Three agricultural laws: సాగు చట్టాల రద్దు: మోడీ పంతం ఓడింది.. రైతే గెలిచాడు!

Three agricultural laws: ‘నేను మోనార్క్ ను.. నేను చేసిందే చట్టం.. గీసిందే గీత’ అన్నట్టుగా సాగిన దేశపు పెద్దమనిషి ప్రధాని మోడీ తొలిసారి వెనక్కి తగ్గాడు. పాకిస్తాన్ పై సర్జికల్ స్ట్రైక్ విషయంలో కానీ.. చైనాతో ఢీ అంటే ఢీ అనడంలో కానీ.. కశ్మీర్ ను వేరుచేసే ఆర్టికల్ 370 డీ రద్దు విషయంలో.. సీఐఐ చట్టం విషయంలో ఎన్ని ఆందోళనలు జరిగినా.. విమర్శలు వచ్చినా.. దేశం మొత్తం అల్లకల్లోలం అయినా ‘తగ్గేదే లే’ అన్నట్టుగా […]

Written By: NARESH, Updated On : November 20, 2021 11:40 am
Follow us on

Three agricultural laws: ‘నేను మోనార్క్ ను.. నేను చేసిందే చట్టం.. గీసిందే గీత’ అన్నట్టుగా సాగిన దేశపు పెద్దమనిషి ప్రధాని మోడీ తొలిసారి వెనక్కి తగ్గాడు. పాకిస్తాన్ పై సర్జికల్ స్ట్రైక్ విషయంలో కానీ.. చైనాతో ఢీ అంటే ఢీ అనడంలో కానీ.. కశ్మీర్ ను వేరుచేసే ఆర్టికల్ 370 డీ రద్దు విషయంలో.. సీఐఐ చట్టం విషయంలో ఎన్ని ఆందోళనలు జరిగినా.. విమర్శలు వచ్చినా.. దేశం మొత్తం అల్లకల్లోలం అయినా ‘తగ్గేదే లే’ అన్నట్టుగా మోడీ వ్యవహరించారు.

Also Read: చరిత్రలో తొలిసారి.. మోడీ ‘సారీ’.. వైరల్

narendra-modi-farmer-1

తాను పట్టుకున్న కుందేలుకు మూడే కాళ్లు.. తాను మునిగిందే గంగ అన్నట్టుగా మోడీ వ్యవహారశైలి సాగిందన్న విమర్శలు ఉన్నాయి. కానీ ఫస్ట్ టైం మోడీ వెనక్కి తగ్గాడు.బీజేపీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్టు సంచలన ప్రకటన చేశారు.

సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని సరిహద్దుల్లో రైతులు కొనసాగిస్తున్న ఉద్యమానికి ఏడాది పూర్తవుతున్న వేళ కేంద్రం తీసుకున్న ఈ సంచలన నిర్ణయం హాట్ టాపిక్ గా మారింది. రైతుల ఆందోళనతో మోడీ ప్రభుత్వం దిగివచ్చినట్టైంది. మూడు సాగు చట్టాలను రద్దు చేసేందుకు నిర్ణయించింది. ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్రమోడీ శుక్రవారం కీలక ప్రకటన చేశారు.

జాతిని ఉద్దేశించి ప్రసంగించిన మోడీ బీజేపీ సర్కార్ తెచ్చిన కొత్త సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా దేశ రైతులందరికీ క్షమాపణ చెబుతున్నానని ప్రధాని తెలిపారు. ‘మా ప్రభుత్వం ఏం చేసినా రైతుల కోసమేనని.. అది దేశం కోసమే.. మూడు సాగు చట్టాలను కూడా రైతుల ప్రయోజనాల కోసమే తీసుకొస్తున్నాం.. ముఖ్యంగా సన్నకారు రైతులకు ఈ చట్టాలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా రైతులకు సర్ది చెప్పలేకపోయాం. అందుకే మూడు సాగు చట్టాలను రద్దు చేయాలని నిర్ణయించాం. సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులందరూ ఉద్యమాన్ని విరమించి.. తిరిగి తమ ఇళ్లకు వెళ్లాలని కోరుతున్నా.. రైతులను ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించాలి’ అని మోడీ వెల్లడించారు.

చరిత్రలో తొలిసారి మోడీ తీసుకున్న ఒక గొప్ప నిర్ణయాన్ని ఆయనకు ఆయనే వెనక్కి తీసుకొని రద్దు చేయడం సంచలనమే మరి. ఎంత గాయి చేసినా వెనక్కి తగ్గని మోడీ.. రైతుల విషయంలో మాత్రం కాంప్రమైజ్ అయ్యారు. ప్రధానంగా వచ్చే యూపీ ఎన్నికలతోపాటు ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఉండడంతోనే మోడీ ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకున్నట్టు తెలుస్తోంది. దీన్ని బట్టి మోతం పంతం ఓడింది.. రైతులే గెలిచారని చెప్పొచ్చు..

Also Read: వ్యవసాయ చట్టాల రద్దు వెనుక ఇంత స్టోరీ ఉందా..?