https://oktelugu.com/

Game Changer : తమిళం లో ‘గేమ్ చేంజర్’ ప్రభంజనం సృష్టించబోతోందా..? ఇలాంటి అద్భుతమైన ఛాన్స్ ఏ సినిమాకి రాదేమో!

తమిళ సినిమాలను మన తెలుగు ఆడియన్స్ విపరీతంగా ఎగబడి చూస్తారు. కానీ మన తెలుగు సినిమాలను తమిళ ఆడియన్స్ అంతగా ఆదరించరు అంటూ విశ్లేషకులు చాలా కాలం నుండి పరిశీలించి చెప్తున్న మాట.

Written By:
  • Vicky
  • , Updated On : January 1, 2025 / 03:07 PM IST

    Game Changer

    Follow us on

    Game Changer : తమిళ సినిమాలను మన తెలుగు ఆడియన్స్ విపరీతంగా ఎగబడి చూస్తారు. కానీ మన తెలుగు సినిమాలను తమిళ ఆడియన్స్ అంతగా ఆదరించరు అంటూ విశ్లేషకులు చాలా కాలం నుండి పరిశీలించి చెప్తున్న మాట. అయితే ఈమధ్య కాలం లో మన తెలుగు సినిమాలకు కూడా అక్కడ మంచి వసూళ్లు వస్తున్నాయి. బాహుబలి సిరీస్, #RRR చిత్రాలకు భారీ వసూళ్లు రాగా, అల్లు అర్జున్ పుష్ప చిత్రం కూడా తమిళం లో మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది. ఇక గత ఏడాది విడుదలైన ప్రభాస్ కల్కి చిత్రం తమిళంలో యావరేజ్ రేంజ్ వసూళ్లను రాబట్టగా, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’ కి కళ్ళు చెదిరే రేంజ్ వసూళ్లు వచ్చాయి. రాజమౌళి సినిమా కాకుండా ఒక తెలుగు సినిమాకి అక్కడ దాదాపుగా వంద కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రావడం అల్లు అర్జున్ కే జరిగింది.

    అయితే ఇప్పుడు ఈ ‘పుష్ప 2’ రికార్డు ని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ చిత్రం అవలీల గా దాటేస్తుందని బలమైన నమ్మకం తో చెప్తున్నారు అక్కడి ట్రేడ్ పండితులు. ఎందుకంటే సంక్రాంతికి షెడ్యూల్ చేయబడ్డ తమిళ స్టార్ అజిత్ ‘విడాముయార్చి’ చిత్రాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా వేస్తున్నట్టు నిర్మాతలు నిన్న రాత్రి అధికారికంగా ప్రకటించారు. దీంతో రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ కి అడ్డే లేకుండా పోయింది. ఈ సంక్రాంతికి తమిళ ఆడియన్స్ కి రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ చిత్రం మినహా మరో ఛాయస్ లేదు. పైగా తమిళనాడు లో శంకర్ కి సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఉన్నంత క్రేజ్ ఉంది. ‘ఇండియన్ 2 ‘ వల్ల ఇప్పుడు కాస్త వెనకపడ్డాడు కానీ, ‘గేమ్ చేంజర్’ చిత్రానికి టాక్ వస్తే తమిళనాడు లో ప్రభంజనం సృష్టిస్తాడని అంటున్నారు అక్కడి ట్రేడ్ పండితులు.

    ఇప్పటికే తమిళనాడు ట్రేడ్ సర్కిల్స్ లో ‘గేమ్ చేంజర్’ చిత్రం అద్భుతంగా వచ్చిందని, శంకర్ కం బ్యాక్ భారీ రేంజ్ లో ఉండబోతుందని ఒక టాక్ బాగా ప్రచారం అవుతుంది. ఆ టాక్ కి తగ్గట్టుగా, ఆడియన్స్ నుండి కూడా ఈ సినిమాకి అలాంటి రెస్పాన్స్ వస్తే ఆకాశమే హద్దు అనే విధంగా వసూళ్లు ఉంటాయి. కేవలం తమిళంలో మాత్రమే కాదు, బాలీవుడ్ లో కూడా ‘గేమ్ చేంజర్’ చిత్రానికి పోటీ లేదు. తెలుగు లో కూడా రెండు రోజుల వరకు గేమ్ చేంజర్ చిత్రానికి సోలో రిలీజ్ ఉండనుంది. ఇవన్నీ చూస్తుంటే ఈ చిత్రానికి టాక్ వస్తే మొదటి రోజు 200 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు అవలీలగా వచ్చేస్తాయని, ఫుల్ రన్ లో వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టేందుకు అత్యధిక అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ పండితులు. చూడాలి మరి ఆ రేంజ్ కి ఈ చిత్రం వెళ్తుందా లేదా అనేది.