https://oktelugu.com/

Preeti -Saif : ప్రీతి ఆత్మహత్యకు కారకుడైన సైఫ్ విడుదల

Preeti -Saif  : సంచలనం సృష్టించిన పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న మహ్మద్‌ సైఫ్ గురువారం ఖమ్మం జిల్లా జైలు నుంచి విడుదలయ్యాడు. గత ఫిబ్రవరిలో వరంగల్‌లో వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యకు సైఫ్‌ కారణమంటూ పోలీసులు అరెస్టుచేసి కోర్టులో హాజరుపరచగా, వారు రిమాండ్‌ విధించారు. రెండు నెలల నుంచి ఖమ్మంజిల్లా జైలులో ఉండగా, బుధవారం అతడికి బెయిల్‌ మంజూరయింది. అయితే పూచీకత్తు, సంతకాల విషయమై ఆలస్యం కావడంతో సాధారణ […]

Written By:
  • Rocky
  • , Updated On : April 20, 2023 8:53 pm
    Follow us on

    Preeti -Saif  : సంచలనం సృష్టించిన పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న మహ్మద్‌ సైఫ్ గురువారం ఖమ్మం జిల్లా జైలు నుంచి విడుదలయ్యాడు. గత ఫిబ్రవరిలో వరంగల్‌లో వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యకు సైఫ్‌ కారణమంటూ పోలీసులు అరెస్టుచేసి కోర్టులో హాజరుపరచగా, వారు రిమాండ్‌ విధించారు. రెండు నెలల నుంచి ఖమ్మంజిల్లా జైలులో ఉండగా, బుధవారం అతడికి బెయిల్‌ మంజూరయింది. అయితే పూచీకత్తు, సంతకాల విషయమై ఆలస్యం కావడంతో సాధారణ కోర్టు వాయిదా ఉండడంతో గురువారం ఖమ్మం పోలీసులు వరంగల్‌ కోర్టులో హాజరుపరిచారు. అయితే రిలీజ్‌ ఆర్డర్‌ కాపీ కూడా వరంగల్‌ కోర్టు నుంచి గురువారం సాయంత్రం రావడంతో అక్కడి కోర్టు నుంచి ఖమ్మం జైలుకు సైఫ్‌ను తీసుకువచ్చారు. ఆర్డర్‌ కాపీ ద్వారా సంతకాలు తీసుకుని అతడిని సాయంత్రం ఆరుగంటల సమయంలో విడుదల చేశారు. విడుదల అనంతరం సైఫ్‌ తల్లిదండ్రులు ముందుగానే జైలు వద్దకు చేరుకుని అతడిని ఆటోలో తీసుకెళ్లారు. ఈక్రమంలో సైఫ్‌ తల్లిదండ్రులను కేసు విషయమై అడగ్గా సైఫ్‌పై వచ్చిన ఆరోపణలు అవాస్తవాలని తెలిపారు.

    ఇదీ జరిగింది

    వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో డాక్టర్ ప్రీతి, డాక్టర్ సైఫ్ వరంగల్ లోని కాకతీయ మెడికల్ కాలేజీలో వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. ఇందులో డాక్టర్ సైఫ్ సీనియర్.. డాక్టర్ ప్రీతి జూనియర్. వీరికి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది.. అయితే కాకతీయ మెడికల్ కాలేజీలో సీనియర్లను జూనియర్లు సార్ అని సంబోధి స్తుంటారు. ఇది ఎప్పటి నుంచో కొనసాగుతోంది. అయితే ప్రీతి సీనియర్లను సార్ అని ఎందుకు పిలవాలని నిలదీసింది.. ఇది నచ్చని సీనియర్లు ఆమెను టార్గెట్ చేశారు. ముఖ్యంగా సైఫ్ ఆమెను వేధించాడు . అంతే కాదు ఆమెను అవమానించేలా వాట్సప్ గ్రూప్ లో పోస్టులు పెట్టాడు. అలా పెట్టవద్దని ప్రీతి వేడుకున్నది. ఒకానొక సందర్భంలో సైఫ్ ఆమెకు మెదడు లేదని దూషించాడు..

    ఫిబ్రవరి 20వ తేదీన సైఫ్ వేధిస్తున్న తీరు గురించి ప్రీతి తల్లిదండ్రులకు చెప్పింది. 21న కాలేజీ యాజమాన్యం ప్రీతి, సైఫ్ ను విచారించింది. మరుసటి రోజు తెల్లవారుజామున ప్రీతి ఆత్మహత్యకు యత్నించింది. ఆరోగ్యం విషమించి చనిపోయింది. ప్రీతికి మొదటి నుంచి ప్రశ్నించే గుణం ఎక్కువ ఉంది. ఆమె డేరింగ్, సెన్సిటివ్ కూడా.. ఆమె ప్రశ్నించడాన్ని సైఫ్ తట్టుకోలేకపోయేవాడు. ఆమెకు సహకరించవద్దని తన ఫ్రెండ్స్ కు చెప్పేవాడు. సైఫ్ సమస్య గురించి ప్రీతి ఎక్కువగా ఆలోచించేది. అతడు వేధిస్తున్నాడని మనస్థాపానికి గురై ఆత్మహత్యకు యత్నించింది. చివరికి కన్ను మూసింది.

    ఇక ఈ కేసులో తమకు అనుమానాలు ఉన్నాయని మొదటి నుంచి ప్రీతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మరోవైపు ప్రీతి మృతదేహానికి అప్పట్లో రాత్రికి రాత్రే అంత్యక్రియలు నిర్వహించారు. ఇక ఈ కేసులో నిందితుడిగా ఉన్న సైఫ్ ప్రస్తుతం విడుదలయిన నేపథ్యంలో ప్రీతి తల్లిదండ్రులు ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.