Lucifer 2
Lucifer 2 : మలయాళం సినిమా ఇండస్ట్రీలో మోహన్ లాల్ కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఇక కంప్లీట్ యాక్టర్ (Complete Actor) అనే పేరుతో అతన్ని పిలుస్తూ ఉంటారు. ఏ పాత్రలో అయిన సరే నటించి మెప్పించగలిగే కెపాసిటీ ఉన్న నటుడు కూడా తనే కావడం విశేషం…ఇక ప్రస్తుతం ఆయన ‘L2E ఎంపూరన్’ అనే పేరుతో ఒక సినిమా చేస్తున్నాడు. నిజానికి ఈ సినిమా గతంలో ఆయన చేసిన ‘లూసిఫర్ ‘ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాని మలయాళం సినిమా ఇండస్ట్రీలో మంచి నటుడిగా గుర్తింపును సంపాదించుకున్న పృథ్వీరాజ్ కుమారన్ డైరెక్ట్ చేయడం విశేషం… ఇక వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన లూసిఫర్ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ అవ్వడంతో ఈ సినిమాకి భారీ క్రేజ్ అయితే దక్కుతుంది. ఇక ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తూ ఉండడం విశేషం. ఇక ఇది ఇలా ఉంటే ఈ సినిమా నుంచి రీసెంట్ గా టీజర్ అయితే రిలీజ్ అయింది. ఈ టీజర్ లో మోహన్ లాల్ ని అత్యంత పవర్ ఫుల్ వ్యక్తిగా చూపించడమే కాకుండా విజువల్స్ తో కూడా పృథ్వి రాజ్ కుమారన్ చాలా వండర్స్ ని క్రియేట్ చేసినట్టుగా తెలుస్తోంది… ఇక టీజర్ ని కనక మనం ఒకసారి గమనించినట్లయితే టీజర్ స్టార్టింగ్ లోనే ఇరాక్ ప్రాంతాన్ని చూపిస్తూ వచ్చాడు దర్శకుడు అలాగే ‘నీ చుట్టూ ఉన్న వాళ్ళు నీకు మోసగాళ్ళు అనిపించినప్పుడు ఈ నాన్న లేకుంటే నిన్ను ఆదుకోగలిగినవాడు ఒక్కడే ఉంటాడు అతడే స్టీఫెన్’…
అనే ఒక భారీ డైలాగ్ తో మోహన్ లాల్ క్యారెక్టర్ ను ఇంట్రడ్యూస్ చేశారు… ఇక మరొక డైలాగ్ ని కనక మనం చూసినట్లయితే ఈ సినిమాలో మోహన్ లాల్ క్యారెక్టర్ ను భారీ ఎలివేషన్స్ తో ఎలా చూపించబోతున్నారో మనకు చాలా క్లియర్ కట్ గా అర్థమవుతుంది…
‘జగదీష్ స్టీఫెన్ హిందువులకు మహిరావణుడు, ముస్లింలు ఇబ్లిస్ అని పిలుస్తారు… క్రిస్టియానిటి లో అతనికి ఉన్న ఒకే ఒక పేరు లూసిఫర్’ అంటూ వచ్చే మరొక డైలాగ్ కూడా ఈ టీజర్ లో హైలెట్ గా నిలుస్తోంది… నిజానికి టీజర్ మొత్తాన్ని చాలా గ్రాండ్ గా చిత్రీకరించారు. దీన్ని బట్టి సినిమా చాలా రిచ్ గా ఉండబోతుందన్న విషయమైతే మనకు చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఎలివేషన్స్ తోనే సినిమా మొత్తాన్ని నడిపించినట్టుగా కూడా తెలుస్తుంది.
మరి మోహన్ లాల్ మొదటి పార్ట్ లో చాలా పవర్ ఫుల్ పాత్రలో కనిపించాడు. ఈ పార్ట్ లో అంతకుమించి అనేలా కనిపించబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా వీళ్ళ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా మీద ఇండియా వైడ్ గా భారీ ఆంచనాలైతే ఉన్నాయి…