
MLA Purchase Case: బీజేపీతో వైరం పెంచుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రేవంత్‌రెడ్డిని ఓటుకు నోటు కేసులు ఇరికించినట్లుగా ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఇరికించి ఆ పార్టీ ప్రతిష్టను దెబ్బతీయాలనుకున్నాడు. ఈమేరకు పక్కా స్కెచ్‌తో ప్లాన్ వేశాడు. ముగ్గురు అనామకులను ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి ఫాంహౌస్‌కు రప్పించి.. తనపార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను వారితో సమావేశం చేయించి.. స్పై కెమెరాలను పెట్టి.. పోలీసులకు మోహరించి పెద్ద సినిమా క్రియేట్ చేశాడు. ఈ మొత్తం ఎపిసోడ్‌కు కథ, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్ కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావే అనేది బీజేపీ నేతల ఆరోపణ. ఇందులో నలుగురు ఎమ్మెల్యేలు పావులుగా మారగా, సీపీ స్టీఫెన్ రవీంద్ర పోలీస్ రూపంలో ఎట్రీ ఇచ్చాడు. అయితే ఈ ఎపిసోడ్ అటుతిరిగి, ఇటు తిరిగి ఇప్పుడు డైరెక్టర్ మెడకే చుట్టుకోబోతోంది. ఈకేసుపై హడావుడిగా సిట్ ఏర్పాటు చేయడం, బీజేపీ పెద్దలను ఇందులోకి లాగేందుకు నోటీసులు ఇవ్వడం తదతర పరిణామాలతో నిందితులను హైకోర్టు సింగిల్ జడ్జిని ఆశ్రయించారు. దీంతో సిట్‌ను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి తీర్పు ఇచ్చారు. సీబీఐ విచారణకు ఆదేశించారు. తర్వాత సిట్ డివిజన్ బెంచ్‌కు వెళ్లింది.. అక్కాడా సిట్‌కు నిరాశే ఎదురైంది. చివరకు సుప్రీం తలుపు తట్టింది.
చివరి అవకాశమూ బెడిసి కొట్టింది..
దేశ అత్యున్నత న్యాయస్థానంలో తమకు పెద్ద రిలీఫ్ లభిస్తుందని కేసీఆర్, సిట్ భావించాయి. మరోవైపు ఇదే చివరి అవకాశం కావడంతో ఉత్కంఠగా ఎదురు చూశాయి. కానీ, ఫామ్ హౌస్ కేసులో సీబీఐ విచారణను నియంత్రించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో తెలంగాణ ప్రభుత్వానికి చివరి ఆప్షన్ కూడా తప్పిపోయింది. సీబీఐ విచారణకు ఆదేశిస్తూ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తెలంగాణ ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన దుష్యంత్ దవే ఈ కేసులో ఆధారాలన్నీ బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నాయని, ఈ క్రమంమలో కేసును సీబీఐకి ఎలా అప్పగిస్తారని వాదించారు. కేసుపై వాదనల కోసం మరింత సమయం కావాలని కోరారు. ఈ కేసులో సీబీఐ ఒత్తిడి చేయకుండా ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. అయితే ధర్మాసనం మాత్రం సీబీఐని తాము నియంత్రించలేమని స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈనెల 27వ తేదీకి వాయిదా వేసింది.
డీటెయిల్స్ ఇవ్వని సర్కార్..
నిజానికి పిటిషన్ వేసినప్పుడు ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు తీర్పు అమలుపై స్టే కోరినా సుప్రీంకోర్టు ఇవ్వలేదు. అయినా సిట్ వద్ద ఉన్న డీటెయిల్స్ ఇవ్వడానికి తెలంగాణ సీఎస్ సిద్ధం కాలేదు. వాటి కోసం ఎస్పీ స్థాయి అధికారి సీఎస్‌కి ఆరుసార్లు లేఖ రాశారు. సుప్రీంలో విచారణ తర్వాత ఇస్తామని మౌఖికంగా సమాధానం చెప్పారు. ఇప్పుడు సీబీఐ .. ఫామ్ హౌస్ వివరాలు ఇవ్వకపోతే కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఫామ్ హౌస్ కేసును బీజేపీపై రాజకీయ పోరాటానికి ఆయుధంగా మార్చుకోవాలని కేసీఆర్ భావించారు. కానీ అనూహ్యంగా ఇది సీబీఐ చేతుల్లోకి వెళ్తుండడం ఆ పార్టీ నేతల్ని ఆందోళనకు ఆందోళనకు గురిచేస్తోంది. వీలైనంత వరకూ అత్యున్నత స్థాయిలో న్యాయపోరాటం చేసి కేసు సీబీఐకి వెళ్లకుండా చూడాలనుకుంటున్నారు. కానీ, సుప్రీంకోర్టులోనూ అనుకూల ఫలితం రావడం లేదు. ఫాంహౌస్ కేసు విచారించేందుకు సీబీఐ అధికారులు ప్రత్యేక బృందంగా ఏర్పడ్డారన్న ప్రచారం జరుగుతోంది. అదే నిజం అయితే ఫామ్ హౌస్ డీటైల్స్ ఇచ్చే వరకూ చూడకుండా ఇక కేసీఆర్‌కు చుక్కలు చూపించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
