Sri Lanka Crisis: పెరుగుట విరుగుట కొరకే అంటారు. ఏదైనా అతి అయితే అనర్థమే. దేశంలో బద్ధకస్తులు పెరిగిపోతే కష్టాలు తప్పవు. ప్రస్తుతం శ్రీలంక పరిస్థితి కూడా అలాగే తయారయింది. తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. దీంతో ప్రజలు అల్లాడుతున్నారు. ఆకలికి అలమటిస్తున్నారు. ఉచిత పథకాలు, ప్రజల స్కీములకు పోయి దేశం కుదేలైపోయింది. ఫలితంగా ఆహారం కూడా దొరకని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆ దేశ దుర్గతి ఏ దేశానికి కూడా రాకూడదనే వాదన వస్తోంది. ఈ క్రమంలో శ్రీలంకలో పరిస్థితి చేయిదాటి పోవడానికి చాలా కారణాలే ఉన్నాయని తెలుస్తోంది. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్లు దేశం దిగజారిపోవడానికి కారణాలు అనేకం ఉన్నట్లు సమాచారం.

ఇదే పరిస్థితి భారత్ కు వస్తే ఏంటి అనే ప్రశ్నలు వస్తున్నాయి. దేశంలోని కొన్ని రాష్ట్రాలు ఉచిత పథకాల పేరుతో ప్రజాధనం మొత్తం పంపిణీ చేస్తుండటంతో రాబోయే రోజుల్లో కష్టకాలం వచ్చే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. దీనిపై అప్రమత్తంగా ఉండాలనే సూచనలు వస్తున్నాయి. దేశంలో నానాటికి ధరలు పెరుగుతుండటంతోనే ఈ ప్రమాదాలు పొంచి ఉన్నాయని చెబుతున్నారు.
Also Read: AP New Districts-CM Jagan: కొత్త జిల్లాలను ప్రారంభించిన జగన్.. అభివృద్ధి ఊసే ఎత్తలే..
ఆర్థిక ప్రగతిపై అదుపు లేకపోతే పరిస్థితి చేయిదాటిపోయే అవకాశం ఉంటుందని తెలుసుకోవాలి. ఆర్థిక ఇబ్బందులు పెరిగితే కష్టాలు తప్పవు. అందుకే రాష్ట్రాలు ఉచిత పథకాలు ఇవ్వడం మానుకుంటేనే మంచిదనే అభిప్రాయం అందరిలో వస్తోంది. భవిష్యత్ లో సంక్షోభ పరిస్థితులు తప్పవని చెబుతున్నారు. అభివృద్ధికి ఖర్చు పెడితే తప్పులేదు కానీ ఉచిత పథకాలకు ఊడ్చిపెడితే నష్టాలే ఎదురవుతాయి.

ప్రభుత్వాలు ఉచిత పథకాల ప్రభావానికి గురికాకుండా ఉండేందుకు చొరవ చూపాలి. ఒకవేళ ఈ పథకాలకు ప్రజలను ఆకర్షితులను చేస్తే ఇక వారు పని చేయకుండా బద్ధకస్తులైతే ప్రమాదం ఏర్పడుతుంది. ఇప్పుడు శ్రీలంకలో జరిగిన పరిస్థితి అలాగే ఉంది. దేశం యావత్తు సంక్షోభంలో ఇరుక్కుపోయింది. దీంతో ఎటూ తేల్చుకోలేని దుస్థితి దాపురించింది. ప్రజలు కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ఆహార సంక్షోభంలోకి వెళ్లింది. కనీసం పిల్లలకు సైతం తిండి దొరకని అధోగతి దాపురించింది. ఈ కష్టాలు ఎవరికి రాకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Also Read:Bigg Boss Telugu OTT: స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎలిమినేట్.. అతని మీద సిరీయస్..