Lok Sabha Elections 2024: దేశంలో 18వ లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. షెడ్యూల్‌లో భాగంగా చివరి విడత ఎన్నికలు శనివారం(జూన్ 1న) జరుగనున్నాయి. ఈమేరకు గురువారం సాయంత్రం ప్రచారానికి తెరపడింది. ఈ నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నాటి నుంచి మే 30 వరకు ఐటీ శాఖకు కాసుల వర్షం కురసింది. ఎన్నికల వేళ భారీగా బ్లాక మనీ బయట పడింది. ఈ క్రమంలో పక్కా సమాచారంతో ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు దేశ వ్యాప్తంగా నిర్వహించిన సోదాల్లో భారీగా నగదు, బంగారం కూడా సీజ్ చేశారు.
రూ.1,100 కోట్ల నగదు..
ఎన్నికల సందర్భంగా ఎలక్షన్ కోడ్‌లో భాగంగా దేశవ్యాప్తంగా దాయపు పన్ను శాఖ నిర్వహించిన సోదాల్లో సుమారు రూ.1,100 కోట్ల నగదు సీజ్ చేశారు. మే 30న ఆదాయపు పన్ను శాఖ మొత్తం రూ.1,100 కోట్ల నగదు, బంగారం కూడా పట్టుకుంది. 2019 ఎన్నికల నాటితో పోలిస్తే ఈసారి 182 శాతం అధికంగా పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. గత లోక్‌సభ ఎన్నికల వేళ రూ.390 కోట్ల నగదు సీజ్ చేశారు.
మారి 16 నుంచి..
ఈ ఏడాది మార్చి 16 నుంచి ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. నాటి నుంచి ఐటీశాఖ అన్ని రాష్ట్రాల్లో దాడులు, సోదాలు, తనిఖీలు చేసింది. ఓటర్లను ప్రభావితం చేసేందుకు వాడుతున్న డబ్బులు సీజ్ చేసింది. ఢిల్లీ, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల్లో భారీగా నగదు పట్టుకున్నారు. ఈ మూడు రాష్ట్రాల్లోనే వందల కోట్ల నగదు, భారీగా బంగారం సీజ్ చేశారు. తమిళనాడులో రూ.150 కోట్లు నగదు సీజ్ చేశారు. తెలంగాణ ఒడిశా, ఏపీ సహా పలు రాష్ట్రాల్లో కలిపి రూ.100 కోట్లు సీజ్ చేశారు.