
Minister Roja: అధినేత ఆశీస్సుల కోసం నోరు పారేసుకుంటున్న రోజాకు.. ప్రజాక్షేత్రంలో తిప్పలు తప్పేలా లేవు. ఇప్పటికే రెండుసార్లు గెలిచింది. మంత్రి కూడా అయింది. ముచ్చటగా మూడోసారి గెలవాలని పట్టుదలతో ఉంది. కానీ నగరి ప్రజానీకం అంత సీన్ లేదని అంటోంది. దీనికి ఓ ప్రత్యేక కారణం కూడా ఉన్నట్టుంది. ఆ కారణంతో ఆమెకు ఓటమి తప్పదని నగరి ప్రజానీకం బల్గగుద్ది చెబుతున్నారు. ఇంతకీ ఆ కారణం ఏంటి ? రోజా గెలుపుకి అడ్డంకి ఏంటో స్టోరీలో తెలుసుకోండి.
చిత్తూరు జిల్లా నగరి నుంచి 2014, 2019 ఎన్నికల్లో వరుసగా రోజా గెలిచారు. అప్పటి వరకు టీడీపీ నుంచి పోటీ చేసినా జనం కనికరించలేదు. వైసీపీలోకి జంప్ అవ్వగానే రెండుసార్లు ఎమ్మెల్యే అయిపోయారు. ఆ తర్వాత జగనన్న ఆశీర్వాదంతో మంత్రి కూడా అయ్యారు. ఇప్పుడు 2024 ఎన్నికల్లో మళ్లీ విజయ ఢంకా మోగించాలని రోజా ఉవ్విళ్లూరుతోంది. మూడుసార్లు గెలిచి నగరి సెంటిమెంట్ తప్పని నిరూపించాలని కలలు కంటోందట. వాస్తవంగా నగరి నియోజకవర్గంలో ఓ సెంటిమెంట్ ఉంది. ఆ సెంటిమెంట్ ప్రకారం రెండుసార్లు గెలిచిన ఎమ్మెల్యేలు మూడోసారి గెలవరు. ఇప్పుడు రోజా కూడా మూడోసారి పోటీ చేయనుంది. సెంటిమెంట్ ప్రకారం రోజా ఓడిపోవాలి. కానీ విజయం మళ్లీ తనదేనని రోజా ఘంటాపథంగా చెబుతోంది.

గెలుపు పై రోజాకు అపార నమ్మకం ఉన్నప్పటికీ.. ప్రజల్లో కావాల్సినంత విశ్వాసం లేదని తెలుస్తోంది. నగరి ప్రజల్లో రోజా పై మిశ్రమ స్పందన ఉన్నట్టు తెలుస్తోంది. మంత్రి అయినా, అధికారంలో ఉన్నా నియోజకవర్గానికి ఒరగబెట్టిందేమీ లేదని నగరి జనం పెదవి విరుస్తున్నారు. అదేసమయంలో ప్రతి మండలంలోనూ రోజాకు అసంతృప్తి వర్గం తయారైంది. పార్టీ నేతలే రోజా పై విమర్శలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో సహకరించబోమని చెబుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రోజాకు ఇబ్బందులు తప్పేలా లేవు.
మరోవైపు టీడీపీ కూడా దూకుండు పెంచింది. నారా లోకేష్ పర్యటన సందర్బంగా మంత్రి రోజా పై లోకేష్ విమర్శలు చేశాడు. జబర్ధస్త్ ఆంటీ అంటూ ఎద్దేవా చేశారు. నగరిలో గెలుపు సునాయాసం కావాలని ఇంచార్జీ గాలి భానుప్రకాశ్ కు నారా లోకేష్ సూచించాడట. అవసరమైతే తానే ప్రచారానికి వస్తానని హామీ ఇచ్చారట. ఎట్టి పరిస్థితుల్లోనూ రోజా గెలవకూడదని తేల్చిచెప్పారుట. అందుకే గాలి భాను ప్రకాశ్ యాక్టివ్ అయ్యారు. రోజా పై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. నగరి ప్రజల్లో ఉన్న అభిప్రాయం ప్రకారం రోజా మళ్లీ గెలిచే అవకాశం లేదు. నగరి సెంటిమెంట్ ను రోజా గౌరవించక తప్పదు. రోజా ఇంటికెళ్లక తప్పదని టీడీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు.
