spot_img
Homeఆంధ్రప్రదేశ్‌YCP: వైసీపీ మలి విడత జాబితా సిద్ధం! లిస్ట్ లో ఊహించని పేర్లు!

YCP: వైసీపీ మలి విడత జాబితా సిద్ధం! లిస్ట్ లో ఊహించని పేర్లు!

YCP: ఏపీలో పొలిటికల్ హిట్ నెలకొంది. ఎన్నికల వాతావరణం స్పష్టంగా కనిపిస్తోంది. అవకాశాలు దక్కని వారు ప్రత్యామ్నాయల కోసం వెతుక్కుంటున్నారు. పార్టీల నుంచి వీడడం, వేరే పార్టీలో చేరడం శరవేగంగా జరిగిపోతున్నాయి. అభ్యర్థుల ఎంపిక విషయంలో వైసీపీ దూకుడుగా వ్యవహరిస్తోంది. ఇప్పటికే రెండు విడతల్లో 38 మంది అభ్యర్థులను ఆ పార్టీ మార్చింది. ఇప్పుడు తుది జాబితాకు సిద్ధమవుతోంది. దీనికి సంబంధించి కసరత్తు పూర్తయింది. ఈ సాయంత్రానికి జాబితా వెలువడే అవకాశం ఉంది.

సామాజిక సాధికారతకు పెద్దపీట వేస్తూ జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. మహిళలు, యువత, కొత్తవారికి అవకాశం కల్పిస్తున్నారు. ఎస్సీ, ఎస్టి, బిసి, మైనారిటీలకు తగిన ప్రాధాన్యమిస్తున్నారు. మలి జాబితాలో అన్ని కులాల వారి ప్రాతినిధ్యం ఉండేలా చూసుకున్నట్లు తెలుస్తోంది. మూడో విడత జాబితా పై దాదాపు కసరత్తు పూర్తయినట్లు సమాచారం. కొద్దిపాటి చేర్పులు మార్పులు చేస్తూ వైసీపీ అగ్రనాయకత్వం 25 మంది పేర్లతో ఈ జాబితాను వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నాయి.ప్రధానంగా అనంతపురం, సత్య సాయి పుట్టపర్తి, కర్నూలు, నంద్యాల, ప్రకాశం, బాపట్ల, పల్నాడు జిల్లాల్లోని నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.

అనంతపురం జిల్లాలోని రాయదుర్గం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కాపు రామచంద్రారెడ్డికి ఈసారి టిక్కెట్ దక్కదన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆయన సమాచారం అందుకొని పార్టీకి రాజీనామా కూడా చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించారు. ఈ మూడో జాబితాలో రాయదుర్గం ఇన్చార్జి పేరును ప్రకటించే అవకాశం ఉంది. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం లో కూడా మార్పులు ఉన్నట్లు సమాచారం. అక్కడ మంత్రి గుమ్మనూరు జయరాం ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పటికే వైసీపీ అగ్రనాయకత్వం ఆయనకు టిక్కెట్ ఇవ్వడం లేదన్న సమాచారం అందించినట్లు తెలుస్తోంది. కనీసం కర్నూలు లోక్ సభ స్థానానికైనా తన పేరును పరిశీలించాలని జయరాం కోరుతున్నట్లు సమాచారం. ఒకవేళ వైసీపీ నాయకత్వం మొండి చేయి చూపితే గుమ్మనూరు జయరాం పార్టీ నుంచి బయటికి వెళ్లే అవకాశం ఉంది. షర్మిల నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే వైసీపీ మూడో విడత జాబితా పెను ప్రకంపనలకు దారి తీసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Most Popular

Jana Nayagan Movie: జన నాయకుడు మూవీ నుంచి తప్పించుకున్న స్టార్ డైరెక్టర్…

Jana Nayagan Movie: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకున్న నటీనటులు చాలామంది ఉన్నారు. అక్కడ హీరోలు ఎంతమంది ఉన్నప్పటికి దళపతి విజయ్ కి ఉన్న క్రేజ్ నెక్స్ట్...

Pink Diamond Conspiracy: తేలిపోనున్న ‘పింక్ డైమండ్’ కుట్ర!

Pink Diamond Conspiracy: 2019 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు గట్టి ప్రయత్నాలు చేసింది. 2014 నుంచి 2019 వరకు టిడిపి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు చేయని ప్రయత్నం అంటూ...

Bhogapuram International Airport: ‘భోగాపురం’లో రెండు గంటల పాటు మోడీ!

Bhogapuram International Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సంబంధించి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీని ప్రత్యేకంగా ఆహ్వానించారు సీఎం చంద్రబాబు. విభజన హామీల్లో భాగంగా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయ...

Thammineni Seetharam Case: తమ్మినేని సూత్రధారి.. కోర్టులో సంచలనం!

Thammineni Seetharam Case: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తన అధికార దర్పాన్ని ఉపయోగించి.. నకిలీ పత్రాలతో కుమారుడి పేరుతో నాలుగు కోట్ల రూపాయల విలువైన...

Chennai Love Story Movie: చెన్నై లవ్ స్టోరీ మూవీ ని రిజెక్ట్ చేసి బాధపడుతున్న స్టార్ హీరో…

Chennai Love Story Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తోంది. ఇప్పటికే చాలామంది హీరోలు తమదైన రీతిలో సత్తా చాటుకుంటున్నారు. ఇక ఇప్పటివరకు ఎవరు ఇలాంటి...
Oktelugu Epaper
Exit mobile version