ప్రైవేటు ఆస్పత్రుల్లో వ్యాక్సిన్ కొత్త ధరలివే

దేశంలో ఉత్పత్తి అయ్యే 75శాతం వ్యాక్సిన్లను కేంద్రమే కొని రాష్ట్రాలకు పంచుతుందని ప్రధాని మోడీ నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ టీకాలకు రూ.150కి మించి సర్వీస్ చార్జి వేయవద్దని ఆదేశాలు జారీ చేశారు. దీంతో తాజాగా కేంద్రప్రభుత్వం జీవో జారీ చేసింది. ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా వ్యాక్సిన్ల ధరలను కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. తాజా ధరల ప్రకారమే ప్రైవేటు ఆస్పత్రుల్లో టీకాలు వేయాలని ఆదేశించింది. సీరం తయారు చేసిన ‘కోవీషీల్డ్’ టీకా వ్యాక్సిన్ ధర […]

Written By: NARESH, Updated On : June 8, 2021 10:30 pm
Follow us on

దేశంలో ఉత్పత్తి అయ్యే 75శాతం వ్యాక్సిన్లను కేంద్రమే కొని రాష్ట్రాలకు పంచుతుందని ప్రధాని మోడీ నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ టీకాలకు రూ.150కి మించి సర్వీస్ చార్జి వేయవద్దని ఆదేశాలు జారీ చేశారు.

దీంతో తాజాగా కేంద్రప్రభుత్వం జీవో జారీ చేసింది. ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా వ్యాక్సిన్ల ధరలను కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. తాజా ధరల ప్రకారమే ప్రైవేటు ఆస్పత్రుల్లో టీకాలు వేయాలని ఆదేశించింది.

సీరం తయారు చేసిన ‘కోవీషీల్డ్’ టీకా వ్యాక్సిన్ ధర గరిష్టంగా రూ.780కి వేయాలని కేంద్రప్రభుత్వం ధరను నిర్ణయించింది. ఇక భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ టీకా 1410కు వేయాలని సూచించింది. ఇక రష్యాకు చెందిన స్పుత్నిక్ వి టీకాను రూ.1145కు వేయాలని సూచించింది. అన్ని పన్నులతోపాటు ప్రైవేటు ఆస్పత్రులకు రూ.150 సర్వీస్ చార్జి కూడా ఇందులో భాగమేనని కేంద్రం స్పష్టం చేసింది.ఇందులో జీఎస్టీని కూడా వేయడం విశేషం. జీఎస్టీని మినహాయించుకునే అవకాశం ఉన్నా కేంద్రం అలా చేయకపోవడం గమనార్హం.

ఇక దేశవ్యాప్తంగా కేంద్రప్రభుత్వమే 18 ఏళ్లు నిండిన అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ వేస్తామని ప్రకటించింది. ఉచితంగా వద్దనుకునేవారు ప్రైవేటు ఆస్పత్రుల్లో వేసుకోవచ్చు. 25శాతం వ్యాక్సిన్లను ప్రైవేటుకు అమ్ముకోవడానికి ప్రధాని మోడీ అవకాశం ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ప్రైవేటు ఆస్పత్రుల్లో ధరలను మోడీ సర్కార్ ఖరారు చేసింది.