Homeఆంధ్రప్రదేశ్‌Bhumana Abhinay: ఎయిర్ పోర్టుకు నీటి స‌ర‌ఫ‌రా ఆపేసిన ఎమ్మెల్యే కొడుకు.. చుక్క‌లు చూస్తున్న అధికారులు

Bhumana Abhinay: ఎయిర్ పోర్టుకు నీటి స‌ర‌ఫ‌రా ఆపేసిన ఎమ్మెల్యే కొడుకు.. చుక్క‌లు చూస్తున్న అధికారులు

Bhumana Abhinay: ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఎలాంటి పాలన చేస్తుందనే దానికి ఈ ఘటన మరో ఉదాహరణగా నిలుస్తోంది. గతంలో తాము చెప్పిన వారికి రుణాలివ్వలేదని బ్యాంకుల ముందు చెత్త పోసిన ఘటన మరువక ముందే ఇప్పుడు తిరుపతి ఎయిర్ పోర్టు అధికారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు స్థానిక లీడర్లు. ఎయిర్ పోర్టు అధికారులు, సిబ్బంది ఉండే కాలనీకి నీటి సరఫరా ఆపేశారు. ఎయిర్ పోర్టులో కూడా దాదాపు అదే పరిస్థితి. చేసేదేమీ లేక అధికారులు ట్యాంకర్లతో వాటర్ తెప్పించుకుంటుంటే మరమ్మత్తుల పేరుతో ఏకంగా రోడ్లన్నీ తవ్వించారు. ఎందుకు ఇలా చేస్తోంది జగన్ ప్రభుత్వం అంటే స్థానిక డిప్యూటీ మేయర్‌ను విమానాశ్రయ అధికారులు అవమానించడమే అని తెలుస్తోంది.

Bhumana Abhinay
Bhumana Abhinay

తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కొడుకు తిరుపతి కార్పోరేషన్‌కు డిప్యూటీ మేయర్. ఇటీవల ఆయన మున్సిపల్ మంత్రి బొత్స సత్యనారాయణకు స్వాగతం చెప్పేందుకు తన అనుచరులతో కలిసి ఎయిర్‌పోర్టుకు వెళ్లారు. కొవిడ్ నేపథ్యంలో మంది మార్భలంతో లోనికి రావడం కుదరదని, బయటే వెల్ కమ్ చెప్పాలని అధికారులు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డి వారిని అసభ్య పదజాలంతో దూషించారు. వారు ససేమీరా అనడంతో తాను ఈ నగరానికి రెండో డిప్యూటీ మేయర్‌ను కావున తనకు నచ్చినట్టు చేస్తానంటూ రెచ్చిపోతున్నాడు.

Also Read:  ‘ఆర్ఆర్ఆర్’ స్పూఫ్ చూస్తే.. నవ్వాపుకోలేరు (వీడియో)..!

ఎయిర్‌పోర్టుకు నీటి సరఫరా నిలిపివేయించాడు. ట్యాంకర్లు వెళ్లకుండా రిపేర్ల పేరుతో రోడ్లన్నీ తవ్వించాడు.డ్రైనేజీ మరమ్మతుల పేరుతో మున్సిపల్ ఉద్యోగులతోనే అక్కడ కాలయాపన చేయిస్తున్నాడు. అభినయ్ రెడ్డి చేష్టలతో ఎయిర్‌పోర్టు డైరక్టర్‌తో పాటు ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ అబ్బాయి చాలా తప్పు చేస్తున్నాడని ఎయిర్‌పోర్టు డైరక్టర్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినా ఆయన పట్టించుకోలేదు.

తన కుమారుడిని అడ్డుకున్నందుకు అనుభవించాల్సిందే అన్నట్టుగా ఆయన సమాధానం ఇచ్చారట.. ప్రస్తుతం ఈ విషయం కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు ఎయిర్ పోర్టు అధికారులు సీరియస్ అవుతున్నారట. అప్పట్లో బ్యాంకుల ముందు చెత్త పోసినప్పుడే కేంద్రం సీరియస్ యాక్షన్ తీసుకుని ఉంటే ఎయిర్ పోర్టు అధికారులకు ఇలాంటి దుస్థితి వచ్చేది కాదని పలువురు చర్చించుకుంటున్నారు.

Also Read:  థమన్ నెగిటివే పాన్ ఇండియా సినిమాలకు పాజిటివ్ !

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.
RELATED ARTICLES

Most Popular