
సీనియర్ హీరోల్లో నందమూరి బాలకృష్ణ సినిమాలకి ఇటీవల ఆదరణ బాగా తగ్గింది.వరుసగా పైసా వసూల్ , జై సింహ , ఎన్ టి ఆర్ కధానాయకుడు , ఎన్ టి ఆర్ మహానాయకుడు , రూలర్ వంటి చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద బాల్చీ తన్నాయి. అందుకే బాలకృష్ణ తనకి అలవాటు లేకపోయినా కానీ బోయపాటి శ్రీను కథ సిద్ధం చేసేవరకు వేచి చూసాడు
ఇదిలావుంటే వరుస హిట్స్ తో దూసుకుపోతున్న యువ దర్శకుడు అనిల్ రావిపూడి బాలయ్య కి
వీరాభిమాని. .బాలకృష్ణతో సినిమా చేయాలనేది అతని చిరకాల స్వప్నం. ఆ క్రమంలో ఇంతకుముందు అనిల్ రావిపూడి బాలకృష్ణ తో ` రామారావు ` అనే సినిమా చేయడానికి ప్రయత్నిస్తే బాలయ్య ఆసక్తి చూపలేదు . కానీ ఇప్పుడు బాలయ్య ఆలోచన మారింది. అనిల్ రావిపూడి తో సినిమా చేయడానికి బాలయ్యే రాయబారం పంపాడని తెలుస్తోంది .
దర్శకుడిగా ఇప్పుడు ఎంత డిమాండ్ పెరిగినా కానీ అనిల్ రావిపూడికి బాలయ్య పై అభిమానం అలాగే ఉంది. అందుకే ఆయనతో సినిమా తీసి తీరాలని ఫిక్స్ అయ్యాడు. ఇది తెలిసి బాలయ్య సంతోషంగా అనిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. కాగా అనిల్ రావిపూడి తో వరుస సినిమాలు చేస్తున్న దిల్ రాజు బ్యానర్ లోనే ఈ చిత్రం ఉంటుందని తెలుస్తోంది .