Homeజాతీయ వార్తలుIndia Unemployment Rate: దేశంలో తగ్గిన నిరుద్యోగ రేటు.. దేనికి సంకేతం?

India Unemployment Rate: దేశంలో తగ్గిన నిరుద్యోగ రేటు.. దేనికి సంకేతం?

India Unemployment Rate: భారత దేశం యువ జనాభా ఎక్కువగా ఉన్న దేశం. మనకు యువతే బలం. పుష్కలమైన మానవ వనరులు ఉండడం మనకు బలం. అయితే దేశంలో సరిపడా ఉద్యోగాలు లేకపోవడం యువతకు శాపంగా మారుతోంది. దీంతో ప్రభుత్వాలు స్వయం ఉపాధివైపు మళ్లిస్తున్నాయి. మరోవైపు పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తుయి. మరోవైపు కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం భారీగా ఉద్యోగాల భర్తీ చేపడుతోంది. ఈ నేపథ్యంలో దేశంలో నిరుద్యోగ రేటు క్రమంగా తగ్గుతోంది. 4.7 శాతంగా నమోదైంది. పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే (పీఎల్‌ఎఫ్‌) తాజా డేటా ప్రకారం ఇది 8 నెలల కనిష్ఠ స్థాయికి తగ్గింది.

పట్టణ–గ్రామీణ ప్రాంతాల్లో వ్యత్యాసం..
అక్టోబర్‌లో 5.2 శాతం ఉన్న రేటు నుంచి గణనీయ తగ్గుదల సంభవించింది. గ్రామీణ మొత్తంలో 3.9 శాతానికి, పట్టణాల్లో 6.5 శాతానికి పడిపోయింది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ మార్పు ఎక్కువగా కనిపిస్తోంది, ఇది వ్యవసాయం, చిన్న తరహా పరిశ్రమల పునరుద్ధరణకు సంబంధించినది.

తగ్గుదలకు కారణాలు..
అధికారుల ప్రకారం, గ్రామీణ ప్రాంతాల్లో కొత్త ఉపాధి అవకాశాలు పెరగడం ప్రధాన కారణం. మహిళల పని భాగస్వామ్యం గణనీయంగా పెరిగి, కుటుంబ ఆదాయాలను బలోపేతం చేస్తోంది. ప్రభుత్వ పథకాలు, స్థానిక వ్యాపారాల పునర్జననం ఈ మార్పుకు దోహదపడ్డాయి. పట్టణాల్లో సేవా రంగం, రిటైల్‌ విస్తరణ కూడా ఉపయోగపడ్డాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version