India Unemployment Rate: భారత దేశం యువ జనాభా ఎక్కువగా ఉన్న దేశం. మనకు యువతే బలం. పుష్కలమైన మానవ వనరులు ఉండడం మనకు బలం. అయితే దేశంలో సరిపడా ఉద్యోగాలు లేకపోవడం యువతకు శాపంగా మారుతోంది. దీంతో ప్రభుత్వాలు స్వయం ఉపాధివైపు మళ్లిస్తున్నాయి. మరోవైపు పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తుయి. మరోవైపు కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం భారీగా ఉద్యోగాల భర్తీ చేపడుతోంది. ఈ నేపథ్యంలో దేశంలో నిరుద్యోగ రేటు క్రమంగా తగ్గుతోంది. 4.7 శాతంగా నమోదైంది. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పీఎల్‌ఎఫ్) తాజా డేటా ప్రకారం ఇది 8 నెలల కనిష్ఠ స్థాయికి తగ్గింది.
పట్టణ–గ్రామీణ ప్రాంతాల్లో వ్యత్యాసం..
అక్టోబర్‌లో 5.2 శాతం ఉన్న రేటు నుంచి గణనీయ తగ్గుదల సంభవించింది. గ్రామీణ మొత్తంలో 3.9 శాతానికి, పట్టణాల్లో 6.5 శాతానికి పడిపోయింది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ మార్పు ఎక్కువగా కనిపిస్తోంది, ఇది వ్యవసాయం, చిన్న తరహా పరిశ్రమల పునరుద్ధరణకు సంబంధించినది.
తగ్గుదలకు కారణాలు..
అధికారుల ప్రకారం, గ్రామీణ ప్రాంతాల్లో కొత్త ఉపాధి అవకాశాలు పెరగడం ప్రధాన కారణం. మహిళల పని భాగస్వామ్యం గణనీయంగా పెరిగి, కుటుంబ ఆదాయాలను బలోపేతం చేస్తోంది. ప్రభుత్వ పథకాలు, స్థానిక వ్యాపారాల పునర్జననం ఈ మార్పుకు దోహదపడ్డాయి. పట్టణాల్లో సేవా రంగం, రిటైల్ విస్తరణ కూడా ఉపయోగపడ్డాయి.