H5N1 Bird flu : కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాత.. రకరకాల వ్యాధులు ప్రబలడం మొదలైంది.. కరోనా ఓమిక్రాన్, జికా వైరస్ లు ఇబ్బంది పెట్టాయి. వీటివల్ల చాలామంది ఇబ్బంది పడ్డారు. ప్రాణం నష్టం జరగకపోయినప్పటికీ.. చాలామంది అనారోగ్యానికి గురై ఆస్పత్రుల పాలయ్యారు. ఆర్థికంగానూ నష్టపోయారు. ఆ తర్వాత ఆ వైరస్ లు తగ్గుముఖం పట్టాయి. అయితే ఇప్పుడు ప్రపంచానికి మరో విపత్తు పొంచి ఉందట. ఇదే విషయాన్ని అమెరికన్ శాస్త్రవేత్తలు వెల్లడించారు.. అమెరికాలో జంతువులు, పక్షుల్లో H5N1 బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాపించే అవకాశం ఉందని వివరిస్తున్నారు.. మ్యూటేన్ అనంతరం ఈ వ్యాధి విస్తృతంగా వ్యాపిస్తుందట. ఆ తర్వాత అది ప్రాణాంతకంగా మారుతుందట. ఇది సోకిన వారిలో సుమారు 50 శాతం మంది చనిపోతారట. అందువల్ల అప్రమత్తంగా ఉండాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఇవి పత్తు నివారణకు జంతువుల్లో సోకే ఇన్ ఫెక్షన్ లను జాగ్రత్తగా పరిశీలించాలని వివరిస్తున్నారు. లేనిపక్షంలో ఇది మరో మహా విపత్తుగా మారుతుందని హెచ్చరిస్తున్నారు.
దీనివల్ల ఏమవుతుంది
H5N1 బర్డ్ ఫ్లూ వైరస్ నేరుగా మనుషుల రోగ నిరోధక వ్యవస్థ మీద దాడి చేస్తుంది. ఇది తన రూపాన్ని ఎప్పటికప్పుడు మార్చుకుంటుంది. మందులకు కూడా లొంగదు. దీనిని నివారించేందుకు ఒక నిర్దిష్టమైన చికిత్స విధానం అంటూ లేదు. అందువల్ల ఈ వైరస్ మందులకు లొంగదు. ఒకవేళ మందులు ఉపయోగించినప్పటికీ వైరస్ ఎప్పటికప్పుడు తన రూపాన్ని మార్చేసుకుంటుంది. అందువల్ల వైరస్ నియంత్రణ సాధ్యం కాదు. అలాంటప్పుడు ఈ వైరస్ బారిన పడకుండా చూసుకోవడమే ఉత్తమం. ముఖ్యంగా జంతువులలో రకరకాల వ్యాధులు చోటుచేసుకుంటాయి.. అలాంటప్పుడు వాటిని జాగ్రత్తగా పరిశీలించాలి. వాటిని నివారించేందుకు మందులు వాడాలి. వ్యాధులు సోకిన జంతువులను అలా వదిలేస్తే అది మరింత ప్రమాదకరంగా మారుతుంది. ఎందుకంటే వ్యాధుల సోకిన జంతువుల్లో వైరస్ మ్యుటేషన్ త్వరగా అవుతుంది. దానివల్ల మనుషులు తీవ్రంగా ప్రభావితమయ్యే ప్రమాదం ఏర్పడుతుంది. అందువల్ల ముందస్తు జాగ్రత్తలు పాటించాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ” కోవిడ్ వల్ల ప్రపంచం మొత్తం తీవ్రంగా ఇబ్బంది పడింది. గత కొద్ది సంవత్సరాలుగా సానుకూల వాతావరణం వైపు ప్రయాణం సాగిస్తోంది. ఈ సమయంలో ఈ వైరస్ వెలుగుచూడడం ఆందోళన కలిగిస్తోంది. అయితే దీని నివారణకు ముందస్తు జాగ్రత్తలను పాటించాలి. అప్పుడే వైరస్ నియంత్రణ సాధ్యమవుతుంది. ముందస్తు జాగ్రత్తలు పాటించకపోతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ వైరస్ సంక్రమణ అత్యంత తీవ్రంగా ఉంటుంది. ఆ వైరస్ నేరుగా రోగనిరోధక శక్తి మీదనే అత్యంత తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుందని” శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.