తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం

తెలంగాణలో మరోసారి భూముల ధరలు పెరుగనున్నాయి. మొన్నటి కేబినెట్ లో తీసుకున్న నిర్ణయం మేరకు తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో వ్యవసాయ , వ్యవసాయేతర భూముల కొత్త విలువల అమలుకు రంగం సిద్ధం చేసింది. భూముల విలువతోపాటు పెరిగిన రిజిస్ట్రేషన్ చార్జీలు బుధవారం నుంచి అమల్లోకి వచ్చేలా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలో భూముల విలువను ప్రాంతాల వారీగా పెంచారు.గరిష్టంగా 50శాతం వరకు పెరగగా.. కనిష్టంగా 20శాతం వరకు పెంచేశారు. […]

Written By: NARESH, Updated On : July 20, 2021 4:04 pm
Follow us on

తెలంగాణలో మరోసారి భూముల ధరలు పెరుగనున్నాయి. మొన్నటి కేబినెట్ లో తీసుకున్న నిర్ణయం మేరకు తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో వ్యవసాయ , వ్యవసాయేతర భూముల కొత్త విలువల అమలుకు రంగం సిద్ధం చేసింది.

భూముల విలువతోపాటు పెరిగిన రిజిస్ట్రేషన్ చార్జీలు బుధవారం నుంచి అమల్లోకి వచ్చేలా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలో భూముల విలువను ప్రాంతాల వారీగా పెంచారు.గరిష్టంగా 50శాతం వరకు పెరగగా.. కనిష్టంగా 20శాతం వరకు పెంచేశారు.

వ్యవసాయ, వ్యవసాయేతర భూముల విలువతోపాటు ఇళ్లు, అపార్ట్ మెంట్లతో ప్లాట్లకు కొత్త విలువను నిర్ధారించింది ప్రభుత్వం. పెంచిన విలువకు సంబంధించి మూడురోజులు కసరత్తు చేస్తున్నారు.

సవరించిన విలువలను సబ్ రిజిస్ట్రార్లకు పంపగా.. వారు పూర్తిగా పరిశీలించి ఖరారు చేశారు. అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు చైర్మన్ గా.. సబ్ రిజిస్ట్రార్లు కన్వీనర్లుగా.. తహసీల్దార్లు, ఎంపీడీవోలు, జిల్లా రిజిస్ట్రార్ సభ్యులుగా ఉన్న వీరు మార్కెట్ విలువ సవరణ కమిటీలు కూడా పరిశీలించి ఆమోద ముద్రవేశారు.

భూముల మార్కెట్ విలువ పెంపుతో పాటు రిజిస్ట్రేషన్ చార్జీలను 7శాతం వరకు పెంచినట్లు సమాచారం. ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన నివేదిక నేపథ్యంలో భూముల విలువలు, రిజిస్ట్రేషన్ చార్జీల పెంపుపై కేబినెట్ లో ఇటీవలే నిర్ణయం తీసుకున్నారు.ఈ పెంచిన విలువలు, చార్జీలను మంగళవారం ప్రకటించనున్నారు.