Rewind 2025: మరి కొద్ది రోజుల్లో 2025 సంవత్సరం కాలగర్భంలో కలిసిపోనుంది. ఈ నేపథ్యంలో గతించిన ఏడాదిని గుర్తుపెట్టుకుని.. వచ్చే ఏడాదిలో ఏం చేయాలో చాలామంది లక్ష్యాలుగా పెట్టుకుంటారు. ఆ లక్ష్యాలకు తగ్గట్టుగా అడుగులు వేస్తుంటారు. ఈ జాబితాలో పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు కూడా ఉంటారు . ఈ జాబితాలో ఈ మహిళలు కూడా ఉన్నారు. ఇంతకీ ఈ ఏడాది వీరేం చేశారు? వచ్చే ఏడాది ఏం చేయబోతారు? ఈ కథనంలో తెలుసుకుందాం
మనదేశంలో ప్రస్తుతం స్టార్టప్ రంగం దూసుకుపోతోంది. ఇందులో పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు ఉన్నారు. 2025 సంవత్సరం ఈ రంగం పెద్ద పెద్ద వ్యాపారవేత్తలకు పెద్దగా కలిసి రాలేదని చెప్పాలి. అయితే అందులో ఒక ఐదుగురు మహిళలు మాత్రం దుమ్మురేపారు. పెద్ద పెద్ద వ్యాపారవేత్తలకు సాధ్యం కాని ఘనతలను సైతం వీరు సొంతం చేసుకున్నారు.
ఫల్గుని నాయర్
నైకా వ్యవస్థాపకురాలిగా ఈమె భారతీయ కార్పొరేట్ ప్రపంచానికి పరిచయమే. మహిళల సౌందర్య సాధనాల ఉత్పత్తిలో నాయర్ తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఈమె 38, 663 కోట్ల సంపద కలిగి ఉన్నారు. తద్వారా స్వయంకృషి ద్వారా ఎదిగిన అత్యంత రిచెస్ట్ ఉమెన్ గా ఈమె పేరు గడించారు. 2025 -26 ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో తన సంస్థ నైకా నికర లాభాన్ని 154 శాతానికి పెంచుకున్నారు. అదే కాదు 33 కోట్ల లాభాలను ఆర్జించారు. ప్రస్తుతం నైకా సంస్థ దేశ వ్యాప్తంగా 20050 పైగా ఆఫ్లైన్ స్టోర్లను నిర్వహిస్తోంది. అంతేకాదు 13 బిలియన్ డాలర్ల విలువతో భారతదేశం లోనే మొట్టమొదటి మహిళా నేతృత్వంలోని యూని కార్న్ గా చరిత్ర సృష్టించింది.
గజల్ అలగ్
మహిళల సహజ సౌందర్య ఉత్పత్తుల్లో మామా యోర్త్ సంస్థకు విశిష్టమైన గుర్తింపు ఉంది. ఈ సంస్థను గజల్ ఉన్నత స్థానానికి తీసుకెళ్లారు. ఈమె ఏంజెల్ ఇన్వెస్టర్ గా కొనసాగుతున్నారు. రసాయనాలు లేకుండా మహిళల సౌందర్య ఉత్పత్తులను ఈ సంస్థ రూపొందిస్తోంది. 2025 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రయంసికంలో 13% వృద్ధిరేటును ఈ సంస్థ నమోదు చేసింది. 533 కోట్ల నికర ఆదాయాన్ని నమోదు చేసింది. ఈ కంపెనీ ప్రస్తుత విలువ 1.84 బిలియన్ డాలర్లు.
రుచి కల్రా
ఆక్సిజో సహా వ్యవస్థాపకురాలిగా రుచి కొనసాగుతున్నారు. ఆఫ్ బిజినెస్ రంగంలో కూడా ఈమె అందవేసిన చేయి. రెండు యూని కార్న్ లను నడిపిస్తున్నారు రుచి. ఈమె ఆధ్వర్యంలో రెండు కంపెనీల సమిష్టి విలువ ఐదు బిలియన్ డాలర్ల పై మాటే. ఈ సంస్థ దేశంలోని 15 లక్షల చిన్న, మధ్యతరః పరిశ్రమలకు రుణాలు అందిస్తోంది. సరఫరా సేవలు కూడా నిర్వహిస్తోంది. ఒకప్పుడు కేవలం రెండు శాతం మాత్రమే ఉన్న మహిళల స్టార్టప్ ల నిద్ర సమీకరణ ఉండగా.. ఇప్పుడు ఆ అంతరం ఈమె ద్వారా పూర్తిగా తగ్గిపోయింది.
రీచాకర్
మనదేశంలో మహిళల లోదుస్తుల తయారీలో పెద్దపెద్ద కంపెనీలు ఎప్పటినుంచో ఉన్నాయి. ఇందులో రీచా ఆధ్వర్యంలో జీవామే అనే సంస్థ పురుడు పోసుకుంది. 2011లో ఈ సంస్థ ప్రారంభమైంది. 2025 నాటికి 50 పైగా ఆఫ్ లైన్ స్టోర్ లతో ఈ సంస్థ ఎరిగింది. ఏకంగా 800 కోట్ల ఆదాయాన్ని ఆర్జించే స్థాయికి ఎదిగింది.
వినీత సింగ్
భారతీయ మహిళలు తాము ఉపయోగించే కాస్మోటిక్స్ పరికరాలలో ఎక్కువగా రసాయనాలు ఉంటాయి. దానికి చరమగీతం పాడారు వినీత సింగ్. భారతీయ మహిళలు ఉపయోగించే సౌందర్య ఉత్పత్తుల్లో షుగర్ జోడించి ఉత్పత్తులను తయారు చేయడం మొదలుపెట్టారు. అంతేకాదు సిరీస్ డి ఫండింగ్ ద్వారా ఈమె తన కంపెనీ విలువను 1640 కోట్లకు పెంచుకున్నారు. షార్క్ ట్యాంక్ జడ్జిగా ఆమె ఎంతోమంది మహిళల పారిశ్రామికవేత్తల ఆలోచనలను పూర్తిగా మార్చేశారు..