
KA Paul: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ.పాల్ కొన్ని రోజులుగా తెలంగాణ సర్కార్‌పై న్యాయ పోరాటం చేస్తున్నారు. కొత్త సచివాలయంలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంపై సీబీఐతో విచారణ జరిపించాలని, ఈమేరకు ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ వేశారు. తెలంగాణ ప్రజల సొమ్ముతోనిర్మించిన కొత్త సచివాలయాన్ని కేసీఆర్ పుట్టిన రోజు ప్రారంభించడంపైనా మరో పిటిషన్ వేశారు. అంబేద్కర్ జయంతి రోజు ప్రారంభించేలా ఆదేశించాలని కోరారు. ఇక తనకు భద్రత కుదింపుపైనా హైకోర్టుకు లేఖ రాశారు. అగ్నిప్రమాదంపై వేసిన పిటిషన్‌ను కోర్టు విచారణకు స్వీకరించింది. అదే సమయంలో భద్రత తొలగింపుపై రాసిన లేఖను కూడా సుమోటోగా కోర్టు విచారణకు స్వీకరించింది.
Also Read: Nara Lokesh Padayatra- YCP: లోకేష్ ను లేపుతున్న వైసీపీ
డీజీపీకి ఆదేశాలు..
కేఏ.పాల్ భద్రతపై హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. చీఫ్ జస్టిస్ వాదనలు విన్నారు. ఈ సందర్భంగా పాల్ స్వయంగా తన వాదనలు వినిపించారు. 30 రోజుల్లో కేఏ.పాల్ త్రెట్‌ను పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని డీజీపీని హైకోర్టు ఆదేశించింది.
సచివాలయ అగ్నిప్రమాదంపై..
భద్రత విషయంలో వాదనల సందర్భంగా సచివాలయం ఫైర్ యాక్సిడెంట్ ఘటనను కేఏ.పాల్ ప్రస్తావించారు. ప్రభుత్వ తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే చీఫ్ జస్టిస్ ప్రభుత్వ న్యాయవాదిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పాల్ తన వాదనలు వినిపించారు. సచివాలంలో అగ్నిప్రమాదం జరిగిన తీరుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. ప్రజాధనంతో కట్టిన భవనంలోకి ఎవరినీ అనుమతించకపోవడం అనుమానాలకు బలం చేకూరుస్తోందని తెలిపారు. ప్రమాదంపై ఇప్పటికీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకపోవడంపైనా అనుమానాలు వ్యక్తం చేశారు.
వాస్తుపేరుతో రూ.500 కోట్ల భవనం కూల్చారు..
ఉమ్మడి ఆధ్రప్రదేశ్‌లో పాత సచివాలయం నుంచి పది మంది ముఖ్యమంత్రులు పరిపాలన చేశారని ఈ సందర్భంగా పాల్ కోర్టు దృష్టికి తెచ్చారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ కేవలం వాస్తు పేరుతో రూ.500 కోట్ల విలువైన భవనాన్ని కూల్చివేయించారని పేర్కొన్నారు. కొత్త సచివాలయం పేరుతో రూ.660 కోట్ల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని తెలిపారు. ఈ సమయంలో జరిగిన అగ్నిప్రమాదం వివరాలు మాత్రం గోప్యంగా ఉంచుతున్నారని తెలిపారు. సచివాలయం ప్రమాదంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని కోరారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి జోక్యం చేసుకుని, కేవలం మీ భద్రతపైనే వాదించాలని, ఇతర అంశాలు ఎందుకు ప్రస్తావిస్తున్నారని సూచించారు.

మొత్తంగా కేఏ.పాల్ వకీల్‌సాబ్‌గా కొత్త యాంగిల్‌లో తెలంగాణ సర్కార్‌పై న్యాయ పోరాటం ప్రారంభించారు. తరచూ ఏదో ఒక విధంగా వార్తల్లో ఉండేలా చూసుకుంటున్న పాల్ తాజాగా వకీల్‌సాబ్‌లా వార్తల్లో నిలిచారు.
Also Read: KCR- MIM: కేసీఆర్‌కు ఎంఐఎం పరీక్ష.. ‘అసద్’ దోస్తా.. దుష్మనా?