Delhi assembly elections results 2025: 2013లో ఢిల్లీలో నిర్వహించిన ఎన్నికల్లో 66% పోలింగ్ నమోదయింది.. 2015 లో 67%, 2020లో 63%, 2025లో 60.4 శాతానికి పోలింగ్ పడిపోయింది.. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉన్న విషయం తెలిసిందే. ఇందులో 58 సీట్లను జనరల్ కేటగిరిగా ప్రకటించారు. మిగతా 12 సీట్లను రిజర్వ్ కేటగిరీలో చేర్చారు. ప్రస్తుతం ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిషి కొనసాగుతున్నారు. అరవింద్ కేజ్రీవాల్ పై మద్యం కుంభకోణానికి సంబంధించి ఆరోపణలు వినిపించడంతో.. ఆయన తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అతిషిని ముఖ్యమంత్రిగా నియమించారు.. 2014లో కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చినప్పటికీ.. ప్రస్తుతం కూడా కేంద్రంలో అధికారంలో కొనసాగుతున్నప్పటికీ.. ఢిల్లీని మాత్రం బిజెపి గెలవలేకపోయింది. 2013 తర్వాత మళ్లీ ఆ స్థాయిలో సీట్లను కూడా అందుకోలేకపోయింది.. 2013లో బిజెపికి 30 శాతానికి పైగా ఓట్లు లభించాయి. అంతేకాదు నా అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి 30 కి పైగా స్థానాలను గెలుచుకుంది. మళ్లీ ఆ స్థాయిలో జోరు చూపించలేకపోయింది. గతంలో కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీలో బలం ఉండేది. 2013లో ఆప్ కు మద్దతు ఇచ్చిన తర్వాత.. కాంగ్రెస్ గ్రాఫ్ క్రమేపి పడిపోవడం మొదలైంది. అయితే 2015 నుంచి జరిగిన ఎన్నికల్లో ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా సాధించలేకపోవడం.. ఆ పార్టీ బేలతనానికి నిదర్శనంగా కనిపిస్తోంది.
ఈ సీట్లపై ప్రధానంగా దృష్టి
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానంగా కొన్ని స్థానాలపై ప్రత్యేక దృష్టి ఉంది. కాంగ్రెస్ పార్టీ ఈసారి న్యూ ఢిల్లీ స్థానం నుంచి మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారుడు సందీప్ దీక్షిత్ ను పోటీలోకి దించింది. అరవింద్ కేజ్రివాల్ ఈ స్థానం నుంచి పోటీ పడుతున్నారు. 2013 ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ ఈ స్థానంలో పోటీ చేసి.. షీలా దీక్షిత్ ను ఓడించారు. అప్పటినుంచి ఆయన ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు.. ఇక ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రస్తుతం ఉన్న అతిషి పై మాజీ ఎంపీ రమేష్ బిదూరి పోటీలో ఉన్నారు.. కల్కాజి స్థానం నుంచి అతిషి, రమేష్ బిదూరి పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు ఆల్కలాంబ ఇక్కడ పోటీ చేస్తున్నారు.. మాజీ ఉప ముఖ్యమంత్రి మనిష్ సిసోడియా జంగ్ పూర నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నారు.. అయితే మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొన్న అరవింద్ కేజ్రీవాల్ గత ఏడాది చెప్పడంలో తన పదవికి రాజీనామా చేశారు. ఈ పదవిలో తనను తిరిగి ప్రజలు కూర్చమని అడిగే వరకు.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనని అరవింద్ స్పష్టం చేశారు. ఒకవేళ ఈ ఎన్నికల్లో గెలిస్తే అతని పార్టీ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది అరవింద్ ఇంతవరకు చెప్పలేదు.. ఇక ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరవింద్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ జైలుకు వెళ్లొచ్చారు. జైలు శిక్ష అనుభవిస్తున్న సమయంలో కేంద్ర ప్రభుత్వంపై, దర్యాప్తు సంస్థలపై అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. మద్యం విధానంలో ఎటువంటి అవకతవకలు జరిగినప్పటికీ.. అనవసరంగా తమను ఇబ్బంది పెడుతున్నారని వారు ఆరోపించారు.. ప్రస్తుత ఎన్నికల్లో ఆప్ విజయం సాధిస్తే.. ముఖ్యమంత్రిగా అరవింద్ పగ్గాలు చేపడతారని జాతీయ మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి.