https://oktelugu.com/

కరోనాపై డా. ఎంఎస్ రెడ్డి చెప్పిన సంచలన నిజాలు

కరోనా కరోనా.. ఇప్పుడు ఎక్కడ చూసినా దాని పేరే. దానివల్లే ఇంతటి ఉపద్రవం. ప్రాణాలు పోతున్నాయి. అందరూ ఆస్పత్రుల పాలవుతున్నారు. దేశంలో కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తోంది. ఎన్నో కాట్నాలను పేర్చేస్తోంది. అయితే దగ్గినా.. తుమ్మినా కరోనా అనుకునేలా పరిస్థితులు తయారయ్యాయి. జలుబు చేస్తే చాలు ఆస్పత్రికెళ్లి పరీక్షలు చేసుకుంటున్నారు.కరోనా అని తెలియగానే కంగారు పడిపోయి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కానీ కరోనాకు భయపడాల్సిన పనిలేదని.. అది ఒక సాధారణ వైరల్ జలుబు దగ్గు వ్యాధి […]

Written By: , Updated On : April 27, 2021 / 05:07 PM IST
Follow us on

కరోనా కరోనా.. ఇప్పుడు ఎక్కడ చూసినా దాని పేరే. దానివల్లే ఇంతటి ఉపద్రవం. ప్రాణాలు పోతున్నాయి. అందరూ ఆస్పత్రుల పాలవుతున్నారు. దేశంలో కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తోంది. ఎన్నో కాట్నాలను పేర్చేస్తోంది. అయితే దగ్గినా.. తుమ్మినా కరోనా అనుకునేలా పరిస్థితులు తయారయ్యాయి. జలుబు చేస్తే చాలు ఆస్పత్రికెళ్లి పరీక్షలు చేసుకుంటున్నారు.కరోనా అని తెలియగానే కంగారు పడిపోయి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కానీ కరోనాకు భయపడాల్సిన పనిలేదని.. అది ఒక సాధారణ వైరల్ జలుబు దగ్గు వ్యాధి అని.. మన భారతీయ వంటకాలు తింటూ జాగ్రత్తలు పాటిస్తే ముఖ్యంగా కరోనాను ఇంట్లోనే నయం చేయవచ్చని అంటున్నారు. అమెరికాలోని వైరాలజీ విభాగంలో దశాబ్ధాలుగా సేవలందిస్తున్న మన ప్రముఖ తెలుగు వైద్యులు ఎంఎస్ రెడ్డి గారు..

అంతర్జాతీయంగా ఎన్నో పురస్కారాలను ఎంఎస్ రెడ్డి సొంతం చేసుకున్నారు. తెలుగు వ్యక్తి అయిన ఎంఎస్ రెడ్డి అమెరికాకు వెళ్లి అక్కడి వైరాలజీ విభాగంలో దశాబ్ధాలుగా సేవలందిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకు విస్తరిస్తూ దశలు మార్చుకుంటున్న కరోనాను నిశితంగా పరిశీలించి పరిశోధించిన ఆయన మహమ్మారిని ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కీలక సూచనలు అందించారు. తాజాగా హైదరాబాద్ కు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా వ్యాధి గురించి.. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కీలక సూచనలు చేశారు.

ప్రముఖ మైక్రో బయాలజిస్ట్ , వైరాలజిస్ట్ అయిన ఎంఎస్ రెడ్డి తన అనుభవాలు వివరించారు. మన చిన్నప్పటి నుంచి దగ్గు, జలుబు ఉందని.. ఈ కరోనా కూడా అలాంటిదేనని ఎంఎస్ రెడ్డి చెప్పుకొచ్చారు. అయితే పాజిటివ్ రాగానే అది కరోనా అనుకుంటున్నారని.. కానీ సాధారణ జబ్బు దగ్గు ఉన్నా కూడా అవే లక్షణాలు ఉన్నాయని కరోనా పేరిట చికిత్స చేస్తున్నారని.. అదే పెద్ద తప్పు అని డాక్టర్ ఎంఎస్ రెడ్డి తెలిపారు.

