Andhra Pradesh: పేదలపైనే రుణం.. ఓటీఎస్ తో భారం

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో కూరుకుపోతోంది. దీంతో ప్రభుత్వ నిర్వహణపై సీఎం జగన్ కార్యాచరణ రూపొందించుకున్నారు. ఆదాయ మార్గాలపై అన్వేషణ ప్రారంభించారు. దీనికి గాను వన్ టైం సెటిల్మెంట్ (ఓటీఎస్) పథకాన్ని ఉపయోగించుకోవాలని భావించారు. ఇదే అదనుగా ఇళ్ల లబ్ధిదారుల నుంచి రూ. 10 వేలు, రూ.20 వేలు వసూలు చేయాలని లక్ష్యం నిర్దేశించుకున్నారు. ఈ నేపథ్యంలో డబ్బుల వసూలుకు టార్గెట్ కూడా పెట్టారు. దీంతో నిరుపేదలైన లబ్ధిదారులు వాటిని కట్టేందుకు నానా తిప్పలు పడాల్సి వస్తోంది. […]

Written By: Srinivas, Updated On : December 4, 2021 3:50 pm
Follow us on

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో కూరుకుపోతోంది. దీంతో ప్రభుత్వ నిర్వహణపై సీఎం జగన్ కార్యాచరణ రూపొందించుకున్నారు. ఆదాయ మార్గాలపై అన్వేషణ ప్రారంభించారు. దీనికి గాను వన్ టైం సెటిల్మెంట్ (ఓటీఎస్) పథకాన్ని ఉపయోగించుకోవాలని భావించారు. ఇదే అదనుగా ఇళ్ల లబ్ధిదారుల నుంచి రూ. 10 వేలు, రూ.20 వేలు వసూలు చేయాలని లక్ష్యం నిర్దేశించుకున్నారు. ఈ నేపథ్యంలో డబ్బుల వసూలుకు టార్గెట్ కూడా పెట్టారు.

Andhra Pradesh CM Jagan

దీంతో నిరుపేదలైన లబ్ధిదారులు వాటిని కట్టేందుకు నానా తిప్పలు పడాల్సి వస్తోంది. ప్రతిపక్షాలు సైతం గొంతెత్తి మొత్తుకుంటున్నా అధికారులు మాత్రం తమ పని సులువుగా కానిచ్చేందుకు సిద్ధమవుతున్నారు. దీనికి అధికారులు, వాలంటీర్లు రంగంలోకి దిగిపోయారు. లబ్ధిదారులను నానా తిప్పలు పెట్టేందుకు తయారయ్యారు.

Also Read: అప్పుల కుప్పలో పీఆర్సీ అమలయ్యేనా..?
లబ్ధిదారుల నుంచి డబ్బులు లాగేసుకునేందుకు ప్రైవేటు వ్యాపారులు, స్వశక్తి సంఘాల దగ్గర అప్పులు ఇప్పించి మరీ వారి బాకీలు తీర్చుకుంటున్నారు. దీంతో ప్రజలు అప్పుల పాలవుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఓటీఎస్ పథకంలో భాగంగా అందినంత దోచుకోవడానికే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అధికారులకు మౌఖిక ఆదేశాలు వెళ్లడంతో వారు తమ లక్ష్యం చేరేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తోంది.

కింది స్థాయి నుంచి పై వరకు వివిధ హోదాల్లో ఉన్న అధికారుల్ని ఇందులో నిమగ్నం చేశారు. దీంతో వారు తమ టార్గెట్ చేరుకోవాలని లబ్ధిదారులను రోజు వేధించడం ప్రారంభించారు. ప్రభుత్వం తమ ఖజానా పెంచుకోవాలని చూస్తుందే కానీ భవిష్యత్ పరిణామాలపై దృష్టి సారించడం లేదు. రాబోయే ఎన్నికల్లో అధికార పార్టీకి తిప్పలు తప్పవేమోననే అనుమానాలు అందరిలో వస్తున్నాయి. కానీ 2024 ఎన్నికల్లో అధికారం అందదేమో అనే సంశయం పలువురిలో నెలకొంటోం

Also Read: జగన్ చేసిన పనికి అందరూ ఫిదా అయిపోయారట.. ఇంతకీ ఏం చేశారు?

Tags