Pawan Kalyan Varahi Yatra: జనసేనాని పవన్ మొదటి విడత వారాహి యాత్ర సూపర్ సక్సెస్ కావడం.. అధికార వైసీపీకి మింగుడు పడడం లేదు. పది రోజులు, పది నియోజకవర్గాల్లో నిర్వహించిన పది సభల్లో పవన్ అధికార వైసీపీపై ఎక్కుపెట్టిన విమర్శలను డిఫెన్స్ చేయడాకి ఆ పార్టీ నేతలు తటపటాయిస్తున్నారు. పవన్ రెడువైపులా పనుదున్న కత్తిలా.. సంధించిన విమర్శలతో ఏం మాట్లాడితే ప్రజల స్పందన, కులాలపై ప్రభావం ఎలా ఉంటుందో తెలియడం లేదు.
కాపులతో తిట్టిస్తున్న వైసీపీ..
పవన్ కళ్యాణ్ వరాహి యాత్రలో చేసిన ఆరోపణలు, సంధించిన విమర్శలను ఎదుర్కొనేందుకు అధికార పార్టీ నేతలు వెనుకాడతున్నారు. అదే సమయంలో విమర్శలను చూసి స్పందించకుంటే జనంలోకి తప్పుడు సంకేతం వెళ్లే అవకాశం ఉంది. దీంతో వైసీపీ నాయకులు తాము విమర్శించకుండా, పవన్ సామాజికవర్గానికి చెందిన కాపులను రంగంలోకి దించుతున్నారు. మాజీ మంత్రి పేర్ని నాని, పోసాసి కృష్ణమురళి, కాపు ఉద్యమ నేత ముద్రడను రంగంలోకి దించాయి. పవన్ చేసిన విమర్శలకు ఈ ముగ్గురితో జనసేనాని తిట్టిస్తుంది.
అంతు చిక్కని పవన్ వ్యూహం..
అయితే పవన్ వ్యూహం ఏమిటో ఎవరికీ అంతుచిక్కడం లేదు. పవన్‌పై విమర్శలు చేయిస్తున్నా అధికార పార్టీకి మాత్రం కంటిమీద కునుకు ఉండడం లేదు. తన విమర్శలతో అధికార పార్టీని రెచ్చగొడుతున్న జనసేనాని.. తర్వాత తన ఒక్కడిపై మూకుమ్మడిగా చేస్తున్న దాడిని జనం ముందు పెడుతున్నారు. దీంతో అధికార పార్టీ పవన్‌ను అణచివేస్తోందన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. పవన్ ఊహించింది కూడా ఇదే. అధికార పార్టీని ఇరుకున పెట్టేలా పదునైన విమర్శలతో అధికార పార్టీ నేతలను ముగ్గులోకి లాగుతున్న జనసేనాని.. వ్యూహాత్మకంగా వైసీపీని డిఫెన్స్‌లో పడేస్తున్నారు.