Nalgonda News: మూఢ నమ్మకాల జాడ్యం వీడటం లేదు. మూఢ విశ్వాసాలతో ప్రాణాలు తీస్తున్నారు. కష్టపడకుండా సంపాదించాలనే ఉద్దేశంతో గుప్త నిధుల కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. విలువైన సమయాన్ని వృథా చేస్తూ ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఓ మతి స్థిమితం లేని వ్యక్తిని హత్య చేసి తల, మొండం వెరు చేసి తలను మహంకాళి అమ్మవారి పాదాల వద్ద పడేయడం సంచలనం సృష్టిస్తోంది. డబ్బు సంపాదించాలనే యావలో ఎంతకైనా తెగిస్తున్నారు. ప్రాణాలనే పణంగా పెడుతున్నారు.

నల్గొండ జిల్లా చింతపల్లి మండలం విరాట్ నగర్ కాలనీ లో రహదారి పక్కనే ఉన్న మహంకాళి ఆలయం అమ్మవారి విగ్రహం ఉంది. సోమవారం అమ్మవారి పాదాల దగ్గర తల ఉండటంతో పూజారి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో డీఎస్పీ ఆనందరెడ్డి నేతృత్వంలో దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి తలను సామాజిక మాధ్యమాల్లో పెట్టి సమాచారం ఇవ్వాల్సిందిగా సూచించారు. హతుడు జహేందర్ నాయక్ గా గుర్తించారు. అతడిది సూర్యపేట జిల్లా పాలకవీడు మండలం శూన్యపహాడ్ గా తేల్చారు.
నరబలి కోసమే హత్య చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదివరకు ఇక్కడ ఇలాంటి ఘటనలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జహేందర్ నాయక్ కు మతిస్థిమితం లేకపోవడంతో కొన్నాళ్లుగా రంారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని తుర్కయాంజాల్ దగ్గరున్న ఓ ఆలయం వద్ద సంచరించేవాడు. దీంతో అతడిని నరబలి ఇచ్చేందుకే తీసుకెళ్లి చంపినట్లు తెలుస్తోంది.
Also Read: విశాఖపై బీజేపీ ఫోకస్.. తెరవెనుక రాజకీయం ఏంటి?
కేసును పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మిస్టరీని ఛేదించేందుకు ఎనిమిది బృందాలను ఏర్పాటు చేశారు. అసలు ఈ హత్య ఎందుకు చేశారు అనే కోణంలోనే ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఎక్కడో చంపి తలను వేరు చేసి దేవత వద్ద పడేయడాన్ని చూస్తుంటే ఇది ముమ్మాటికి గుప్త నిధుల కోసమే జరిగినట్లు అనుమానిస్తున్నారు.
జిల్లాలో చోటుచేసుకుంటున్న పరిణామాలతో అందరిలో భయాందోళనలు కలుగుతున్నాయి. నరహంతక ముఠా సంచరిస్తోందనే భయం అందరిలో వస్తోంది. విలువైన ప్రాణాలను తీసేస్తూ ప్రజల్లో ఆందోళన పెంచుతున్నారు. దీంతో జిల్లా అంతటా రెడ్ అలర్ట్ ప్రకటించారు. నిందితుల ఆనవాళ్లు లభిస్తే సమాచారం ఇవ్వాల్సిందిగా పోలీసులు కోరుతున్నారు.
Also Read: తెలంగాణలో మొదలైన ‘యాగం ఫీవర్’.. బీజేపీకి టీఆర్ఎస్ పోటీ?