తెలంగాణలో కరోనా కేసుల తగ్గుదలకు కారణమేంటి?

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య అనూహ్యంగా పడిపోతోంది. మంగళవారం కొత్తగా కేవలం 6 కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే నమోదైనట్టు మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఈ 6 కేసులు కూడా జీహెచ్ఎంసీ పరిధిలోనే కావడం గమనార్హం. తాజా కేసులతో తెలంగాణలో 1009కి కరోనా కేసులు చేరాయి. ఇప్పటిదాకా 25మంది మృతిచెందారు. మంగళవారం డిశ్చార్జి కానున్న 42మందితో కలిపి ఇప్పటివరకు మొత్తంగా 374 మంది డిశ్చార్జి అయ్యారు. *తెలంగాణలో తగ్గుతున్నాయా? పరీక్షలు లేవా? తెలంగాణ కరోనా తగ్గుముఖం […]

Written By: Neelambaram, Updated On : April 29, 2020 10:36 am
Follow us on


తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య అనూహ్యంగా పడిపోతోంది. మంగళవారం కొత్తగా కేవలం 6 కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే నమోదైనట్టు మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఈ 6 కేసులు కూడా జీహెచ్ఎంసీ పరిధిలోనే కావడం గమనార్హం. తాజా కేసులతో తెలంగాణలో 1009కి కరోనా కేసులు చేరాయి. ఇప్పటిదాకా 25మంది మృతిచెందారు. మంగళవారం డిశ్చార్జి కానున్న 42మందితో కలిపి ఇప్పటివరకు మొత్తంగా 374 మంది డిశ్చార్జి అయ్యారు.

*తెలంగాణలో తగ్గుతున్నాయా? పరీక్షలు లేవా?
తెలంగాణ కరోనా తగ్గుముఖం పడుతున్నాయని సర్కారు చెబుతోంది. ఏపీలో పెరుగుతున్నాయి. ఏపీలో వేలకు వేల పరీక్షలు చేస్తుండడంతో 100లోపు కేసులు నమోదవుతున్నాయి. అయితే అందుకు భిన్నంగా తెలంగాణలో కేవలం లక్షణాలు బయటపడ్డవారికి మాత్రమే పరీక్షలు చేస్తున్నారు. దీంతో సింగిల్ డిజిట్ కే కేసులు పరిమితమవుతున్నాయి. నిజానికి పరీక్షలు లేని కారణంగా కేసులు తగ్గుతున్నాయనే అనుమానాలు కలుగుతున్నాయి..

*పరీక్షలు తగ్గించిన తెలంగాణ
కరోనా వైరస్ వ్యాపించకుండా పక్కనున్న ఏపీ సహా అన్ని రాష్ట్రాలు కేసుల సంఖ్యను పెంచుతున్నాయి. సీఎం జగన్ అయితే కొరియా నుంచి కొత్త కరోనా కిట్స్ తెప్పించి మరీ వందల సంఖ్యలో రోజుకు పరీక్షలు చేస్తున్నారు. కానీ తెలంగాణ మాత్రం లక్షణాలు బయటపడ్డ వారికే చేయడం చర్చనీయాంశమవుతోంది. మార్చి 22 నుంచి దేశవ్యాప్తంగా కరోనా టెస్టుల సంఖ్యను అన్ని రాష్ట్రాలు పెంచగా తెలంగాణ మాత్రం తగ్గించడం అనుమానాలకు తావిస్తోంది.

*లక్షణాలతో వచ్చిన వారికి చేయని వైనం
తాజా సమాచారం ప్రకారం.. కొంతమంది వ్యక్తులు తమకు కరోనా లక్షణాలున్నాయని.. టెస్టులు చేయాలని కింగ్ కోఠి ఆస్పత్రికి పెద్ద ఎత్తున వస్తున్నారట. అయితే రోగి వయసు, ట్రావెల్ హిస్టరీ, ఎవరెవరితో సంబంధం ఉందని చూసి ఏమీ లేకపోవడంతో వారికి పరీక్షలు చేయకుండానే పంపిస్తున్నారట.. తాజాగా ఓ జర్నలిస్టుకు ఇదే చేదు అనుభవం ఎదురుకావడం గమనార్హం.

*హాట్ స్పాట్ లోనే పరీక్షలు.. బయటవారికి బంద్?
ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ ఆదేశాల ప్రకారం హాట్ స్పాట్స్ లో నివసించే వారికి మాత్రమే కరోనా లక్షణాలు బయటపడితే కరోనా పరీక్షలు చేయాలి. కేంద్రం కూడా ఇవే ప్రొటోకాల్ పాటించాలని సూచించింది. దీని ఆధారంగా తెలంగాణ సర్కారు పరీక్షలను పూర్తిగా తగ్గించిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎవరికి పడితే వారికి బయట నుంచి వచ్చిన వారికి చేయవద్దని సూచించింది. తాజాగా న్యూస్ 18 సీనియర్ జర్నలిస్టు ప్రియ తనకు కరోనా టెస్టులు చేయమన్నా అధికారులు చేయలేదట.. 33 ఏళ్ల వయసున్న మీరు కరోనాతో మీ శరీరం పోరాడగలదని.. టెస్టు అవసరం లేదని తిప్పి పంపించారట..దీన్ని ట్విట్టర్ లో పెట్టి ఆమె తెలంగాణ వైద్యుల తీరును ఎండగట్టింది. దీన్ని బట్టి తెలంగాణ సర్కారు పరీక్షలు చేయకుండా కరోనా కేసులను తక్కువగా చూపిస్తోందన్న అనుమానాలకు బలం చేకూరుతోంది.

* కేంద్రాన్ని బూచీగా చూపి తెలంగాణ మమ అంటోందా?
కరోనా పరీక్షల విషయంలో కేంద్రం నిబంధనలు సాకుగా చూపి తెలంగాణ సర్కారు పరీక్షలను చేయడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతర్జాతీయంగా దేశాలు కూడా పూర్తిగా లక్షణాలు బయటపడి సీరియస్ ఉన్నవారికే చికిత్సలు చేస్తున్నాయి. తెలంగాణ కూడా ఇదే ఫార్ములాను అవలంభిస్తున్నట్టు తెలుస్తోంది. ఏప్రిల్ 27నాటికి జాతీయ సగటు 620తో పోలిస్తే ప్రతీ పది లక్షల మందికి 375 పరీక్షలు నిర్వహించినట్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇదే పొరుగు రాష్ట్రం ఏపీ ఇదే 10 లక్షలమందికి 1100 పరీక్షలు నిర్వహించింది. పరీక్షల విషయంలో పారదర్శకత పాటించని తెలంగాణ సర్కారు ఇలా నిర్లక్ష్యంగా పరీక్షలు చేయక మూల్యం చెల్లించుకుంటుందా అన్న అనుమానాలకు కలుగుతున్నాయి. మరి మున్ముందు కరోనా నిజంగానే తగ్గిందా? పరీక్షలు చేయకపోవడం వల్లనే కేసులు బయటపడడం లేదా అన్నది తేలాల్సి ఉంది.

–నరేశ్ ఎన్నం