New Parliament Building Inauguration
New Parliament Building Inauguration: పార్లమెంట్ ప్రారంభోత్సవానికి మేము వెళ్ళము అంటూ ప్రతిపక్షాలు నానా యాగీ చేస్తున్నాయి. అంతేకాదు ఆ రాజ దండాన్ని ఇప్పుడు ప్రతిష్టించాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నిస్తున్నాయి. మోదీ మరుగున పడిన విషయాలను తవ్వుతున్నారని, నెహ్రూను కావాలని దూషిస్తున్నారని ఆరోపిస్తున్నాయి. సరే ఈ దేశంలో ప్రతిపక్షాలకు మోదీ వ్యతిరేక స్టాండ్ ఏమిటో తెలియదు. ఒకవేళ ఎవరైనా చెప్పినా వినిపించుకోరు. సరే అని అలా వదిలేస్తే..ఈ రాజదండానికి చాలా ప్రాముఖ్యత ఉన్నది. ఇంతకీ దాని ప్రాశస్త్యం ఏమిటో మీరూ చదవండి.
ఆ రోజుల్లో భారతదేశానికి చివరి వైస్రాయ్ అయిన లార్డ్ మౌంట్ బాటన్ పై భారతీయులకు అధికారాన్ని అప్పగించేందుకు పూర్తి చేయాల్సిన బాధ్యత పడింది. అప్పుడే అతనికి ఒక మామూలు ప్రశ్న వచ్చింది. అధికారాన్ని అప్పగించడం అనే తంతు ఎలా నిర్వహించాలి? వట్టి కరచాలనం చేయడం సరిపోదు? మరి అవలంబించవలసిన తంతు లేదా పద్ధతి ఏమిటి? ఆయన ఈ ప్రశ్నలను పండిట్ జవహర్ లాల్ నెహ్రూకు సంధించారు. ఈ ప్రశ్నలు విన్న నెహ్రూ కూడా.. ఇవి ఆలోచించాల్సిన విషయాలు అంటూ ఆయనకు సెలవిచ్చారు. అయితే ఈ విషయంలో నెహ్రూ అయోమయంలో పడ్డారు. అప్పుడు ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు భక్తుల రాజగోపాలచారని సంప్రదించారు. దీంతో ఆయన తీవ్రంగా మదనం చేశారు. భారతదేశంలోని అత్యంత పురాతనమైన తమిళనాడులోని చోళ రాజ్యంలో ఒక రాజు నుంచి మరొక రాజుకు అధికార మార్పిడి జరుగుతున్నప్పుడు ఒక తంతు నిర్వహించేవారు. చోళులు అమితంగా ఆరాధించే శివుడి దీవెనలు కోరుతూ ఆనాటి ప్రధాన పూజారి ఆశీర్వచనాలు అందుకునేవారు. వెయ్యి సంవత్సరాలకు పైగా ఉన్న పురాతన దేవాలయాల్లో ఆ పద్ధతి నేటికి కూడా కొనసాగుతోంది. అదే విధానాన్ని సిఫారసు చేస్తే దానికి నెహ్రూ అంగీకరించారు.
ఏమిటా తంతు
ఒక పొడవైన రాజదండం.. దానిని ఇంగ్లీషులో సింగల్ అంటారు. దానిని ఒక శుభ ముహూర్తంలో కొత్త రాజు లేదా పాలకుడికి రాజ గురువు అందజేయడం. ఈ ప్రకారం 1947లో అధికార మార్పిడికి ఇదే విధానాన్ని అనుసరించినట్టు తెలుస్తోంది. ఐదు శతాబ్దాల క్రితం తిరువ వడోత్తురై ధార్మిక మఠంలో అప్పటి 21 గురువు మహా సన్నిధానం శ్రీల శ్రీ వినయానికి ఈ రాజ దండాన్ని తయారుచేసే బాధ్యతను రాజా గోపాల చారి అప్పగించారు. ఆ స్వామీజీ మద్రాసులోని ప్రసిద్ధ స్వర్ణకారులైన బొమ్మిడి వంశస్తులకు బంగారంతో రాజదండం తయారు చేసే పనిని అప్పగించారు. ఆ రాజు దండం పొడవటి గొట్టం లాగా గుండ్రంగా ఉంటుంది. దానిపై భాగంలో బలం, సత్యం, ధర్మానికి ప్రతీకైనా ఒక నంది బొమ్మ ఉంటుంది. నేటికీ జీవించి ఉన్న 96 ఏళ్ల బొమ్మిడి యతి రాజులు ఈ క్రతువు జరిగింది అనడానికి ఒక సజీవ సాక్ష్యం.
