Pawan Kalyan- Tamil Nadu Assembly: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇటీవల రాజకీయాల్లో బిజీ అయిపోయారు. అవకాశం వచ్చిన ప్రతీ మూమెంట్ ను వినియోగించుకుంటూ పార్టీని బలోపేతం చేస్తున్నారు. గత ఎన్నికల్లో కేవలం ఒక్క సీటుకే పరిమితమైన జనసేన.. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి తీసుకు రావడానికి పవతో పాటు జనసైనికులు శాయశక్తులా కృషి చేస్తున్నారు. తమకు ఆపద వచ్చిందని ఏపీలో ఎక్కడ వినిపించినా పవన్ అక్కడ వాలిపోతున్నాడు. మీడియా కూడా అయనకు ఫుల్ సపోర్టు ఉండడంతో నిత్యం పవన్ చేసే కార్యక్రమాలు ప్రజల వద్దకు చేరుతున్నాయి. అయితే ఇన్నాళ్లు పవన్ పార్టీలో పెద్ద నాయకులు లేరనే లోటు ఉండేది. ఏ పార్టీ సరైన విధంగా సపోర్ట్ చేయడం లేదని కొందరు విమర్శలు చేశారు కూడా. కానీ పవన్ కు సొంత రాష్ట్రంలోనే కాదు.. పక్క రాష్ట్ర తమిళనాడు అండగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా అక్కడి అసెంబ్లీలో పవన్ నినాదాలతో హెరిత్తినట్లు వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో నిజమెంత..?

సినీ నటుడిగా పవన్ కు కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇందులో రకరకాల పార్టీలకు చెందిన కార్యకర్తలూ ఉన్నారు. అయితే ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తరువాత చాలా మంది దూరమయ్యారు. ఇందులో భాగంగానే గత ఎన్నికల్లో పవన్ కు తీవ్ర పరాభవం ఎదురైంది. అయినా తమ పార్టీ కేవలం ఎన్నికల కోసం కాదని.. పేదల కోసమని ప్రజా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. పవన్ చేస్తున్న ప్రజా కార్యక్రమాలపై కొన్ని పార్టీలు ఇప్పటికే మద్దతు ప్రకటించాయి. ఇప్పుడు సొంత రాష్ట్రంలోనే కాకుండా తమిళనాడులోనూ క్రేజ్ పెరిగింది. పవన్ ప్రజా కార్యక్రమాలు ఆకర్షితులై కొన్ని రోజుల కిందట అక్కడి అధికార పార్టీ సీఎం పవన్ గురించి మాట్లాడటం విశేషం.
పవన్ చేస్తున్న కార్యక్రమాలు ఆకట్టుకుంటున్నాయి… ఆయన ఎప్పటికైనా ప్రజా నాయకుడే… అని తమిళనాడు సీఎం స్టాలిన్ ట్విట్టర్ ద్వారా మెసేజ్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇక తాజాగా తమిళనాడు అసెంబ్లీలో పవన్ నినాదాలు హోరెత్తాయని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది. దీనిపై జనసేన పార్టీ అధికారిక ప్రకటన చేయలేదు. అటు ఫ్యాన్స్ కూడా ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు.

ఏదీ ఏమైనా పవన్ కు సొంత రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి మద్దతు లభించడం తో వచ్చే ఎన్నికల్లో పార్టీ మరింత శక్తివంతంగా మారే అవకాశం ఉందని జనసైనికులు భావిస్తున్నారు. అయితే పవన్ చేస్తున్న పోరాటలపై కొందరు ప్రత్యర్థులకు నచ్చడం లేదు. దీంతో ఆయన పై దాడి జరిగే అవకాశం ఉందని జనసైనికులు ఆరోపిస్తున్నారు. అయినా ప్రజా పోరాటాలకు బెదిరేది లేదని పవన్ చెప్పడం చర్చనీయాంశంగా మారింది.