Happy Days Actress Appu: 2007లో విడుదలైన హ్యాపీ డేస్ ఓ సంచలనం. అప్పట్లో యూత్ ని ఊపేసిన చిత్రమది. ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల ఇంజనీరింగ్ స్టూడెంట్స్ లైఫ్ ని కొత్తగా, వాస్తవాలకు దగ్గరగా, ఎంటర్టైనింగ్ గా తెరకెక్కించారు. ఈ సినిమాతో నిఖిల్, వరుణ్ సందేశ్ తో పాటు రాహుల్ వంటివారు వెండితెరకు పరిచయమయ్యారు. అసలు పేర్ల కంటే కూడా పాత్రల పేర్లతోనే హ్యాపీ డేస్ నటులు ఫేమస్ అయ్యారు. టైసన్, శ్రావ్స్, చందు, మధు పాత్రలు చాలా కాలం ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయాయి. హ్యాపీ డేస్ ప్రధాన పాత్రల్లో అపర్ణ అలియాస్ అప్పు ఒకటి.

అబ్బాయి హెయిర్ కట్, షర్ట్స్, ప్యాంట్స్ ధరించే అప్పు, రాజేష్(నిఖిల్) ని ఇష్టపడుతుంది. అప్పు పాత్రను గాయత్రీ రావ్ చేసింది. హ్యాపీ డేస్ ద్వారా ఫేమ్ తెచ్చుకున్న నటుల్లో గాయత్రీ రావు కూడా ఒకరు. ఆ సినిమా భారీ హిట్ కొట్టినప్పటికీ గాయత్రీ రావుకు చెప్పుకోదగ్గ ఆఫర్స్ రాలేదు. చిన్న చిన్న పాత్రలకే పరిమితమయ్యారు. హీరోయిన్ గా చేసిన తమన్నా స్టార్ కాగా, వరుణ్ సందేశ్, నిఖిల్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు.
Also Read: Pavan Kalyan Third Wife Assets: పవన్ మూడో భార్య పేరిట ఎన్ని ఆస్తులున్నాయి?
ఇక గాయత్రీ రావు ఆరెంజ్, గబ్బర్ సింగ్ చిత్రాల్లో నటించారు. గబ్బర్ సింగ్ మూవీలో పవన్ పై క్రష్ ఉన్న అమ్మాయిగా కొంచెం బోల్డ్ రోల్ చేశారు. ఆ పాత్ర చేసింది హ్యాపీ డేస్ అప్పు అని చాలా మందికి తెలియదు. హ్యాపీ డేస్ లుక్ కి గబ్బర్ సింగ్ మూవీలో ఆమె లుక్ పూర్తి డిఫరెంట్ గా ఉంటుంది. ఇక హీరోయిన్ కావాలన్న ఆమె ఆశలు తీరకపోవడంతో పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యారు. పెళ్లి తర్వాత ఆమె లుక్ పూర్తిగా మారిపోయింది.

కాగా గాయత్రీ రావ్ తల్లిదండ్రులు కూడా నటులు కావడం విశేషం. బెంగుళూరు పద్మ, అరుణ్ కుమార్ ల కుమార్తె ఆమె. పలు చిత్రాల్లో నటించిన బెంగుళూరు పద్మ సీరియల్ నటిగా బాగా పాప్యులర్. ప్రస్తుతం గాయత్రీ రావ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అనుభవిస్తున్నారు. ఇప్పటికీ నటనపై ఆసక్తి ఉందంటున్న గాయత్రీ రావు అవకాశాలు వస్తే రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధం అంటున్నారు.
Also Read:Ravi Teja Injured: షూటింగ్ సెట్స్ లో రవితేజకు ప్రమాదం… తీవ్ర గాయాలు
[…] Also Read: Happy Days Actress Appu: అసలు గుర్తు పట్టలేనంతగా మార… […]