Homeజాతీయ వార్తలుUttar Pradesh: మొరాదాబాద్‌ ఘటనపై మౌనం.. ఫెమినుస్టులారా.. ఎందుకీ పక్షపాతం!?

Uttar Pradesh: మొరాదాబాద్‌ ఘటనపై మౌనం.. ఫెమినుస్టులారా.. ఎందుకీ పక్షపాతం!?

Uttar Pradesh: మన దేశంలో ఫెమినిస్టులు చాలా ఎక్కువ. మహిళల హక్కులకు భంగం కిలిగినా, దాడులు జరిగినా, హక్కులకు భంగం కలిగినా రోడ్లపైకి వస్తారు. అయితే ఈ విషయంలోనూ వివక్ష చూపడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. పెమినిస్టులకు కులం, మతం ఉండకూడదు. కానీ, ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో ఓ మదరసాలో చోటుచేసుకున్న ఘటన దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. విద్య హక్కుల చట్టం, బాలల రక్షణ చట్టాలు ఉన్నప్పటికీ, ఒక 13 ఏళ్ల బాలికపై విధించబడిన అవమానకర నిబంధన సామాజిక చైతన్యానికి తలతిప్పే సంఘటనగా నిలిచింది. కానీ ఫెమినిస్టులు కనీసం నోరు మెదపడం లేదు.

మదరసా యాజమాన్యం చెత్త నిర్ణయం
మదరసాలో ఓ బాలిక 8వ తరగతి చదువుతోంది. వేసవి సెలవుల్లో ఆమె తన కుటుంబంతో కలిసి పర్యనకు వెళ్లింది. తర్వాత తండ్రి పాఠశాలకు తీసుకెళ్లాడు. 8వ తరగతి పీజు చెల్లించాడు. కానీ మదరసా నిర్వాహకులు బాలికను తిరిగి పాఠశాలకు చేర్చుకునే ముందు ‘వర్జినిటీ టెస్ట్‌ సర్టిఫికేట్‌’ సమర్పించాలని సూచించడం తీవ్ర దుమారానికి దారితీసింది. గ్రామీణ కుటుంబానికి చెందిన ఆ బాలిక తండ్రి చెల్లించాల్సిన ఫీజులు కూడా పూర్తిగా చెల్లించాడు. కానీ అడ్మిషన్‌ ఇన్‌చార్జ్‌ షాజహాన్‌ ఆ సర్టిఫికేట్‌ లేకుండా చేర్చుకోవడాన్ని నిరాకరించాడు. తండ్రి బతిమిలాడినా యాజమాన్యం మార్పు లేకుండా మొండి వైఖరిని ప్రదర్శించింది. చివరికి టీసీ కోసం రూ.500 వసూలు చేసి కూడా ఇవ్వకపోవడంతో విద్య మధ్యలో నిలిచిపోయింది. విసిగిపోయిన తండ్రి తన బాధను సోషల్‌ మీడియాలో పంచుకోగా, విషయం రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి వెళ్లింది.

ప్రభుత్వ సీరియస్‌ యాక్షన్‌..
ప్రభుత్వం వెంటనే స్పందించి షాజహాన్‌ను అరెస్ట్‌ చేసింది. యాజమాన్యంపై పోక్సో చట్టం కింద కేసు నమోదు అయింది. మహారాష్ట్ర మైనారిటీ కమిషన్‌ చైర్‌పర్సన్‌ దేశవ్యాప్తంగా మదరసాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయో తెలుసుకోవడానికి విచారణ కమిటీని నియమించారు. యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం కూడా రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు ప్రారంభించింది.

మౌనంగా ఫెమినుస్టులు..
దేశంలో ప్రతి చిన్న సంఘటనపైనా స్వరం వినిపించే ఫెమినిస్టు వర్గం ఈ ఘటనపై అసాధారణ నిశ్శబ్దాన్ని ప్రదర్శించింది. మహిళల హక్కులు, భద్రతలపై సాధారణంగా గళం విప్పే సంఘాలు ఈ ఘటనపై ఒక్క ప్రకటన కూడా చేయకపోవడం జనాభిప్రాయాన్ని కలవరపెట్టింది. ఫెమినిజం అనేది కేవలం రాజకీయ, సమాజంలో కొందరిని విమర్శించడానికేనా? లేక నిర్దోష బాలికల హక్కుల రక్షణకూ సమానంగా వర్తించదా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

మొరాదాబాద్‌ ఘటన మన సమాజానికి ఒక కఠిన పరీక్ష. బాధితురాలు ఒక చిన్నారి అయినప్పటికీ, పెద్దస్థాయి ప్రతిస్పందన లేకపోవడం మన న్యాయవ్యవస్థ, మానవతా బలం పట్ల ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఫెమినిస్టు ఉద్యమాలు భవిష్యత్తులో ఈ తరహా సంఘటనలపై తమ దృష్టి సారిస్తేనే స్త్రీ స్వాతంత్య్రానికి నిజమైన విలువ లభిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular