https://oktelugu.com/

పాత రేషన్‌ విధానమే బెటర్‌‌ అంట

లబ్ధిదారులు రేషన్‌ షాపుల వద్ద క్యూలో నిలబడి ఇబ్బందులు పడొద్దనే లక్ష్యంతో ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఇంటి వద్దకే రేషన్‌ అందించాలని సంకల్పించారు. ఇందుకు వేల సంఖ్యలో వాహనాలు కొనుగోలు చేశారు. ఒకనెల పంపిణీ చేశారు. కానీ.. ఎందుకో జగన్‌ లక్ష్యం గురి తప్పినట్లుగా కనిపిస్తోంది. మొదటికే మోసం వస్తుండడం.. లబ్ధిదారుల్లో తీవ్ర ఆగ్రహం కనిపిస్తుండడంతో వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఈ పద్ధతి వద్దని.. పాత విధానమే తీసుకురావాలని కోరుతున్నారట. Also Read: ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 11, 2021 2:00 pm
    Follow us on

    Old Ration Card
    లబ్ధిదారులు రేషన్‌ షాపుల వద్ద క్యూలో నిలబడి ఇబ్బందులు పడొద్దనే లక్ష్యంతో ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఇంటి వద్దకే రేషన్‌ అందించాలని సంకల్పించారు. ఇందుకు వేల సంఖ్యలో వాహనాలు కొనుగోలు చేశారు. ఒకనెల పంపిణీ చేశారు. కానీ.. ఎందుకో జగన్‌ లక్ష్యం గురి తప్పినట్లుగా కనిపిస్తోంది. మొదటికే మోసం వస్తుండడం.. లబ్ధిదారుల్లో తీవ్ర ఆగ్రహం కనిపిస్తుండడంతో వైసీపీ ఎమ్మెల్యేలు కూడా ఈ పద్ధతి వద్దని.. పాత విధానమే తీసుకురావాలని కోరుతున్నారట.

    Also Read: ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీనే..!

    వైసీపీలో ఉన్న భిన్నమైన పరిస్థితుల్లో నోరు తెరిచేవారు తక్కువ. అలా తెరవగలిగే స్వేచ్చ ఉన్న వారు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి వాహనాల ద్వారా రేషన్ బియ్యం సరఫరా నిలిపివేయాలి.. పాత పద్ధతిలోనే రేషన్ పంపిణీ చేయాలని మీడియా ముందు నేరుగా డిమాండ్ చేశారు. ఇది సీఎం దగ్గరకు చేరింది. నేరుగా చెప్పడానికి సీఎం అపాయింట్‌మెంట్ ఇచ్చేది తక్కువ. కానీ.. మంత్రాలయం ఎమ్మెల్యే సమస్య మాత్రమే కాదు.. దాదాపుగా ప్రతి ఎమ్మెల్యే ఇదే అభిప్రాయంతో ఉన్నారు.

    మరోవైపు.. లబ్ధిదారుల నుంచి ఎమ్మెల్యేలపై ఒత్తిడి వస్తోంది. గతంలో కార్డుదారులు.. తమకు అవకాశం ఉన్నప్పుడు రేషన్ దుకాణానికి వెళ్లి తెచ్చుకునేవారు. ఇప్పుడు వాహనం కోసం ఎదురుచూడాల్సిన దుస్థితి వచ్చింది. అదీ కూడా ఇంటి దగ్గరకు రావడం లేదు. రేషన్ పంపిణీలో ప్రతీ పని కష్టంగానే మారుతోంది. ఈ పోస్ యంత్రానికి నెట్‌వర్క్ అందకపోతే చుక్కలు కనిపిస్తున్నాయి. ఈ పరిణామాలతో లబ్ధిదారులకు ఇక్కట్లు ప్రారంభమయ్యాయి.

    Also Read: జనసేనకు మద్దతుగా ‘చిరు’ ఉక్కు వ్యూహం?

    ఇంత చేసినా.. ఈ పథకం మొత్తంలో భాగస్వాములైన ఎవరైనా సంతోషంగా ఉన్నారా అంటే ఎవరూ లేరు. అటు రేషన్ డీలర్లు అసంతృప్తిలో ఉన్నారు. తమ ఉపాధిని దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డెలివరీ చేయడానికి వాహనాలు పొందిన వారు మరింత కష్టాల్లో పడ్డారు. ఆ చాకిరీ చేయలేమని వాహనాలు అప్పగిస్తున్నారు. ప్రస్తుతం ఈ వాహనాల్లో ఉన్న సమస్యలను చూస్తే పరిష్కరించలేనివిగా ఉన్నాయని.. పాత విధానమే అమలు చేయడం మంచిదన్న అభిప్రాయం వైసీపీలోనే ఎక్కువగా వినిపిస్తోంది.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్