Homeఆంధ్రప్రదేశ్‌AP SSC Results: పదో తరగతి ఫలితాల్లో ‘ఏపీ సర్కారు’ ఫెయిల్

AP SSC Results: పదో తరగతి ఫలితాల్లో ‘ఏపీ సర్కారు’ ఫెయిల్

AP SSC Results: విజయవాడ బందరు రోడ్డులోని ఆర్అండ్ బీ భవనమది. శనివారం ఉదయం 11 గంటలకు మీడియా ప్రతినిధులు, విద్యాశాఖ అధికారుల హడావుడితో సందడి వాతావరణ నెలకొంది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు రాసిన సుమారు 6 లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదల చేస్తామని చెప్పిన సమయం అసన్నమైంది. కానీ ఎవరూ కానరావడం లేదు. . ఫలితాలు విడుదల చేస్తారని ప్రభుత్వం చెప్పిన పాఠశాల విద్య ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్‌ జాడలేదు. అనుకున్న సమయానికి సమయం మించిపోతున్నాఆయన మాత్రం రాలేదు. తీరా చావుకబురు చల్లగా అన్నట్లు.. ఫలితాల విడుదల సోమవారానికి వాయిదా వేశామన్న సందేశాన్ని మీడియా ప్రతినిధులకు పంపించారు. మీడియా ప్రతినిధులు నిరాశతో వెనుదిరిగారు. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు సైతం నిట్టూర్చారు.

AP SSC Results
AP SSC Results

Also Read: Telangana Police: బలమే.. బలహీనత!.. రాజకీయ ఒత్తిడిలో తెలంగాణ పోలీస్‌

ప్రభుత్వం విఫలం..
పదో తరగతి ఫలితాలను విడుదల చేయడంతో వైసీపీ ప్రభుత్వం విఫలమైంది. ఫలితాల విడుదల అంటే సరిగ్గా చెప్పిన సమయానికి ప్రకటించడం ఆనవాయితీ. ఏళ్లుగా అదే పని చేస్తున్నారు. ఏ ప్రభుత్వం ఉన్నా చెప్పిన సమయానికి ఫలితాలు విడుదల చేస్తారు. జగన్‌ సర్కారు మాత్రం చెప్పిన సమయానికి పదో తరగతి ఫలితాలను ప్రకటటించ లేక నవ్వులపాలైంది. అయితే తొలుత ఐదు నిమిషాలు ఆలస్యం ఉంటుందేమోనని అనుకున్నారు. 5 కాదు 15 నిమిషాలైనా అధికారులెవరూ రాలేదు. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు, వారి కుటుంబసభ్యులు అప్‌డేట్‌ కోసం, ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇంతలో ఫలితాల విడుదల వాయిదా వేస్తున్నట్టు మీడియా ప్రతినిధులకు సందేశం వచ్చింది. అయితే కొందరు దీన్ని నమ్మలేదు. వాయిదా వేస్తే ముందురోజే ప్రకటిస్తారు కదా అన్న సందేహం వచ్చింది. చెప్పిన సమయానికి ఫలితాలు విడుదలలో చేయడంలో ప్రభుత్వం ఫెయిలైందని తర్వాత అర్థమైంది.

AP SSC Results
AP SSC Results

ప్రస్టేజ్ ఇష్యూ
పదో తరగతి ఫలితాల విడుదల వాయిదా వెనుక మంత్రి, అధికారుల మధ్య ఈగో సమస్యలు కారణమని తెలుస్తోంది. విద్యా శాఖ మంత్రినైన తాను లేకుండా ఫలితాలు విడుదలను చేయాలని నిర్ణయించడంపై బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. మంత్రికి ముందే చెప్పామని, ఆయన రాననని చెబితేనే తాము ఫలితాలను విడుదల చేసేందుకు సమయం ప్రకటించామన్నది అధికారుల వాదనగా ఉంది. ఫలితాల విడుదల సమయానికి ఇదే విషయంపై ఈగోలు పెరిగి వాయిదాకు దారితీసిందని చెబుతున్నారు. కారణం ఏదైనా ప్రకటించిన సమయానికి ఫలితాలు విడుదల చేయకపోవడం ఇదే తొలిసారి. వాస్తవానికి పదో తరగతి పరీక్షల మూల్యాంకనం కొన్నిరోజుల క్రితమే పూర్తయింది. అంతా సిద్ధమయ్యాకే ఫలితాల విడుదలకు తేదీ, సమయం ప్రకటించారు. అయినా అప్పటికప్పుడు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. విద్యార్థుల చదువు పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో తెలియజేస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలా గతంలో ఎప్పుడూ జరగలేదని చెబుతున్నారు.

Also Read:BJP- Jagan: జగన్‌తో దోస్తీ ముప్పేనా? ఆర్కే భాష్యంలో ఆంతర్యం ఆదెనా?

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Nara Lokesh

Nara Lokesh: సాక్షి.. పాడిందే పాట.. లోకేష్ మీద తేల్చుకోవాల్సింది కోర్టులో..

Nara Lokesh: ఒక తప్పు జరిగింది. ఆ తప్పును ఆధారాలతో సహా నిరూపించాలి అంటే మన దగ్గర దమ్ము ఉండాలి. అన్నిటికి మించి సాక్షాలు ఉండాలి. ఆ తర్వాత కోర్టు దాకా వెళ్లాలి....
August School Holiday

August School Holidays: విద్యార్థులకు బంపర్ ఆఫర్.. ఆగస్టులో ఏకంగా 10 రోజులు..!

August School Holidays: సాధారణంగా విద్యార్థులకు సెలవులు అంటే చాలా ఇష్టం. పాఠశాలలకు వరుసగా సెలవులు వస్తున్నాయంటే వారిలో సరదా వేరు. అటువంటి సరదా తెచ్చింది ఆగస్టు నెల. ఒకటి కాదు రెండు...
Delhi Protests

Delhi Protests: సీజేపీ నిరసనల వెనుక రెజీమ్‌ చేంజ్‌ వ్యూహాలు.. అలర్ట్‌ కాకుంటే ఆ దేశాల గతే!

Delhi Protests: ఢిల్లీలో ఇటీవల జరిగిన నిరసనలు కేవలం సాధారణ ప్రజా ఉద్యమం కాదని, వ్యవస్థీకృత రెజీమ్‌ చేంజ్‌ ప్రయత్నంగా చూడాల్సిన అవసరం ఉందని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. శాంతియుత మార్గాల ద్వారా...
Bhogapuram Airport

Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయం పై రీల్స్.. ఏపీ ప్రభుత్వం సంచలనం!

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం పై రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ప్రచారం చేస్తోంది. వినూత్న కార్యక్రమాలను చేపడుతోంది. పాఠశాల విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు.. ఈనెల 26 నుంచి విద్యార్థులకు రకరకాల పోటీలు...
Team India Test Cricket

Team India Test Cricket: ఈ గాయపడ్డ సింహాలను నమ్ముకుంటే.. లంకా దహనం అయినట్టే..

Team India Test Cricket: వైట్ బాల్ ఫార్మాట్ లో టీమిండియా చెప్పుకునే స్థాయిలో విజయాలు సాధించలేకపోతోంది. అలాగని రెడ్ బార్ ఫార్మాట్లో అదరగొట్టడం లేదు.. కాకపోతే వచ్చే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్...
Oktelugu Epaper