Homeజాతీయ వార్తలు75th Constitution Day 2024: రాజ్యాంగ పీఠికను సవరించవచ్చు.. సెక్యులర్, సోషలిస్ట్‌ పదాల తొలగింపు అధికారం...

75th Constitution Day 2024: రాజ్యాంగ పీఠికను సవరించవచ్చు.. సెక్యులర్, సోషలిస్ట్‌ పదాల తొలగింపు అధికారం పార్లమెంటుదే!

75th Constitution Day 2024: భారత రాజ్యాంగాన్ని బీజేపీ నేతృత్వంలోని కేంద్రం మార్చాలని చూస్తోందని కొన్ని రోజులుగా విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో దీనిని విస్తృతంగా ప్రచారం.. మళ్లీ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం మారడం ఖాయం అని ఆరోపించాయి. అందుకే 390 సీట్లు అడుగుతున్నాయని ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. కానీ, ప్రజలు బీజేపీకే పట్టం కట్టారు. అయితే పూర్తి మెజారిటీ ఇవ్వలేదు. ఇదిలా ఉంటే.. భారత రాజ్యాంగంలోని లౌకికవాదం, సామ్యవాదం తొలగించాలని దాఖలైన పిటిషన్‌పై సుప్రీం ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది. ఈ పదాలు బాగా లేవని అభిప్రాయపడింది. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగంలో సెక్యులర్‌(లౌకికవాదం), సోషలిస్ట్‌(సామ్యవాదం) పదాలు తొలగించాలని దాఖలుచేసిన పిటిషన్లను సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ సంజయ్‌కుమార్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం తాజాగా చారిత్రక తీర్పు వెల్లడించింది. ఈ క్రమంలోనే బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి, బలరాం సింగ్, అశ్వినికుమార్‌ ఉపాధ్యాయ్‌ దాఖలు చేసిన పిటిషన్లను కొట్టేసింది.

సుప్రీం కోర్టులో పిటిషన్లు..
రాజ్యాంగ పీఠికలో సెక్యులర్, సోషలిస్ట్‌ అనే పాదాలను 1976లో చేసిన 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. అప్పగి ప్రధాని ఇందిరాగాంధీ వీటిని చేర్చారు. అయితే ఈ పదాలను సవాల్‌ చేస్తూ తాజాగా సుబ్రహ్మణ్యస్వామి, బలరాం సింగ్, అశ్వినీకుమార్‌ ఉపాధ్యాయ్‌ సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేశారు. ఆ రెండు పదాలను రాజ్యాంగం నుంచి తొలగించాలని కోరారు. అంతేకాదు 42వ రాజ్యాంగ సవరణపై అప్పటి పార్లమెంట్‌లో చర్చ జరగలేదని వాదించారు. 1975 నుంచి 1977 వరకు దేశంలో ఎమర్జెన్సీ ఉందని, ఈ సమయంలో చేసిన సవరణకు చట్టబద్ధత ఉండదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ పిటిషన్లపై వివిధ పక్షాల వాదనలు విన్న సుప్రీం కోర్టు.. నవంబర 22న తీర్పు రిజర్వు చేసింది. తాజాగా వాటిని కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది.

కీలక వ్యాఖ్యలు..
ఇక తీర్పు సందర్భంగా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సోషలిస్ట్, సెక్యూలర్‌ అనే పాదాలకు పలు సవరణలు ఉన్నాయని పేర్కొంది. వాటిని వేర్వేరుగా అన్వయించుకుని గత విచారణ సమయంలోనే సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. సోషలిజం అర్థం అందరికీ సమానమైన అవకాశాలు ఉండాలని అని తెలిపింది. సమానత్వాన్ని ప్రతిభింబిస్తుందని పేర్కొంది. ఇక సెక్యూలర్‌ అనే పదం కూడా అంతే అని తెలిపింది. భారత రాజ్యాంగ మౌలిక స్వరూపం సెక్యూలరిజమని, ఇది రాజ్యాంగంలో అంతర్భాగమని వెల్లడించింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular