Prabowo Subianto: ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగం మనదే. అందకే మనది అతిపెద్ద గణతంత్ర(Republic) రాజ్యంగా బావిస్తారు. రాజ్యాంగమే దేశానికి దిశానిర్దేశం. రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజును గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. తాజాగా ఆదివారం యావత్ దేశం 76వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంది. మువ్వన్నెల జెండాలు దేశమంతా రెపరెపలాడాయి. ఇక గణతంత్ర వేడుకలకు ఏటా ఒక విదేశీ అతిథిని ఆహ్వానించడం సంప్రదాయంగా వస్తోంది. 76వ గణతంత్ర వేడుకలకు ఇండోనేషియా ప్రధాని ప్రబోవో సుబియాం (Prabhovo Nambiyam) హాజరయ్యారు. ఎర్రకోటలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్నారు. సైనిక విన్యాసాలను తిలకించారు. సాంస్కృతిక కార్యక్రమాలు చూసి ముగ్ధుడయ్యారు. అనంతరం రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటు చేసిన విందులో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతోపాటు కేంద్ర మంత్రులు, వివిధ పార్టీల నాయకులు కూడా హాజరయ్యారు.
ప్రసంగంతో నవ్వులు..
రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించిన విందు సందర్భంగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాం మాట్లాడుతూ నవ్వులు ఫూయించారు. ఇదే సమయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు భారత్‌తో దగ్గరి సంబంధాలు ఉన్నాయన్నారు. ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో తన మూలాలు భారత్‌లో ఉన్నట్లు వెల్లడయ్యాయని తెలిపారు. కొన్ని రోజుల క్రితం తాను జన్యు విశ్లేషణ(డీఎన్‌ఏ) పరీక్షలు చేయించుకున్నానని తెలిపారు. అందులో తనది భారతీయ డీఎన్‌ఏ(DNA)గా తేలిందని పేర్కొన్నారు. భారతీయ సంగీతం వింటే తాను హుషారుగా నృత్యం చేస్తానని తెలిపారు. ఇది తన భారతీయ మూలాల్లో భాగమై ఉండవచ్చని అన్నారు. సుంబియాంతో మాటలతో ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్ సహా సభికులు పెద్దగా నవ్వారు.
ఇరు దేశాలకు పురాతన చరిత్ర..
ఇదిలా ఉంటే.. భారత్, ఇండోనేషియాకు పురాతన పరంగా సుదీర్ఘ చరిత్ర ఉందని సుబియాం తలిపారు. రెండు దేశాల నాగరిక సంబంధాలు మెరుగ్గా ఉన్నాయని పేర్కొన్నారు. రెండ దేశాల మాతృభాషలు సంస్కృతం నుంచే వచ్చాయని తెలిపారు. రోజువారీ జీవితాల్లో పురాతన భారతీయ నాగరికత ప్రభావం బలంగా కనిపిస్తుందని తెలిపారు. మన జన్యువుల్లో ఇదొక భాగం అయి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఇదే క్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసలతో ముంచెత్తారు. విశ్వ గురువుగా మోదీ కీర్తి గడించారని తెలిపారు.