ఆగస్టు 14 1947 రాత్రి ప్రత్యేక విమానంలో ఈ ప్రతినిధి బృందాన్ని, నాదస్వర విద్వాన్ రాజారత్నాన్ని రాజదండం అప్పగించే కార్యక్రమానికి తీసుకెళ్లారు. బంగారంతో తయారుచేసిన రాజదండాన్ని పవిత్ర జలాలతో శుద్ధి చేశారు. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఆ ఊరేగింపులో తమిళ సెయింట్ తిరానా సంబందర్ స్వరపరచిన తేవరంలోని కొల్లారపడిగం కీర్తనల నుంచి ఓడువర్ పద్యాలను పాడారు. “అడియార్గల్ వాణిల్, అరసల్వార్, అనై నమదే” అనే వాక్యాలు రాజ దండంపై చెక్కించారు. “భగవంతుడి అనుచరుడైన రాజు స్వర్గంలో ఉన్నట్టుగా పరిపాలించాలని మా ఆజ్ఞ” అని వాక్యాలకు అర్థం. వెయ్యి సంవత్సరాల నుంచి దక్షిణం, ఉత్తరం అద్భుతమైన ఏకీకరణలో దేశం ఒకటిగా ఆవిర్భవించినందుకు గుర్తుగా నెహ్రూ రాజేంద్రప్రసాద్ సమక్షంలో ఈ రాజదండాన్ని మౌంట్ బాటెన్ నుంచి స్వీకరించారు. మతానికి చెందిన స్వామీజీ నెహ్రూకు పట్టువస్త్రం కప్పి ఈ బంగారు రాజ దండాన్ని అందజేశారు. ఈ విధంగా అధికారం 1947లో దేశ జెండా ఎగరవేయకముందే ఒక హిందూ రాజుకు బదిలీ అయింది. అతడిని ఒక హిందూ రాజు లాగా పాలించమని ఆదేశం కూడా జారీ అయింది. ఈ విధంగా ఈ దేశాన్ని పాలించే అధికార మార్పిడి ఇక్కడ ప్రాచీన నాగరికత పద్ధతి ప్రకారం ఒక చిహ్నంతో జరిగింది.
ఈ కార్యక్రమం తరువాతే నెహ్రూ ఆగస్టు 14 1947 అర్ధరాత్రి సమయంలో తన ప్రసిద్ధ ప్రసంగాన్ని చేశారు. రాజేంద్రప్రసాద్ తర్వాత రోజుల్లో భారతదేశానికి మొదటి రాష్ట్రపతి అయ్యారు. సంఘటన స్థానిక, అంతర్జాతీయ మీడియాలో ప్రచురితమైంది. ఆగస్టు 25 1947 టైం మ్యాగజైన్ ఈ నివేదికను కూడా తాటికాయంత అక్షరాలతో ప్రచురించింది. అంటే పూర్తి ప్రాచీన హిందూ సాంప్రదాయం ప్రకారమే భారత దేశ పాలన ఇక్కడ పాలకులకు అందింది. అయితే తర్వాత కాలంలో ఈ బంగారు రాజు దండం మాయమైపోయింది. అధికార మార్పిడికి ఆ పరంపర కొనసాగలేదు. ఈ పద్ధతి నచ్చని కొందరు పాలకులు ఆ రాజ దండాన్ని మరుగున పడేశారు. అనంతరం ఆ రాజదండాన్ని నెహ్రూ నడకలో ఉపయోగించే వాకింగ్ స్టిక్ గా పేరు మార్చి అలహాబాద్ మ్యూజియంలో భద్రపరిచారు. 75 సంవత్సరాల తర్వాత కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా ఈ రాజదండానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పూర్వ వైభవం తీసుకొస్తున్నారు.
ఈనెల 28న అంటే ఆదివారం ప్రధానమంత్రి నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించబోతున్నారు. ఆరోజు తమిళనాడుకు చెందిన 20 మంది పండితుల సమక్షంలో తేవారం వచనంలోని శైవ సంకీర్తనల మధ్య తిరువడుతురై ఆధీనం మఠం అధిపతి ఈ 75 సంవత్సరాల బంగారు రాజదండాన్ని మే 28న ఉదయం 7. 20 నిమిషాల సమయంలో 20 నిమిషాల హోమం తర్వాత ప్రధాన మంత్రికి అందజేస్తారు. ఆ తర్వాత తమిళనాడు నుంచి మఠాధిపతులు, నలుగురు ఊడు వర్లు, ఒక మహిళతో సహా కొత్త భవనంలోకి లోక్సభ స్పీకర్ ఓమ్ బీర్లా తో కలిసి కాలినడకన వెళతారు. తిరువడుతురై ఆధీనం శ్రీల శ్రీ అంబాలవన దేశిక పరమాచార్య స్వామిగల్ తో సహ ప్రముఖులు, పఠాధిపతులు పార్లమెంట్ వెల్ లో నిలబడగా, స్పీకర్ కుడివైపున ప్రత్యేకంగా రూపొందించిన పీఠంపై ప్రధానమంత్రి ఈ రాజదండాన్ని ఏర్పాటు చేస్తారు. అంటే 1947 ఆగస్టు 14న రాత్రి ఎలా అధికారం మార్పిడి వేడుక నిర్వహించారో.. సరిగ్గా అలాంటి వేడుకనే ప్రధానమంత్రి నిర్వహిస్తూ గత వైభవాన్ని గుర్తుకు తెస్తున్నారు.