https://oktelugu.com/

ఆ పని చేసిందని బాలికను కొట్టిచంపిన తాత, మామ

సభ్యసమాజం ఆధునికత వైపు దూసుకెళుతుంటే ఇంకా మనం కట్టుబాట్ల పేరుతో ఖతం చేస్తున్న పరిస్థితులు దాపురించాయి. ఆధునిక వేషధారణతో ఇప్పుడు యువత, మహిళలు ప్రపంచవ్యాప్తంగా తమ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. ఆ స్వేచ్ఛను అనుభవిస్తున్నారు. కానీ మన దేశంలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులున్నాయి. ఉత్తరప్రదేశ్ లో దారుణం జరిగింది. గ్రామంలో జీన్స్ వేసుకొని తిరుగుతోందని.. విచ్చలవిడిగా సోకులకు పోతోందని 17 ఏళ్ల బాలికను ఆమె తాత, ఇద్దరు మామలు కొట్టిచంపిన దారుణం చర్చనీయాంశమైంది. ఉత్తరప్రదేశ్ లోని దేవరియా […]

Written By: , Updated On : July 23, 2021 / 04:49 PM IST
Follow us on

Girl Beaten To Death Wearing of Jeans

సభ్యసమాజం ఆధునికత వైపు దూసుకెళుతుంటే ఇంకా మనం కట్టుబాట్ల పేరుతో ఖతం చేస్తున్న పరిస్థితులు దాపురించాయి. ఆధునిక వేషధారణతో ఇప్పుడు యువత, మహిళలు ప్రపంచవ్యాప్తంగా తమ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. ఆ స్వేచ్ఛను అనుభవిస్తున్నారు. కానీ మన దేశంలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులున్నాయి.

ఉత్తరప్రదేశ్ లో దారుణం జరిగింది. గ్రామంలో జీన్స్ వేసుకొని తిరుగుతోందని.. విచ్చలవిడిగా సోకులకు పోతోందని 17 ఏళ్ల బాలికను ఆమె తాత, ఇద్దరు మామలు కొట్టిచంపిన దారుణం చర్చనీయాంశమైంది.

ఉత్తరప్రదేశ్ లోని దేవరియా జిల్లాలో ఈనెల 19న ఈ దారుణం జరిగింది. అది ఇప్పుడు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మహువాదీహ్ గ్రామానికి చెందిన బాలిక కొన్నాళ్లుగా పంజాబ్ లోని లుథియానాలో తల్లిదండ్రులతో కలిసి ఉండేది. ఆయన తండ్రి ఉద్యోగం కారణంగా వారితోనే జీవించేది. ఆయన మృతి అనంతరం ఇటీవల తల్లితో కలిసి సొంత గ్రామానికి తిరిగొచ్చింది.

అయితే సంప్రదాయంగా బతుకుతున్న ఆ అమ్మమ్మగారి ఇంట్లో ఈ బాలిక వేషధారణ చేష్టలు వెగటు పుట్టించాయి. బాలిక గ్రామంలో జీన్స్ వేసుకొని విచ్చలవిడిగా తిరుగుతోందని కుటుంబ పెద్దలైన తాత, మామలు సీరియస్ అయ్యారు. జీన్స్ వేసుకోవద్దని బాలికకు సూచించారు. కానీ వారు వినలేదు. వారి కంట పడకుండా ఇంటి బయటే బాలిక ఉంటూ వచ్చింది. దీనిపై సోమవారం బాలికకు, పెద్దలకు గొడవ జరిగింది. ఈ క్రమంలోనే ఆగ్రహించిన తాత, మామలు ఆమెను గోడకేసి కొట్టడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతిచెందింది. అనంతరం మృతదేహాన్ని ఆటోలో తీసుకెళ్లి ఓ వంతెనకింద పడేశారు. కొందరు ప్రయాణికులు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు విచారణలో జీన్స్ వేసుకుందని పరువు తీస్తుందని తామే చంపేశామని తాత తెలిపారు. ఇక మామలు పరారీ అయ్యారు.