New Corona Variant On India: కరోనా మహమ్మారి సృష్టించిన ఉత్పాతం మామూలుది కాదు. దీంతో ఎందరో తమ ప్రాణాలు కోల్పోయారు. 2020 డిసెంబర్ లో ప్రపంచాన్ని వణికించేందుకు ఆవిర్భవించిన వైరస్ మానవాళిని ఎంతో భయానికి గురి చేసింది. అన్ని దేశాలు దాని ప్రభావానికి గురయ్యాయి. మొదటి నుంచి మూడు దశల వరకు మనుషులను ఆందోళనకు గురిచేసిన మహమ్మారిగా తన కసి తీర్చుకుంది. యువకులు, వృద్ధులు ఎవరిని కూడా వదలలేదు. ఈ దశలో ఒమిక్రాన్ వేరియంట్ కూడా ఎంతో మందిని భయపెట్టింది. ఇప్పుడు కరోనా రూపు మార్చుకుంది. నాలుగు దశలు దాటుకుని ఒమిక్రాన్ కు చేరుకున్నాక ఇక దాని ఊసే లేకుండా పోయిందని అనుకున్నారు.

కానీ ఇప్పుడు ఒమిక్రాన్ కొత్తగా బీఎఫ్ 7 వేరియంట్ గా ఆవిర్భవించింది. గుజరాత్ లో ఇద్దరు, ఒడిశాలో ఓ కేసు వెలుగు చూడటంతో ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది. దీంతో ప్రజలు భయపడుతున్నారు. కరోనా సెకండ్ వేవ్ కూడా ఇలా కొత్త ‘డెల్టా’ వైరస్ తోనే వచ్చింది. లక్షల మందిని ఆస్పత్రిపాలు చేసి మరణమృదంగం వాయించింది. దేశంలో భయానక వాతావరణాన్ని సృష్టించింది. కరోనా మహమ్మారి ప్రజలను ఇంకెంత కాలం ఆడుకుంటుందో తెలియడం లేదు. అందుకే ఇప్పుడు కూడా ఎంతటి ప్రమాదం సృష్టిస్తుందోననే బెంగ పట్టుకుంది. మళ్లీ కరోనా పడగ విప్పితే ప్రజలకు రక్షణ దారులే కనిపించడం లేదు. ఈ క్రమంలో కరోనా ప్రభావంతో ఇంకా ఎంత మందిని బలిగొంటుందోననే ఆందోళన వ్యక్తమవుతోంది.
మనం కరోనాకు టీకా తయారు చేసినా ఇప్పుడు అది తన రూపాన్ని మార్చుకుంటే కొత్త దారుల్లో వస్తుంటే ఎలా అని సంశయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికి కూడా చైనాలో కరోనా తగ్గలేదని వార్తలు వస్తున్నాయి. అక్కడ ప్రమాదకరమైన మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. కోవిడ్ ఆంక్షలు ఎత్తివేయాలని అక్కడి ప్రజలు చేస్తున్న ఆందోళనలకు అక్కడి ప్రభుత్వం దిగి వస్తోంది. మెల్లమెల్లగా అన్ని ప్రాంతాల్లో కరోనా ఆంక్షలు సడలించారు. ఎప్పటిలాగే జన సంచారం పెరుగుతోంది. ఫలితంగా కరోనా కేసులు కూడా ఎక్కువవుతున్నాయి.

దాని పర్యవసానంగానే ఒమిక్రాన్ వేరియంట్ బీఎఫ్ 7 పేరుతో కొత్త రూపాల్లో వస్తుంటే ప్రజలకు ఏం చేయాలో తెలియడం లేదు. కరోనా తీవ్ర వ్యాప్తికి కారణమైన ఈ వేరియంట్ దేశంలోకి ప్రవేశించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎయిర్ పోర్టుల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఒమిక్రాన్ వేరియంట్ మన దేశంలో విస్తరిస్తే ఎదురయ్యే ఇబ్బందులను ముందే గుర్తిస్తున్నారు. దీంతో ఈ కొత్త కరోనా వేరియంట్ విస్తరించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దేశంలో ఈ వైరస్ విస్తరించకుండా కేంద్రం రంగంలోకి దిగి అన్ని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. పలు సూచనలు చేసింది. ఒమిక్రాన్ కొత్త వైరస్ లక్షణాలను పేర్కొంది.
-ఒమిక్రాన్ బీఎఫ్-7 లక్షణాలు
ఇదివరకు వచ్చిన కరోనా లక్షణాలలాగానే ఈ కొత్త వేరియంట్ లక్షణాలుంటాయని నిపుణులు చెబుతున్నారు. జ్వరం, ముక్కు కారడం, వీపరీతంగా దగ్గు, గొంతునొప్పి, ఒళ్లు నొప్పులు అధికంగా ఉంటాయి. వికినిడి పోతుంది.. ఛాతిలో నొప్పి, వణుకు, వాసన గుర్తించలేకపోవడం వంటి దుష్పరిణామాలు కలుగుతాయి