కరోనా అనగానే అందరిలోనూ భయం వచ్చిందని..ఆ భయం కారణంగానే రోగ నిరోధక శక్తి దెబ్బతింటుందని.. అందుకే ఆ భయంతోనే చాలా మంది చనిపోతున్నారని.. ధైర్యంగా ఉంటే అసలు కరోనా మనల్ని ఏం చేయలేదని డాక్టర్ ఎంఎస్ రెడ్డి చెప్పుకొచ్చారు. లక్షల్లో కేసులు నమోదవుతుంటే కరోనాతో మరణించే వారి సంఖ్య 2 శాతం కూడా లేదని.. దీన్ని బట్టి కరోనా మనల్ని చంపదని.. భయంతోనే చాలా మంది రోగనిరోధక శక్తిని కోల్పోయి చనిపోతున్నారని ఎంఎస్ రెడ్డి తెలిపారు.

మహమ్మారి భయం జనాలను ఆవహించిందని.. ఈ భయం వల్ల ఇమ్యూనిటీ శరీరంలో తగ్గుతుందని.. అదే చావుకు కారణమవుతుందని ఎంఎస్ రెడ్డి తెలిపారు. ధైర్యంగా ఉంటే వైరస్ లు మానవ శరీరాన్ని ఏం చేయలేవన్నారు.

వైరస్ లకు అసలు చికిత్సలు లేవని.. వైరస్ అనేది ఒక పరాన్నజీవి అని.. అది ఒంటరిగా ఏం చేయలేదన్నారు. మానవ శరీరంలోకి చేరాక కణాలను పట్టి విస్తరించి అప్పుడు ప్రభావం చూపుతుందన్నారు. కరోనా శరీరంలోకి వెళ్లాక ఇమ్యూనిటీ తగ్గితేనే అది మనపై ప్రభావం చూపుతుందని.. మంచి ఇమ్యూనిటీ ఉంటే భయం ఉండకపోతే మనల్ని ఏం చేయలేదన్నారు. భయం వల్లే మన ఇమ్యూనిటీ తగ్గుతుందని.. అది తగ్గగానే వైరస్ లు అటాక్ చేస్తాయని డాక్టర్ ఎంఎస్ రెడ్డి తెలిపారు.

మనోధైర్యమే కరోనాకు మందు అని.. భారతీయ వంటకాలైన గసగసాల వల్ల కరోనాను నివారించవచ్చని డాక్టర్ ఎంఎస్ రెడ్డి తెలిపారు. మన లవంగాలు, యాలకులు లాంటి సుగంధ ద్రవ్యాల్లో కరోనాను ఎదుర్కొనే పౌష్టికత ఉందని.. మన భారతీయ ఆహారానికి చాలా రోగాలను నయం చేసే శక్తి ఉందని డాక్టర్ ఎంఎస్ రెడ్డి వివరించారు.

బట్టర్ మిల్క్ కు కరోనాకు చక్కని విరుగుడు అని.. రోజూ యోగా చేయాలని.. దానివల్ల శరీరానికి రోగనిరోధక శక్తి మెరుగవుతుందని.. కరోనాను ఇవి ఎదుర్కోగలవన్నారు.

ఇంట్లో చేసుకునే పుల్లటి పెరుగులో ఉండే బ్యాక్టీరియా తిన్నప్పుడు మనల్ని ఏ రోగం ఏం చేయలేదని ఎంఎస్ రెడ్డి తెలిపారు. పుల్లమజ్జిగ, చద్దన్నంను మించిన భారతీయ ఆహారం లేదని..వీటివల్ల కరోనా పారిపోతుందని ఏ రోగాలు రావని ఎంఎస్ రెడ్డి తెలిపారు.

  • ఎంఎస్ రెడ్డి గారి పూర్తి వీడియోను కింద చూడొచ్చు.

 

Truths on Corona Virus | Revealed by World Famous Virologist Dr MS Reddy  | ETV Exclusive