కేంద్రం 1969లో ఏర్పాటు చేసింది. ఎన్నికల భద్రత లాంటి తాత్కాలిక బాధ్యతలతోపాటు పార్లమెంట్ హౌస్ భద్రత వరకు సీఐఎస్‌ఎఫ్ ఎన్నో బాధ్యతలు నిర్వహిస్తోంది. తాజాగా ఆల్ ఉమెన్ బెటాలియన్ ఏర్పాటు చేయనుంది. దీంతో మహిళా సాధికారత విషయంలో సీఐఎస్‌ఎఫ్ చేసిన మరో ముందడుగుగా చెప్పవచ్చు. సీఐఎస్‌ఎఫ్ మహిళా కమాండోలు.. వీఐపీలతోపాటు విమానాశ్రయాలు, డిల్లీ మెట్రో వంటి వాటిలో కమాండోలుగా బహుముఖ పాత్ర పోషిస్తారని, ఈమేరకు తీర్చిదిద్దుతామని కేంద్రం తెలిపింది. దేశానికి సేవ చేయాలనుకునే మహిళలకు సీఐఎస్‌ఎఫ్ నుంచి ఎంపిక చేసి కొత్త ఆల్ ఉమెన్ బెటాలియన్‌తో దేశవ్యాప్తంగా మరింతమంది యువతులు సీఐఎస్‌ఎఫ్‌లో చేరేలా ప్రోత్సహిస్తామని పేర్కొంది. ఇది ఒక చారిత్రక నిర్ణయమని, జెండర్ ఈక్వాలిటీని ప్రమోట్ చేయడానికి ఆల్ ఉమెన్ బెటాలియన్ ఉపకరిస్తుంది అని సీఐఎస్‌ఎఫ్ కూడా ఎక్స్ వేదికగా హర్షం వ్యక్తం చేసింది.
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: The union home ministry has approved the formation of an all women battalion of the cisf
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com