Pawan Kalyan- National Media: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ప్రస్తుతం వాడివేడిగా సాగుతున్నాయి. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, అధికార వైసీపీ మధ్య గత కొంత కాలం నుంచి పెద్ద యుద్ధమే జరుగుతోంది.. ఇటీవలే పవన్ కళ్యాణ్ ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణ పేరుతో కూల్చివేయబడ్డ ప్రజల ఇళ్లను సందర్శించి వారికి భరోసా కలిగించి నష్టపోయిన ప్రతి కుటుంబానికి లక్ష రూపాయిల చొప్పున ఆర్ధిక సహాయం చేస్తానని అధికారికంగా ప్రకటించారు..అయితే ఇప్పటం ప్రాంతానికి పవన్ కళ్యాణ్ వెళ్తున్న సమయంలో పోలీస్ యంత్రాంగం ఆయన పర్యటనని అడ్డుకోవడానికి చాలా ప్రయత్నాలే చేసింది..పవన్ కళ్యాణ్ పోలీస్ మాటల్ని లెక్క చెయ్యకుండా కాలినడకన ఇప్పటం గ్రామానికి వెళ్లారు.

మధ్యలో జాతీయ రహదారిలో ఆయన తన కారు టాప్ మీద కూర్చొని పర్యటించారు..ఇది ఇప్పుడు నేషనల్ లెవెల్ హాట్ టాపిక్ గా మారింది..పవన్ కళ్యాణ్ ఇప్పటం గ్రామానికి వెళ్ళడానికి కారణమైన ముఖ్య ఉద్దేశాన్ని పక్కన పెట్టేసి ఆయన కారు టాప్ మీద కూర్చొని వెళ్లిన వీడియోనే అరిగిపోయే దాకా టెలికాస్ట్ చేస్తూ లైవ్ డిబేట్స్ నిర్వహిస్తున్నారు.
ప్రభుత్వం చేస్తున్న దౌర్జన్యాలకు తలదించేదే లేదు అని చెప్పడానికే పవన్ కళ్యాణ్ అలా చేసాడు..ఇదంతా పక్కన పెడితే గ్రామం లో ఉన్న ఇళ్లను అడ్డగోలుగా కూల్చేసిన వైసీపీ ప్రభుత్వం దుశ్చర్యలను వైసీపీ కి అనుకూలంగా ఉండే ఒక జాతీయ మీడియా ఛానల్ విజయవంతంగా పక్కదోవ పట్టించి, కేవలం పవన్ కళ్యాణ్ కార్ రూఫ్ మీద కూర్చొని వెళ్లిన వీడియో ని తప్పుబడుతూ దానినే హైలైట్ చేసింది..ఒకపక్క కూల్చేసిన ఇళ్లకు సంబంధించిన వీడియోలు..ఆ గ్రామప్రజలు ‘అయ్యా మా ఇళ్ళని కూల్చవద్దు’ అంటూ అధికారుల కాళ్ళని పట్టుకొని బ్రతిమిలాడినా వీడియోలు సోషల్ మీడియా మొత్తం సర్క్యూలేట్ అవుతుంటే దాని మీద ఒక్కటంటే ఒక్క కథనం కూడా ప్రసారం చెయ్యలేదు ఆ జాతీయ మీడియా ఛానల్.

నిన్న నష్టపోయిన కుటుంబాలకు నష్టపరిహారం చెల్లిస్తునట్టు పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటన మీద కూడా ఒక్క చిన్న బులిటెన్ కూడా ప్రసారం చెయ్యలేదు..జనసేన పార్టీ నుండి ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేసిన ఒక యువకుడిని వైసీపీ వాళ్ళు చంపేశారు అని చెప్పినా స్పందించలేదు..కానీ పవన్ కళ్యాణ్ మీద విషం చిమ్మే పనికిమాలిన అంశాలను మాత్రం తెగ హైలైట్ చేస్తుంది ఆ మీడియా..జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు ని తెచ్చుకున్న ఆ నేషనల్ మీడియా ఛానల్ ఇలా ఒక పార్టీ కి తొత్తులాగా వ్యవహరించడం నిజంగా బాధాకరం