జాతీయ వార్తలుCurrency Notes : పెద్ద నోట్ల తోనే అసలు సమస్య

Currency Notes : పెద్ద నోట్ల తోనే అసలు సమస్య

Currency Notes : ఎన్నికల ముంగిట కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ఇందులో ఎన్నో రకాల సంచలనాలు ఉన్నాయి. ఇప్పటికే గ్యాస్ ధర తగ్గింపుతో కేంద్రం బలమైన సంకేతాలను పంపించింది. ఇప్పుడు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించి కీలక బిల్లులను తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది. జెమిని ఎన్నికలు, మహిళా బిల్లు వంటి వాటితో పాటు దేశం పేరు ఇక భారత్ గా ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకోవడం ఖాయం గా కనిపిస్తోంది. అదే జరిగితే ఇండియా పేరుతో నిర్వహిస్తున్న అన్ని పేర్లు భారత్ గా మారనున్నాయి. ఈ తరుణంలో పెద్ద నోట్లు రద్దు అంశం సాంకేతికంగా తెరపైకి వచ్చింది.

దేశవ్యాప్తంగా ఒకేసారి జమిలీ ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం భావిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకుగాను మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తో కమిటీ ఏర్పాటు చేసింది. మరోవైపు కేంద్రం ముందస్తు ఎన్నికలకు వెళుతుందని.. దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో మహిళా బిల్లుతో పాటు కీలక నిర్ణయాలన్నింటికీ ఆమోదం పొందాలని కేంద్రం భావిస్తోంది.

ఒకవేళ ఇండియా పేరును భారత్ గా మారిస్తే.. ఇప్పటివరకు ఇండియా పేరి ట జరిగే కార్యకలాపాలన్నీ.. భారత్ గా మార్చాల్సిన అవసరం ఉంది. ఇండియా పేరిట నిర్వహిస్తున్న సంస్థలు, బ్యాంకుల పేర్ల మార్పు అనివార్యం. ప్రధానంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ భారత్ గా మారనుంది. అయితే ఇక్కడే అసలు సమస్య తలెత్తనుంది. ఆర్.బి.ఐ జారీ చేసిన అన్ని కరెన్సీ నోట్ల పైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరు ఉంటుంది. దేశం పేరు మారితే ఈ కరెన్సీ నోట్లను ఏం చేస్తారు అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. కరెన్సీ నోట్లకు మినహాయింపు ఇస్తారా.. లేకుంటే రద్దు చేస్తారా? అన్నది తేలాల్సి ఉంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Polymer Currency Notes : దేశంలో ఇక ప్లాస్టిక్ కరెన్సీ..! RBI భారీ అడుగు.. పాకిస్తాన్ కు భారీ షాక్

Polymer Currency Notes : భారతదేశంలో కరెన్సీ నోట్ల వ్యవస్థలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) పెద్ద మార్పు తీసుకోబోతుంది. ప్రస్తుతం సాధారణ కాగితం నోట్లు చలామణిలో ఉన్నాయి. వీటి స్థానంలో మరింత...

Narendra Modi: విడగొట్టి, పడగొట్టే సంస్థలకు మోదీ ముక్కుతాడు.. ఇక ఆ సంస్థలు అస్సామే..

Narendra Modi: 2014లో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి రావడం భారత రాజకీయాల్లో ఒక ముఖ్యమైన మలుపుగా మారింది. దశాబ్దాలుగా ఢిల్లీలో ఏర్పడిన ఒక ప్రత్యేకమైన ఎకోసిస్టమ్‌ను ఈ మార్పు నేరుగా...

Most Popular

Delhi Protests

Delhi Protests: అటు కాక్రోచ్ లు.. ఇటు రైతులు.. మోడీకి ఏంటీ తలనొప్పులు

Delhi Protests: ఢిల్లీ నగరం ఆందోళనలతో అట్టుడికి పోతుంది. గతంలో కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. అప్పుడు హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది రైతులు అందులో పాల్గొన్నారు. ఇదే అదునుగా ఖలీస్థానీ...
ISI Agents In India

ISI Agents In India: అమాయక హిందువులే పాకిస్తాన్ ఐఎస్ఐ టార్గెట్.. ఎంతటి దుర్మార్గానికి పాల్పడిందంటే..

ISI Agents In India: సరిహద్దుల్లో మారణ హోమం సృష్టిస్తూ ఉంటుంది. మన సైనికులపై దాడులకు పాల్పడుతూ ఉంటుంది. ప్రశాంతమైన మనదేశంలో అల్లకల్లోలం సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. నకిలీ నగదు.....

13-year-old boy : కమీషన్ ఇస్తేనే పనిచేస్తారా.. 13 ఏళ్ల బాలుడి ప్రశ్నకు కలెక్టర్ కు నోటి మాట...

13-year-old boy : అది కలెక్టర్ కార్యాలయం.. కలెక్టర్.. ఇతర అధికారులు ప్రజల సమస్యలు వింటున్నారు. ప్రజలు కూడా తమ సమస్యలను చెప్పుకోవడానికి అక్కడికి వచ్చారు. వారంతా కూడా తమ సమస్యల మీద...

NITI Aayog Rankings : కాలం చెల్లిన గణాంకాలతో నీతి ఆయోగ్ ర్యాంకులు

NITI Aayog Rankings : కేంద్ర ప్రభుత్వ విధాన నిర్ణాయక సంస్థ 'నీతి ఆయోగ్' (NITI Aayog) రాష్ట్రాల ప్రగతిని అంచనా వేసేందుకు విడుదల చేసే నివేదికలు ఎల్లప్పుడూ చర్చనీయాంశంగా మారుతుంటాయి. తాజాగా...

Cockroach Janata Party : చొచ్చుకొచ్చిన బొద్దింకలు.. దిగొస్తున్న బీజేపీ సర్కార్.. ఢిల్లీలో నాటకీయ పరిణామాలు

Cockroach Janata Party : దేశ రాజధాని ఢిల్లీలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా ఢిల్లీ నగరంలో పోలీసులు సహజంగానే ఆంక్షలు విధిస్తూ ఉంటారు. అయితే ఈసారి ఆ...